Begin typing your search above and press return to search.

అగ‌ర్వాల్ బ్యూటీ మాలీవుడ్ కి షిప్ట్ అవుతుందా?

తాజా ప‌రిస్థితి చూస్తే? ఒకవైపు కొత్త హీరోయిన్ల రాకతో పోటీ మ‌రింత పెరిగింది. వాళ్ల‌ను త‌ట్టుకుని నిలండ‌టం అంత సుల‌భం కాదు.

By:  Sivaji Kontham   |   1 May 2026 5:00 AM IST
అగ‌ర్వాల్ బ్యూటీ మాలీవుడ్ కి షిప్ట్ అవుతుందా?
X

`ఇస్మార్ట్ శంకర్`విజయం తో నిధి అగర్వాల్ కెరీర్ ఓ వెలుగు వెలిగిపోతుంద‌ని అంతా భావించారు. కానీ అమ్మ‌డి ప్ర‌యాణ అందుకు భిన్నంగా సాగింది. ఆ తర్వాత న‌టించిన‌ చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించ‌లేదు. ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం `ది రాజా సాబ్` రూపంలో రావడంతో ఈ సినిమాతోనైనా కెరీర్‌ మళ్ళీ గాడిలో పెడుతుందని నిధి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ సంక్రాంతి కానుకగా విడుద లైన చిత్రం మిశ్రమ స్పందన బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయింది. ఒక స్టార్ హీరో సరసన నటించినప్పుడు వచ్చే క్రేజ్ ఆ హీరోయిన్ కెరీర్‌ను మార్చేస్తుందని అంచనా వేస్తారు.

కానీ `ది రాజా సాబ్` విషయంలో అది జరగలేదు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నిధి న‌టించినా? సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆశలపై నీళ్లు చల్లిన‌ట్లు అయింది. మ‌రి ఇప్పుడు నిధి ప‌రిస్థితి ఏంటి? అంటే? ఇకపై తెలుగులో స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడం కష్టమేనన్న వాద‌న తెర‌పైకి వ‌స్తోంది. తెలుగు - తమిళ భాషల్లో వరుస ఫ్లాపులు నిధిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. త‌మిళ్ లో నటించిన `భూమి`, `ఈశ్వరన్`, `కలగ తలైవన్` వంటి చిత్రాలు కోలీవుడ్‌లో ఆశించిన బ్రేక్ ఇవ్వలేదు.

తాజా ప‌రిస్థితి చూస్తే? ఒకవైపు కొత్త హీరోయిన్ల రాకతో పోటీ మ‌రింత పెరిగింది. వాళ్ల‌ను త‌ట్టుకుని నిలండ‌టం అంత సుల‌భం కాదు. దీంతో నిధి రూటు మార్చాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అమ్మ‌డు తెలుగు పరిశ్రమను వదిలి మాలీవుడ్ కు షిఫ్ట్ కావాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మలయాళ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం కంటెంట్ పరంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. గ్లామర్ పాత్రల కంటే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలకు అక్కడ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే నిధి ట్యాలెంట్ నిరూపించుకోవడానికి మలయాళ రంగమే సరైన వేదిక అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కేరళకు మకాం మార్చడం ద్వారా అక్కడ కొత్త అవకాశాల కోసం ప్రయత్నించాలన్న‌ది ఆమె ప్లాన్ గా చెప్పొచ్చు. నిధికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. అమ్మ‌డి అందానికి, అభినయానికి ఫ్యాన్స్ ఫిదా అవుతారు. అయితే సరైన సక్సెస్ లేకపోతే ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా? రేసులో వెనుకబడిపోవడం సహజం. కేరళకు షిఫ్ట్ అవ్వడం ద్వారా నిధి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను కొత్త కోణంలో ప్రారంభించే ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఒకట్రెండు మంచి విజయాలు దక్కితే మళ్ళీ టాలీవుడ్‌లోకి ఘనంగా రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశం ద‌క్కుతుంది. చిత్ర పరిశ్రమలో జయాపజయాలు సహజం. క‌ష్టే ఫ‌లి అన్న దాన్ని న‌మ్ముతూనే కాస్తంత అదృష్టం కూడా తోడైతే? కంబ్యాక్ అవ్వ‌డం పెద్ద విష‌యం కాదు. నిధి ఇప్పుడా మాట‌ను బ‌లంగా న‌మ్మి ప్ర‌యాణం మొద‌లు పెడుతున్న‌ట్లు తెలుస్తోంది.