Begin typing your search above and press return to search.

దసరాకి జీరో నాలెడ్జ్.. ప్యారడైజ్‌కు మాత్రం అన్నీ నోట్ చేసుకున్నా!

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By:  Sravani Lakshmi Srungarapu   |   15 Sept 2026 1:03 PM IST
దసరాకి జీరో నాలెడ్జ్.. ప్యారడైజ్‌కు మాత్రం అన్నీ నోట్ చేసుకున్నా!
X

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొద‌టి సినిమాతోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న శ్రీకాంత్ ఓదెల.. ఇప్పుడు ది ప్యారడైజ్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే దసరా నుంచి ది ప్యారడైజ్ వరకు తనలో చాలా మార్పు వచ్చిందని డైరెక్ట‌ర్ చెబుతున్న మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా సినిమా తీయడం ఒక్కటే తెలిసిన తనకు.. ఈసారి సినిమా వెనుక ఉన్న ప్రతి అంశంపై అవగాహన పెరిగిందని చెప్పడం గమనార్హం.

దసరా సినిమా టైమ్ లో తనకు బిజినెస్ గురించి కానీ, ప్రేక్షకుల అంచనాల గురించి కానీ పెద్దగా అవగాహన లేదని శ్రీకాంత్ ఓదెల చెప్పాడు. తనకు తెలిసిందల్లా మంచి సినిమా తీయాలన్న ఆలోచన మాత్రమేనని, మిగతా విషయాలను నాని, నిర్మాత సుధాకర్ చెరుకూరి చూసుకుంటారనే నమ్మకంతో ముందుకెళ్లానని తెలిపాడు. అయితే ది ప్యారడైజ్ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, గత సినిమా అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్న శ్రీకాంత్.. ఈసారి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్లినట్లు చెప్పాడు.

ఇక్కడే ది ప్యారడైజ్ పై శ్రీకాంత్ ఓదెల కు ప్రెజ‌ర్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ప్రతి ఒక్క ప్రేక్షకుడిని శాటిస్‌ఫై చేయాల‌నే లక్ష్యంతో సినిమా విషయంలో చిన్న విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేయలేదని డైరెక్ట‌ర్ వెల్లడించాడు. ఆడియ‌న్స్ ను ఎప్పుడూ గ్రాంటెడ్‌గా తీసుకోకూడదని, వారికి వీలైనంత్ బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో పనిచేశానని చెప్పాడు. ఈ ఆలోచన కారణంగా చిన్న చిన్న విషయాల్లో కూడా రాజీ పడలేకపోయానని, చివరికి ఆ ఎఫెక్ట్ సినిమా ప్రొడ‌క్ష‌న్ నుంచి ఆర్టిస్టుల డేట్స్ వరకు అనేక అంశాలపై పడిందని వివరించాడు.

వీట‌న్నింటినీ బ‌ట్టి చూసుకుంటే ది ప్యారడైజ్, శ్రీకాంత్‌కు కేవ‌లం మరో సినిమా మాత్రమే కాద‌ని అర్థ‌మ‌వుతుంది. దసరాతో వచ్చిన సక్సెస్‌ను నిలబెట్టుకోవడంతో పాటు, తన మొదటి సినిమాతో పోలిస్తే మరింత బాధ్యతగా ఆలోచించిన ప్రాజెక్ట్‌గా ఇది కనిపిస్తోంది. అందుకే ఈసారి కథ, సన్నివేశాలు మాత్రమే కాకుండా ప్రేక్షకుల అనుభూతి, సినిమా మేకింగ్‌లోని ప్రతి చిన్న అంశంపైనా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ మారిన ఆలోచనా విధానం ది ప్యారడైజ్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే సెప్టెంబర్ 24 వరకు వేచి చూడాల్సిందే.