Begin typing your search above and press return to search.

నాని ప్యారడైజ్.. యానిమల్ రియాక్షన్ కు BGM తోడైతే..

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ కోసం సినీ ప్రియులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

By:  M Prashanth   |   16 Sept 2026 9:45 AM IST
నాని ప్యారడైజ్.. యానిమల్ రియాక్షన్ కు BGM తోడైతే..
X

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ కోసం సినీ ప్రియులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఆ యాక్షన్ ఎంటర్టైనర్‌ లో నాని కనిపించనున్న రగ్గడ్ లుక్ ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా రెండు పొడవైన జడలతో నాని కనిపించడం హైప్ ను పెంచింది. ఇప్పుడు ఆ జడలతో చేసే ఫైట్స్‌ కు సంబంధించి ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ చెప్పిన విషయాలు ఇంకా హైప్ పెంచుతున్నాయి.

ప్యారడైజ్ లో నాని చేసే కొన్ని ఫైట్స్ నార్మల్ గా ఉండవని క్లియర్ గా తెలుస్తోంది. ముఖ్యంగా ఇంట్రడక్షన్ ఫైట్‌ లో నాని ఇచ్చే కొన్ని యానిమల్ రియాక్షన్స్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాయని రియల్ సతీష్ తెలిపారు. కొన్ని షాట్స్‌ లో జడలను నోటిలో పెట్టుకుని నాని ఫైట్ చేస్తారని ఆయన చెప్పారు. ఇలాంటి సీన్లు థియేటర్లలో చూస్తేనే అసలు కిక్ ఉంటుందని తెలిపారు.

నాని రోల్ ను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చాలా స్పెషల్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పాత్రకు తగ్గట్టుగానే ఆయన బాడీ లాంగ్వేజ్, ఫైటింగ్ స్టైల్‌ ను కూడా కొత్తగా చూపించబోతున్నారు. అందులో భాగంగానే నార్మల్ హీరో చేసే ఫైట్స్‌ కు భిన్నంగా యానిమల్ లా రియాక్షన్ కనిపించేలా కొన్ని యాక్షన్ సీన్ల ను రూపొందించినట్లు సమాచారం. ఇప్పటికే దసరా సినిమాలో నాని యాక్షన్, ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే ప్యారడైజ్ లో దానికి మరింత భారీ రేంజ్ లో యాక్షన్ ఉంటుందని ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ వెల్లడించారు. దసరాతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ యాక్షన్ సీన్లు సినిమాలో ఉంటాయని ఇప్పటికే తెలిపారు. ఆ మూవీలో నాని జడలతో చేసే ఫైట్స్ కూడా స్పెషల్ గా నిలవనున్నాయి. పొడవైన జడలు ఫైట్ సమయంలో ముఖానికి, కళ్లకు తగిలే అవకాశం ఉండటంతో యాక్షన్ టీమ్ ముందుగానే ప్రాక్టీస్ చేసింది.

అసిస్టెంట్లకు జడలు వేయించి మరీ ఫైట్ మూవ్మెంట్స్‌ ను టెస్ట్ చేసిన తర్వాత నానితో సీన్లను కంపోజ్ చేసినట్లు ఫైట్ టీమ్ తెలిపింది. ఇక ఆ యాక్షన్‌ కు అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో స్పెషల్ అట్రాక్షన్ గా మారనుంది. నాని స్క్రీన్‌ పై చూపించే రియాక్షన్స్ కు అనిరుధ్ బీజీఎం తోడైతే థియేటర్లలో ఆ సీన్ల ఎలివేషన్ ఏ రేంజ్ లో ఉంటుందనే ఇంట్రెస్ట్ ఇప్పుడు క్రియేట్ అవుతోంది.

ఇక ప్యారడైజ్ లో నానికి జోడీగా కాయదు లోహర్ యాక్ట్ చేస్తున్నారు. రాఘవ్ జోయల్, మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తుండగా, ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర కూడా నటిస్తున్నారు. ఎస్ఎల్వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఆ మూవీ.. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇంట్రడక్షన్ ఫైట్ ఎంతలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.