'ప్యారడైజ్' లో ఆ రెండు సీన్స్ కి థియేటర్ల లో ఊగిపోతున్న ప్రేక్షకులు...
ఇక ఇదిలా ఉంటే నాని కెరియర్ లో అత్యధిక భారీ ఓపెనింగ్స్ ను తీసుకొచ్చిన సినిమాగా 'ప్యారడైజ్' సినిమా నిలవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
By: Gopi Velupala | 28 Sept 2026 10:05 AM ISTతెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి మారిపోయింది. మన స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. కాబట్టి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న హీరోల్లో మన స్టార్ హీరోలు కూడా ముందు వరుసలో దూసుకెళ్తుండటం విశేషం... నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన 'ప్యారడైజ్ ' సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాకి మొదటి షో తో కొంచెం నెగెటివిటీ స్ప్రెడ్ అయినప్పటికి ఆ తర్వాత పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమే... ఇక ప్యారడైజ్ లోని రెండు సన్నివేశాలకు ప్రేక్షకులు థియేటర్లో ఊగిపోతున్నారు. ఇంటర్వెల్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ ప్రేక్షకుడికి విపరీతంగా నచ్చేసింది. ఇక సెకండాఫ్ లో వచ్చే మదర్ అండ్ సన్ సెంటిమెంట్ సైతం ప్రేక్షకుడిని విపరీతంగా కట్టిపడేసింది. ఏది ఏమైనా కూడా ఈ రెండు సన్నివేశాల్లో ప్రేక్షకులు ఊగిపోవడమే కాకుండా సినిమా ఎమోషన్ ను సైతం భారీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమాని చూడడానికి చాలామంది జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సినిమాని చూసినవారు మరోసారి రిపీటెడ్ గా సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే నాని కెరియర్ లో అత్యధిక భారీ ఓపెనింగ్స్ ను తీసుకొచ్చిన సినిమాగా 'ప్యారడైజ్' సినిమా నిలవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఈ సినిమాకి వచ్చిన హైప్ మరే సినిమాకు రాలేదు. నాని కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను కొల్లగొడుతూ యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు దూసుకెళ్తుంది... రీసెంట్ గా సినిమా యూనిట్ సక్సెస్ మీట్ ని కూడా పెట్టారు. అందులో నటీనటులతో పాటు దర్శకులు సైతం తమ ఒపీనియన్ ను చాలా ఓపెన్ గా చెప్పేసాడు.
ఏది ఏమైనా కూడా ఈ సినిమాకి మొదట్లో కొంతవరకు డివైడ్ టాక్ వచ్చినా కూడా ఆ తర్వాత ప్రేక్షకుడి యొక్క దృష్టిని ఆకర్షించి మరింత ముందుకు దూసుకెళ్తుండడం అనేది ఈ సినిమాకి చాలా బాగా కలిసి వచ్చిన అంశమనే చెప్పాలి. శ్రీకాంత్ ఓదెల తెలంగాణ నేటి వీటికి తగ్గట్టుగా కథలను రెడీ చేసుకొని సినిమాలు చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఇలాంటి కథలతోనే మరోసారి ప్రేక్షకులను పలకరిస్తాడా? లేదంటే డిఫరెంట్ కథలతో వచ్చే ప్రయత్నం చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది...
