Begin typing your search above and press return to search.

నాని డే 1 బాక్సాఫీస్.. ది ప్యారడైజ్ సంగతేంటి?

ది ప్యారడైజ్‌పై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. దసరా తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల మళ్లీ కలవడం, నాని లుక్, టీజర్, పాటలు సినిమాపై బజ్ పెంచాయి.

By:  M Prashanth   |   16 Sept 2026 9:59 AM IST
నాని డే 1 బాక్సాఫీస్.. ది ప్యారడైజ్ సంగతేంటి?
X

ది ప్యారడైజ్‌పై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. దసరా తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల మళ్లీ కలవడం, నాని లుక్, టీజర్, పాటలు సినిమాపై బజ్ పెంచాయి. కానీ రిలీజ్ దగ్గరపడుతున్న టైమ్‌లో ట్రైలర్ ఉండదని నాని చెప్పడం కాస్త ఆశ్చర్యమే. సినిమా పూర్తి చేయడానికే టైమ్ సరిపోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో చివరి పది రోజుల్లో రావాల్సిన పెద్ద ప్రమోషనల్ పుష్ మిస్ అవుతుందా అనే టాక్ మొదలైంది.

నాని గత సినిమాల ఓపెనింగ్స్ చూస్తే ఆయన మార్కెట్ ఎంత పెరిగిందో తెలుస్తుంది. దసరా మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.38 కోట్ల గ్రాస్ అందుకుంది. హాయ్ నాన్న జానర్ వేరు కావడంతో రూ.10 కోట్ల దగ్గర మొదలైంది. సరిపోదా శనివారం దాదాపు రూ.20 కోట్ల ఓపెనింగ్ తెచ్చుకుంది. హిట్ 3 మళ్లీ నానిని రూ.35 కోట్లకు పైగా ఓపెనింగ్ రేంజ్‌కు తీసుకెళ్లింది. సినిమా జానర్, హైప్ బట్టి ఆయన మొదటి రోజు నెంబర్లు బాగా మారుతున్నాయి.

ది ప్యారడైజ్ మాత్రం హాయ్ నాన్న తరహా సినిమా కాదు. నాని కెరీర్‌లోనే భారీగా తీసిన ప్రాజెక్ట్. జడల్ లుక్, యాక్షన్, 1980ల సికింద్రాబాద్ బ్యాక్‌డ్రాప్‌తో మొదటి నుంచి పెద్ద సినిమా అనే ఫీల్ ఇచ్చారు. దసరా కాంబినేషన్ కూడా బుకింగ్స్‌కు ఉపయోగపడే అంశమే. అందుకే హిట్ 3 తర్వాత నాని నుంచి వచ్చే మరో పెద్ద ఓపెనింగ్ ఇదే అవుతుందని మొదట్లో అంచనాలు వచ్చాయి.

అలాంటి సినిమాకు ట్రైలర్ లేకపోవడం మాత్రం చివరి దశలో చిన్న లోటే. టీజర్ వచ్చి చాలా రోజులైంది. పాటలు బాగా వెళ్లినా కథ ఏంటి, నాని పాత్ర ఎలా ఉంటుంది, సినిమా మొత్తం ఏ టోన్‌లో నడుస్తుంది అనే విషయం నార్మల్ ప్రేక్షకుడికి ఇంకా పూర్తిగా తెలియదు. ట్రైలర్ ఉంటే రిలీజ్‌కు రెండు మూడు రోజుల ముందు మరోసారి హైప్ పెరిగే అవకాశం ఉండేది.

పైగా పాన్ ఇండియా అనే ట్యాగ్ కోసం పరుగెత్తడం లేదని నాని స్వయంగా చెప్పారు. ముందుగా తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చాలని అన్నారు. ఇతర భాషల్లో రిలీజ్ ఉన్నా మొదటి రోజు పెద్ద నెంబర్ రావాలంటే తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ నుంచే బలమైన బుకింగ్స్ రావాలి. హిట్ 3కు ఫ్రాంచైజీ పేరు కూడా తోడైంది. ప్యారడైజ్‌కు మాత్రం శ్రీకాంత్ ఓదెల నాని కాంబినేషన్, ఇప్పటివరకు వదిలిన కంటెంట్‌నే ప్రధానంగా నమ్ముకోవాల్సి వస్తోంది.

సెప్టెంబర్ 24 రిలీజ్ కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన తర్వాతే అసలు పరిస్థితి తెలుస్తుంది. దసరా స్థాయి ఓపెనింగ్‌కు వెళ్తుందా, హిట్ 3 నెంబర్లను టచ్ చేస్తుందా అనేది మొదటి రోజు వరకు ఆసక్తిగానే ఉంటుంది. ట్రైలర్ లేకపోయినా బుకింగ్స్ గట్టిగా వస్తే టీమ్ తీసుకున్న నిర్ణయానికి పెద్ద ఇబ్బంది ఉండదు. మొదటి రోజు నుంచే మౌత్ టాక్ బలంగా వస్తే వీకెండ్ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.