రాజా సాబ్ పై అవతార్ ఎఫెక్ట్.. అందుకే అక్కడ అలా..
ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్, గ్లింప్స్ కూడా హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ లో రిలీజ్ చేశారు.
By: M Prashanth | 6 Dec 2025 10:42 AM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ ది రాజా సాబ్. హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమా.. వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి పండుగ కానుకగా వరల్డ్ వైడ్ గా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సందడి చేయనుంది.
ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అవ్వగా.. వాటిని అందుకుంటామని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టే హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు. అయితే సినిమాను 2026 జనవరి 9వ తేదీన ఐమాక్స్ వెర్షన్‌తో సహా అన్ని ఫార్మాట్ లలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే తెలిపారు.
ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్, గ్లింప్స్ కూడా ఐమ్యాక్స్ లో రిలీజ్ చేశారు. దీంతో మూవీ ఐమ్యాక్స్ వెర్షన్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే ఓవర్సీస్ లో ఆ ఫార్మాట్ లో ఇప్పుడు రాజా సాబ్ సినిమా రిలీజ్ అవ్వడం లేదని తెలుస్తోంది. ఈ మేరకు డిస్ట్రిబ్యూషన్ సంస్థ పోస్ట్ పెట్టింది.
ఓవర్సీస్ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్.. విదేశాల్లో రాజాసాబ్ ను రిలీజ్ చేయనుంది. అయితే ఇప్పుడు ఓవర్సీస్ లో ఐమ్యాక్స్ ఫార్మాట్ లో రాజా సాబ్ రిలీజ్ అవ్వడం లేదని సోషల్ మీడియాలో తెలిపింది. అవతార్ 3, ఐమ్యాక్స్ మధ్య నాలుగు వారాలు ప్రత్యేక ఒప్పందం ఉండడమే అందుకు కారణంగా వెల్లడించింది.
అందుబాటులో ఉన్న అన్ని PLF, DBOX, ఇతర ప్రత్యేక ఫార్మాట్ ల్లో సినిమా చూడండని కోరింది. అయితే ఆ ఫార్మాట్ లు కూడా నాలుగు వారాల పాటు అవతార్ 3తో ఒప్పందం చేసుకుని ఉన్నాయని, కానీ ఎప్పటిలాగే వీలైనన్ని ఎక్కువ ప్రత్యేక ఫార్మాట్ షోలను పొందేందుకు తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని ప్రత్యంగిరా తెలిపింది.
నిజానికి.. అవతార్ -3 మూవీ డిసెంబర్ 19వ తేదీన రిలీజ్ కానుంది. రాజా సాబ్.. జనవరి 9వ తేదీన విడుదల అవ్వనుంది. రెండింటికి మధ్య నాలుగు వారాల కన్నా తక్కువ గ్యాప్ ఉంది. కాబట్టి ఇప్పటికే అవతార్ మేకర్స్.. ఐమ్యాక్స్ తో ఒప్పందం చేసుకోవడంతో రాజా సాబ్ పై ఆ ఎఫెక్ట్ పడింది. ఐమ్యాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ కావడానికి వీలు లేకుండా పోయింది. దీంతో కొందరు ఓవర్సీస్ ఫ్యాన్స్ నెట్టింట నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
