Begin typing your search above and press return to search.

ప్యారడైజ్ పై చిన్న టెన్షన్.. కానీ ఒక్క విషయంలో మాత్రం..

పైగా రిలీజ్ కు ముందు ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానున్న ఆ సినిమాపై ప్రస్తుతం నాని అభిమానుల్లో చిన్న టెన్షన్ కనిపిస్తోంది.

By:  M Prashanth   |   14 Sept 2026 10:00 PM IST
ప్యారడైజ్ పై చిన్న టెన్షన్.. కానీ ఒక్క విషయంలో మాత్రం..
X

నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ ది ప్యారడైజ్. దసరా తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. పైగా రిలీజ్ కు ముందు ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానున్న ఆ సినిమాపై ప్రస్తుతం నాని అభిమానుల్లో చిన్న టెన్షన్ కనిపిస్తోంది.

సాధారణంగా పెద్ద సినిమాలకు రిలీజ్ కు ముందు ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఇలా వరుసగా ప్రమోషనల్ కంటెంట్ వస్తుంటుంది. ముఖ్యంగా ట్రైలర్ ద్వారా సినిమా స్టోరీ, హీరో రోల్, యాక్షన్, విజువల్స్‌ పై ప్రేక్షకులకు ఒక అంచనా వస్తుంది. కానీ ప్యారడైజ్ విషయంలో ఆ ఛాన్స్ లేకుండా పోయింది. టైమ్ వేస్ట్ చేయకుండా సినిమానే థియేటర్లలోకి తీసుకురావాలని మూవీ టీమ్ భావించింది. దీంతో ట్రైలర్ కోసం ఎదురుచూసిన అభిమానులకు కాస్త నిరాశ ఎదురైంది.

కానీట్రైలర్ రాకపోయినా సినిమాపై బజ్ తగ్గలేదు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి హైప్ తీసుకొచ్చింది. నాని లుక్, సినిమా బ్యాక్ డ్రాప్, శ్రీకాంత్ చూపించబోయే వరల్డ్ ఇలా ప్రతి ఎలిమెంట్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ను పెంచాయి. దసరా తర్వాత ఆ కాంబినేషన్‌ పై ఉన్న క్రేజ్ కూడా సినిమాకు పెద్ద ప్లస్‌ గా మారింది.అయితే ప్యారడైజ్ విషయంలో నాని ఫ్యాన్స్ ఎక్కువగా నమ్మకం పెట్టుకున్న మరో ఎలిమెంట్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్.

పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో అనిరుధ్‌ పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా స్టోరీ, హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ కు అనిరుధ్ మ్యూజిక్ ఎక్స్ ట్రా స్ట్రెంత్ ఇస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. అనిరుధ్ పేరు వినిపిస్తేనే బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ పై భారీ అంచనాలు ఏర్పడటం కామన్. చాలా సినిమాల్లో సీన్స్ కు తన వర్క్ తో మరింత బలం తీసుకొచ్చారు. ముఖ్యంగా హీరో ఎలివేషన్ సీన్లలో ఆయన బీజీఎం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంటుంది.

అందుకే ప్యారడైజ్ లో కూడా అదే రిపీట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్‌పై అనిరుధ్ దృష్టి పెట్టారు. ప్రస్తుతం లాస్ట్ స్టేజ్ రీ-రికార్డింగ్ పనులు కూడా జరుగుతున్నట్లు సమాచారం. రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఫైనల్ అవుట్‌ పుట్ విషయంలో రెస్ట్ లేకుండా పని చేస్తున్నారట.

దీంతో ప్యారడైజ్ పై చిన్న టెన్షన్ ఉన్నా, మ్యూజిక్ విషయంలో మాత్రం నాని అభిమానులు ధైర్యంగా ఉన్నారు. ముఖ్యంగా అనిరుధ్ పై పెట్టుకున్న నమ్మకం చాలా ఎక్కువగా ఉంది. ఆ నమ్మకానికి తగ్గట్టుగా పాటలు, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ క్లిక్ అయితే సినిమాకు అది పెద్ద స్ట్రెంత్ గా మారుతుంది. మరి ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని అనిరుధ్ ఎంతవరకు నిలబెట్టుకుంటారో తెలియాలంటే సెప్టెంబర్ 24 వరకు వేచి చూడాల్సిందే.