రాజా సాబ్ ఫస్ట్ డే.. ప్రభాస్ ఆ రికార్డులను కొట్టేస్తాడా?
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు అందరి కళ్లు ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' మీదే ఉన్నాయి.
By: M Prashanth | 7 Jan 2026 9:36 AM ISTటాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు అందరి కళ్లు ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' మీదే ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్‌గా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న ప్రభాస్, ఈసారి మారుతి డైరెక్షన్‌లో ఒక హారర్ కామెడీతో వస్తుండటం విశేషం. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన భారీ యాక్షన్ సినిమాల కంటే భిన్నంగా, ఒక ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమా మొదటి రోజు ఏపీ, తెలంగాణల్లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందనే చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అత్యధిక షేర్ సాధించిన సినిమాల లిస్టును చూస్తే.. రాజమౌళి 'RRR' రూ.74.11 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత వచ్చిన 'పుష్ప 2' రూ.70.81 కోట్లతో తన సత్తా చాటింది. ఇప్పుడు 'రాజా సాబ్' టార్గెట్ ఈ టాప్ రికార్డులే. ప్రభాస్ రేంజ్ కి ఈ రికార్డులను బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా పండుగ సీజన్ అడ్వాంటేజ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ కానుంది.
ఇక పవన్ కళ్యాణ్ OG రూ.64.56 కోట్లు, ఎన్టీఆర్ దేవర రూ.61.65 కోట్లతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రభాస్ సినిమాలైన సలార్, కల్కి కంటే 'రాజా సాబ్' వసూళ్లు ఎక్కువగా ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇది కంప్లీట్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి, అన్ని వర్గాల ఆడియన్స్ థియేటర్లకు వచ్చే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం ఉన్న హైప్ చూస్తుంటే, 'రాజా సాబ్' మొదటి రోజు ఏపీ, తెలంగాణల్లో రూ.65 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు షేర్ రాబట్టే అవకాశం ఉందని ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఒకవేళ టికెట్ రేట్ల పెంపు, అదనపు షోలకు ప్రభుత్వం నుంచి పక్కాగా పర్మిషన్లు వస్తే, ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రభాస్ క్రేజ్ కి తోడు మారుతి మార్క్ కామెడీ వర్కౌట్ అయితే బాక్సాఫీస్ దగ్గర రికార్డుల బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇక 'రాజా సాబ్' టాప్ 3 లో ప్లేస్ సంపాదించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి 'RRR' లేదా 'పుష్ప 2' రికార్డులను ప్రభాస్ బ్రేక్ చేస్తారా అనేది వేచి చూడాలి. ఈ సంక్రాంతికి ప్రభాస్ వింటేజ్ లుక్స్ తో ఆడియన్స్ ని థియేటర్లలో ఏ రేంజ్ లో అలరిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అత్యధిక షేర్ సాధించిన టాప్ సినిమాలు:
RRR: రూ.74.11 కోట్లు
పుష్ప 2: రూ.70.81 కోట్లు
OG: రూ.64.56 కోట్లు
దేవర: రూ.61.65 కోట్లు
సలార్: రూ.50.49 కోట్లు
కల్కి 2898 AD: రూ.44.86 కోట్లు
బాహుబలి 2: రూ.43 కోట్లు
