Begin typing your search above and press return to search.

ప్యారడైజ్‌లో నాని కాకుండా ఆ ముగ్గురు..!

నాని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న 'ది ప్యారడైజ్‌' మూవీ విడుదలకు సిద్ధం అయింది.

By:  Ramesh Palla   |   22 Sept 2026 1:27 PM IST
ప్యారడైజ్‌లో నాని కాకుండా ఆ ముగ్గురు..!
X

నాని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న 'ది ప్యారడైజ్‌' మూవీ విడుదలకు సిద్ధం అయింది. సెప్టెంబర్‌ 24న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమా రికార్డ్‌ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు చాలా కొద్ది మంది హీరోలకు మాత్రమే రూ.100 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో నాని ఈ సినిమాతో చేరి పోయాడు. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 'ది ప్యారడైజ్‌' మూవీ కేవలం థియేట్రికల్‌ రైట్స్ ద్వారా రూ.100 కోట్లకు మించి రాబట్టింది. ఇక నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ ద్వారా దాదాపుగా రూ.80 కోట్లు రాబట్టి ఉంటుంది అనేది విశ్లేషకుల మాట. దాదాపుగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్ రూ.200 కోట్లుగా నమోదు అయినట్లు వార్తలు వస్తున్నాయి.

నాని ది ప్యారడైజ్‌ మూవీలో విలన్‌...

ది ప్యారడైజ్ మూవీ ఈ స్థాయిలో బిజినెస్ చేయడం వెనుక కేవలం హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల మాత్రమే కాకుండా మరికొందరు కూడా ఉన్నారు అనడంలో సందేహం లేదు. సినిమాకు విపరీతంగా బజ్ క్రియేట్‌ చేయడంలో సంగీత దర్శకుడు అనిరుథ్‌ ముఖ్య పాత్ర పోషించాడు. హీరోయిన్‌ కయాదు లోహర్‌ కారణంగా తమిళ్‌ లో మంచి బిజినెస్ జరిగింది. ఇక కీర్తి సురేష్ చేసిన ఐటెం సాంగ్‌ వల్ల కూడా మంచి బజ్ క్రియేట్‌ అయింది అనడంలో సందేహం లేదు. ఇక సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన మోహన్‌ బాబు, సంపూర్నేష్‌ బాబు, రాఘవ్‌ జుయల్‌ల వల్ల కూడా బిజినెస్ పెరిగిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హిందీ ప్రేక్షకులకు రాఘవ్‌ జుయల్‌ 'కిల్‌' సినిమాతో చాలా దగ్గర అయ్యాడు. ఆ సినిమా తర్వాత బాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ యాక్టర్‌గా రాఘవ్‌ జుయల్‌ నిలిచిన విషయం తెల్సిందే.

బాలీవుడ్‌ నటుడు రాఘవ్‌ జుయల్‌

బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న రాఘవ్‌ ను ఏరికోరి మరీ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ఈ సినిమాలో ఎంపిక చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. దాదాపు ఎనిమిది నెలలు ఆ పాత్ర కోసం నటుడిని వెతికినట్లుగా శ్రీకాంత్‌ పేర్కొన్నాడు. చివరకు కిల్‌ సినిమాలో రాఘవ్‌ ను చూసిన తర్వాత తన సినిమాలోని ఆ పాత్రకు సెట్‌ అవుతాడు అనిపించింది. అందుకే చిన్న చిన్న మార్పులు చేసి రాఘవ్‌ వద్దకు పాత్రను తీసుకు వెళ్లినట్లుగా చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ది ప్యారడైజ్‌ కు సంబంధించి రాఘవ్‌ లుక్ వైరల్‌ అయింది. అంతే కాకుండా విలన్‌గా రాఘవ్‌ తన విశ్వరూపం చూడటం ఖాయం అనిపిస్తుంది. ఇప్పటికే సంపూర్నేష్ బాబు లుక్‌ కి అంతా ఫిదా అయ్యారు. మోహన్‌ బాబు పాత్ర విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఈ ముగ్గురు సినిమాలో ఎలా కనిపిస్తారు, ఎంత వరకు కనిపిస్తారు, సినిమాకు ఏ మేరకు ప్రయోజనం కలిగిస్తారు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మోహన్‌ బాబు, సంపూర్నేష్‌ బాబు...

శ్రీకాంత్‌ ఓదెల తన కథలోని ప్రతి పాత్రకు ఆచితూచి ఆలోచించి నటీనటులను ఎంపిక చేసుకుంటాడు. వారిని ఒప్పించి మరీ తన సినిమాలోని పాత్రలకు నటీనటులను ఎంపిక చేసుకోవడం మనం చూశాం. మోహన్‌ బాబు ఇక సినిమాలు చేయడేమో అనుకుంటున్న సమయంలో ఈ సినిమాతో రాబోతున్నాడు. కచ్చితంగా ఈ సినిమాతో మోహన్‌ బాబుకు సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు కావడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు సంపూర్నేష్ బాబు కెరీర్‌ పూర్తిగా టర్న్‌ కావడంతో పాటు, ఇండస్ట్రీలో ఆయన ఇమేజ్ అమాంతం పెరుగుతుంది. ఇక బాలీవుడ్‌ నటుడు రాఘవ్‌ జుయల్‌ సైతం టాలీవుడ్‌లో స్ట్రాంగ్‌ పాత్రతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ది ప్యారడైజ్‌ మూవీ విడుదల తర్వాత కచ్చితంగా రాఘవ్‌ జుయల్‌ కోసం తెలుగు నిర్మాతలు క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ ముగ్గురు టాలీవుడ్‌లో ది ప్యారడైజ్‌ తర్వాత మోస్ట్‌ బిజీ ఆర్టిస్ట్‌లుగా మారడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన డాన్స్‌తో సర్‌ప్రైజ్‌ చేసిన రాఘవ్‌ కచ్చితంగా టాలీవుడ్‌లో వరుస సినిమాలకు సైన్ చేయబోతున్నాడు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.