ది రాజాసాబ్ లో ముగ్గురు కాదు 8 మంది హీరోయిన్స్.. గమనించారా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం ది రాజాసాబ్.
By: Madhu Reddy | 9 Jan 2026 11:36 AM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం ది రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. భారీ బడ్జెట్ తో అంతకు మించిన అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో కళకళలాడుతోంది. ప్రస్తుతం మొదటి షో పూర్తవగా ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ లభించింది.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో జరీనా వహాబ్ , సంజయ్ దత్ , బోమన్ ఇరానీ తదితరులు కీలకపాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసిన రోజు నుంచి విడుదల అయ్యే వరకు కూడా ఇందులో ముగ్గురు హీరోయిన్లు అంటూ నిధి అగర్వాల్, రిద్దీ కుమార్, మాళవిక మోహనన్ పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు ఎక్కడ చూసినా కూడా ఈ ముగ్గురి గురించే ప్రస్తావన వచ్చింది. కానీ సినిమా విడుదలయ్యాక చూస్తే ఇందులో ముగ్గురు కాదు ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్లు కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు.
మరి రాజాసాబ్ సినిమాలో నటించిన ఆ మిగతా 5 మంది హీరోయిన్లు ఎవరు అనే విషయానికి వస్తే.. జరీనా వహాబ్. ఇందులో ప్రభాస్ కి నానమ్మ పాత్రలో నటించింది. కానీ ఒకప్పుడు ఈమె బాలీవుడ్ అందాల తార. హీరోయిన్గా ఎన్నో చిత్రాలు చేసిన ఈమె.. ఒక్క హిందీలోనే కాదు తెలుగులో కూడా చాలా చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమెతో పాటు తమిళ్ హీరోయిన్ అమ్ము అభిరామి, ఆనంది, ఇనయా సుల్తానా, మనీషా కందుకూర్ స్నేహితులుగా కనిపించారు. అయితే ఇందులో వీరు స్నేహితులుగా కనిపించినా.. చాలా చిన్న సినిమాలలో హీరోయిన్లుగా నటించారు. అలా రాజాసాబ్ లో ముగ్గురు మాత్రమే కాదు మొత్తం ఎనిమిది మంది హీరోయిన్లు ఉన్నారు. ఇప్పటికే మీరు సినిమా చూసి ఉంటే ఈ విషయం మీకు తెలిసిపోతుంది. ఒకవేళ మీరు ఇంకా సినిమా చూడకపోయి ఉంటే ఈ విషయాన్ని ఈజీగా గమనించవచ్చు. అలా మొత్తానికైతే ఎనిమిది మంది హీరోయిన్లతో మారుతి చక్కగా ప్లాన్ చేశారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
