Begin typing your search above and press return to search.

నాని మార్కెట్‌ను మించి వెళ్తున్న ది ప్యారడైజ్!

సినిమా చుట్టూ మేకర్స్ నిర్మిస్తున్న మిస్టరీ, కంటెంట్‌పై పెరుగుతున్న క్యూరియాసిటీ, బిజినెస్ పరంగా కనిపిస్తున్న రెస్పాన్స్... ఇవన్నీ కలిసే ఈ హైప్‌కు కారణంగా కనిపిస్తున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   15 Sept 2026 6:19 PM IST
నాని మార్కెట్‌ను మించి వెళ్తున్న ది ప్యారడైజ్!
X

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ రిలీజ్ కు కౌంట్‌డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం మేకర్స్ మరో ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. సినిమా రిలీజ్‌కు ఇంకా 9 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయంటూ కౌంట్‌డౌన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో ప్రమోషనల్ క్యాంపెయిన్ చివరి దశలోకి అడుగుపెట్టినట్టయింది. అయితే ది ప్యారడైజ్‌పై పెరుగుతున్న ఆసక్తిని కేవలం నాని స్టార్ ఇమేజ్‌తోనో, ఒక్కో పోస్టర్‌తోనో అర్థం చేసుకోవడం కష్టం. సినిమా చుట్టూ మేకర్స్ నిర్మిస్తున్న మిస్టరీ, కంటెంట్‌పై పెరుగుతున్న క్యూరియాసిటీ, బిజినెస్ పరంగా కనిపిస్తున్న రెస్పాన్స్... ఇవన్నీ కలిసే ఈ హైప్‌కు కారణంగా కనిపిస్తున్నాయి.




ముఖ్యంగా డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల కెరీర్‌ను పరిశీలిస్తే ది ప్యారడైజ్ అతని కెరీర్లో మరో కీలక అడుగుగా మారుతోంది. దసరాతో డైరెక్ట‌ర్ గా పరిచయమైన శ్రీకాంత్.. మొద‌టి సినిమాతోనే తనదైన టేకింగ్, పాత్రల ఎమోషన్స్, రా వరల్డ్‌ను తెరపై చూపించే విధానంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రెండో సినిమాకే మరింత భారీ స్థాయిలో కథను చెప్పే ప్రయత్నం చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంటే మొద‌టి సినిమాతో వచ్చిన క్రేజ్‌ను కొనసాగించడమే కాకుండా.. తన కథ చెప్పే పరిధిని, సినిమా స్కేల్‌ను మరింత విస్తరించే ప్రయత్నం చేస్తున్నాడనే డిస్క‌ష‌న్ మొదలైంది. ఏ డైరెక్ట‌ర్ అయినా రెండో సినిమా అంటే మామూలుగా మొదటి సినిమాతో వచ్చిన స‌క్సెస్ ను నిలబెట్టుకోవాల‌ని చూస్తారు. కానీ శ్రీకాంత్ మాత్రం ఆ ప్రెజ‌ర్ ను దాటి నెక్ట్స్ లెవెల్ ఎక్స్‌పెరిమెంట్‌కు వెళ్లినట్టుగా కనిపిస్తోంది.

ఇక ది ప్యారడైజ్ నాని మార్కెట్‌కు కూడా కొత్త పరీక్షగా మారుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే సాంగ్స్, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ఆడియ‌న్స్ లో భారీ క్రేజ్ ను పెంచుకుంది. మరోవైపు నార్త్ అమెరికాలో కనిపిస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ జోరు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ సినిమాకు ఉన్న క్రేజ్‌ను సూచిస్తోంది. ముఖ్యంగా నాని సినిమాలకు రెగ్యుల‌ర్ గా ఉండే ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ బేస్‌కు భిన్నంగా భారీ స్కేల్, యాక్షన్, కొత్త వరల్డ్‌ను జోడించడం ద్వారా ది ప్యారడైజ్ నాని మార్కెట్‌ను మరింత విస్తరించే ప్రయత్నంగా కనిపిస్తోంది.

అందుకే సెప్టెంబర్ 24న సినిమా రిజ‌ల్ట్ హిట్టా ఫ్లాపా అని మాత్ర‌మే కాకుండా నాని మార్కెట్ ఎంతవరకు పెరిగింది, శ్రీకాంత్ ఓదెల తన రెండో సినిమాతో ఏ స్థాయికి ఎదిగాడు అనే విషయాలను కూడా డిసైడ్ చేసే అంశంగా మారనుంది. రిలీజ్ కు కౌంట్‌డౌన్ మొదలైన నేపథ్యంలో ఇకపై వచ్చే ప్రతి ప్రమోషనల్ అప్డేట్ సినిమాపై అంచనాలను మరింత పెంచే అవకాశం ఉంది. క‌యాదు లోహ‌ర్ హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.