Begin typing your search above and press return to search.

జెన్యూన్ రివ్యూలకు నో రిస్ట్రిక్షన్స్.. నాని ఫుల్ క్లారిటీ

ది ప్యారడైజ్ పై కోర్టు ఆర్డర్.. రివ్యూలపై రిస్ట్రిక్షన్స్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని గంటలుగా చర్చ జరుగుతోంది.

By:  M Prashanth   |   23 Sept 2026 11:36 AM IST
జెన్యూన్ రివ్యూలకు నో రిస్ట్రిక్షన్స్.. నాని ఫుల్ క్లారిటీ
X

ది ప్యారడైజ్ పై కోర్టు ఆర్డర్.. రివ్యూలపై రిస్ట్రిక్షన్స్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని గంటలుగా చర్చ జరుగుతోంది. కానీ అసలు మ్యాటర్ వేరే.. సినిమా చూసి నిజం చెప్పే వాళ్లకు ఫుల్ ఫ్రీడమ్ ఉందంటూ హీరో నాని ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు నెట్టింట వైరల్‌ గా మారింది. సినిమా నచ్చితే నచ్చిందని.. నచ్చకపోతే నచ్చలేదని చెప్పడంలో ఎలాంటి సమస్య లేదని నాని క్లారిటీ ఇచ్చారు. ప్రేక్షకులు, సినీ విమర్శకులు తమ అభిప్రాయాలను ఫ్రీడమ్ తో చెప్పుకోవచ్చని తెలిపారు.

అయితే కావాలని సినిమాకు నష్టం కలిగించేలా తప్పుడు రివ్యూలు ఇవ్వడం, బాట్ రివ్యూలతో నెగిటివ్ ప్రచారం చేయడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇటీవల ది ప్యారడైజ్ నిర్మాతలు బెంగళూరు కోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియాలో కొన్ని ఖాతాల ద్వారా సినిమాపై కావాలని తప్పుడు ప్రచారం జరుగుతోందని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. గుర్తించిన కొన్ని అకౌంట్లు, పోస్టులు, URLలకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక్కడే అసలు క్లారిటీ వచ్చింది. ఆ ఆర్డర్ ప్రతి ఒక్కరి రివ్యూకు వర్తించదు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుడు తన ఎక్స్పీరియన్స్ ను చెప్పుకోవచ్చు. సినిమాలోని తమకు నచ్చిన పాయింట్లను ఎత్తి చూపొచ్చు. నచ్చిన అంశాలపై ప్రశంసలు కురిపించవచ్చు. నిజాయితీగా వచ్చే ఇలాంటి అభిప్రాయాలు ఆపే ఉద్దేశం లేదని నాని క్లియర్ గా చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరోవైపు, ట్రైలర్ విడుదలైన తర్వాత కొందరు వ్యక్తులు లేదా గ్రూపులు కలిసి సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని నిర్మాతలు ఆరోపించారు. ఇలాంటి ప్రచారం వల్ల సినిమా బిజినెస్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫేక్ కంటెంట్‌ పై మాత్రమే కోర్టు రిస్ట్రిక్షన్స్ విధించింది. ఆ ఆర్డర్లపై అక్టోబర్ 28వ తేదీ నెక్స్ట్ విచారణ జరగనుంది.

ఇక ది ప్యారడైజ్ విషయానికొస్తే.. దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. 1980ల సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ తో ఆ స్టోరీ సాగుతుంది. జడల్ జమానా అనే మాస్ రోల్ లో నాని కనిపించనుండగా.. మోహన్ బాబు శికంజ మాలిక్ పాత్రలో విలన్ గా నటించారు. కయాదు లోహర్, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఆ చిత్రానికి A సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల రన్‌ టైమ్‌ తో సినిమా థియేటర్లలోకి రానుంది. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఉంది. అందుకే ఇప్పుడు నాని చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. రివ్యూ వద్దు అనేది కాదు.. రివ్యూ పేరుతో కావాలని చేసే ఫేక్ ప్రచారం వద్దన్నది ది ప్యారడైజ్ టీమ్ వైపు నుంచి వచ్చిన అసలు క్లారిటీ.