Begin typing your search above and press return to search.

యూఎస్‌లో నాని టాప్ కలెక్షన్స్.. ‘ప్యారడైజ్’ దాటుతుందా?

దసరా, సరిపోదా శనివారం, ‘హిట్ 3’తో ఆ రేంజ్ ఇంకా పెరిగింది. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ ముందు నాని కెరీర్‌లోనే మరో పెద్ద టార్గెట్ ఉంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు అతని బెస్ట్ కలెక్షన్ ‘సరిపోదా శనివారం’దే.

By:  M Prashanth   |   19 Sept 2026 4:52 PM IST
యూఎస్‌లో నాని టాప్ కలెక్షన్స్.. ‘ప్యారడైజ్’ దాటుతుందా?
X

నాని సినిమాలకు నార్త్ అమెరికా ఎప్పటినుంచో మంచి మార్కెట్. పెద్ద యాక్షన్ సినిమా కావాల్సిన అవసరం లేకుండానే అక్కడ ఆయన సినిమాలు మిలియన్ డాలర్ మార్క్ దాటుతూ వచ్చాయి. జెర్సీ, హాయ్ నాన్న లాంటి ఎమోషనల్ సినిమాలు కూడా అక్కడ బాగా ఆడాయి. దసరా, సరిపోదా శనివారం, ‘హిట్ 3’తో ఆ రేంజ్ ఇంకా పెరిగింది. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ ముందు నాని కెరీర్‌లోనే మరో పెద్ద టార్గెట్ ఉంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు అతని బెస్ట్ కలెక్షన్ ‘సరిపోదా శనివారం’దే.

‘హిట్ 3’ తర్వాత నాని ఖాతాలో నార్త్ అమెరికాలో మిలియన్ డాలర్ దాటిన సినిమాలు 11. కామెడీ, ఫ్యామిలీ, రొమాన్స్, మాస్, క్రైమ్ థ్రిల్లర్.. ఇలా వేర్వేరు కథలతో నాని అక్కడ ఈ మార్క్ అందుకున్నాడు. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. సెప్టెంబర్ 19 మధ్యాహ్నం వరకు నార్త్ అమెరికా ప్రీమియర్ ప్రీసేల్స్ సుమారు 4.80 లక్షల డాలర్లకు చేరాయి.

అందులో యూఎస్ నుంచే 4.41 లక్షల డాలర్లు వచ్చాయి. దాదాపు 18,800 టికెట్లు అమ్ముడయ్యాయి. ప్రీమియర్స్‌కు ఇంకా ఐదు రోజులు ఉండటంతో మరిన్ని షోలు కూడా యాడ్ అవుతున్నాయి. అయితే నాని కెరీర్ టాప్ నార్త్ అమెరికా గ్రాస్ ఇప్పటికీ ‘సరిపోదా శనివారం’దే. ఆ సినిమా 2.49 మిలియన్ డాలర్లు చేసింది. ‘హిట్ 3’ 2.31 మిలియన్, ‘దసరా’ 2.05 మిలియన్ వరకు వెళ్లాయి. ‘ప్యారడైజ్’ నాని బెస్ట్‌గా నిలవాలంటే 2.5 మిలియన్ డాలర్లకు పైగా వెళ్లాలి.

అంచనాల ప్రకారం నాని $1 మిలియన్ + నార్త్ అమెరికా సినిమాలు

సరిపోదా శనివారం: 2.49M డాలర్స్

హిట్ 3: 2.31M డాలర్స్

దసరా: 2.05M డాలర్స్

హాయ్ నాన్న: 1.89M డాలర్స్

భలే భలే మగాడివోయ్: 1.43M డాలర్స్

జెర్సీ: 1.32M డాలర్స్

నిన్ను కోరి: 1.20M డాలర్స్

అంటే సుందరానికీ: 1.13M డాలర్స్

MCA: 1.08M డాలర్స్

నేను లోకల్: 1.08M డాలర్స్

ఈగ: 1.07M డాలర్స్

‘ప్యారడైజ్’కు ఈసారి స్కేల్ కూడా గత సినిమాల కంటే పెద్దది. శ్రీకాంత్ ఓదెలతో ‘దసరా’ తర్వాత మళ్లీ చేస్తున్న సినిమా కావడం, అనిరుధ్ సంగీతం, భారీ రిలీజ్ కూడా ఓవర్సీస్ బుకింగ్స్‌కు తోడయ్యాయి. అయితే టాప్ రికార్డు కోసం ప్రీమియర్స్‌తో పని పూర్తికాదు. మొదటి వీకెండ్ తర్వాత కూడా షోలు, వసూళ్లు అదే స్థాయిలో కొనసాగాలి. సెప్టెంబర్ 23న నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ మొదలవుతాయి. ఇంకా కొన్ని సెంటర్లలో షోలు యాడ్ కావాల్సి ఉంది. ప్రీమియర్ డే పూర్తయ్యేసరికి ‘ప్యారడైజ్’ ఎంత వరకు వెళ్లిందో తెలుస్తుంది. అక్కడి నుంచి 2.49 మిలియన్ డాలర్ల రికార్డు మీద గురి పెట్టొచ్చు.