ఇంటి అడ్రెస్ చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టాడు
నిజానికి ఒక డైరెక్టర్ ఇంత కాన్ఫిడెంట్ గా ఛాలెంజ్ చేసిన సందర్భం అరుదు. కానీ మారుతి ఎంతో బోల్డ్ గా ఇలా సవాల్ చేసారు.
By: Sivaji Kontham | 28 Dec 2025 12:01 AM ISTప్రభాస్ నటించిన హారర్ కామెడీ చిత్రం `ది రాజా సాబ్` సంక్రాంతి సందర్భంగా జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. ఇది అగ్ర హీరోలు నటించిన తెలుగు, తమిళ చిత్రాలతో పోటీపడనుంది. విడుదల సమీపిస్తున్న తరుణంలో భారీ ప్రీరిలీజ్ ఈవెంట్లో రాజా సాబ్ సంగతుల్ని ముచ్చటించింది చిత్రబృందం.
అయితే ది రాజా సాబ్ ప్రీరిలీజ్ లో మారుతి విసిరిన బోల్డ్ ఛాలెంజ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా నిరాశపరిస్తే, తన ఇంటికి వచ్చి పగ తీర్చుకోమని ప్రభాస్ ఫ్యాన్స్ కి సవాల్ విసిరారు. ఈ సినిమాలోని ప్రభాస్‌ను చాలా సంవత్సరాల పాటు గుర్తుంచుకుంటారని వ్యాఖ్యానించిన మారుతి సినిమాపై అంచనాలను పెంచారు.
``నా పని పూర్తయింది.. డ్యూటీ ముగించాను. నేను చెబుతున్నాను.. ఈ సినిమా చూడండి.. ఎక్కడైనా మిమ్మల్ని 1 శాతం నిరాశపరిచినా నా ఇంటి అడ్రెస్ ఇస్తున్నా... నా దగ్గరకు రండి.. రెబల్స్ కానీ, యూత్ కానీ.. ఫ్యాన్స్ కానీ నా దగ్గరకు రండి.. గుర్తు పెట్టుకోండి.. విల్లా నం.17 - కొల్లా లగ్జూరియా`` అంటూ సవాల్ విసిరారు. ఇన్ని రోజులు ప్రభాస్ ఫోటోని చూపిస్తున్నాను కదా.. ఇప్పుడు ఈయననే చూపిస్తున్నాను... అంటూ మారుతి సరదాగా వేదికపై వ్యాఖ్యానించారు.
నిజానికి ఒక డైరెక్టర్ ఇంత కాన్ఫిడెంట్ గా ఛాలెంజ్ చేసిన సందర్భం అరుదు. కానీ మారుతి ఎంతో బోల్డ్ గా ఇలా సవాల్ చేసారు. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి నచ్చకపోతే తనను ఇంటి కొచ్చి నిలదీయమని ఐడియా కూడా ఇచ్చాడు. ఒక సినిమా దర్శకుడి ఆత్మవిశ్వాసం, నమ్మకం చూస్తుంటే, ది రాజా సాబ్‌లో ఏదో అసాధారణమైన విషయాన్ని, మునుపెన్నడూ చూడని దానిని చూపిస్తున్నాడని అందరూ భావిస్తున్నారు.
బాహుబలి మొదలు, కల్కి, సలార్ ఇవన్నీ ఫ్రాంఛైజీ చిత్రాలు. ఇదే కేటగిరీలో ది రాజా సాబ్ కూడా ఫ్రాంఛైజీగా మారుతోంది. నిర్మాత విశ్వ ప్రసాద్ ఈ సినిమా విడుదల కావడానికి చాలా ముందుగానే ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, `రాజా సాబ్ 2` కచ్చితంగా వస్తుంది కానీ అది పార్ట్ 1కి కొనసాగింపు కాదు.. అని తెలిపారు. అదే థీమ్, హారర్ అంశాలను ప్రతిబింబించే ఒక కొత్త కథతో తీస్తామని అన్నారు. అదే ఫ్రాంచైజీ మల్టీవర్స్‌లో ఒక విభిన్న కథగా ఉంటుందని అన్నారు.
