Begin typing your search above and press return to search.

ది ప్యారడైజ్ లో ఆ యాక్షన్ సీన్స్ హైలెట్.. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ తో తుపాకీ స్పెషల్ ఇంటర్వ్యూ!

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ చిత్రం 'ది ప్యారడైజ్'. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేసింది.

By:  Madhu Reddy   |   13 Sept 2026 2:01 PM IST
ది ప్యారడైజ్ లో ఆ యాక్షన్ సీన్స్ హైలెట్.. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ తో తుపాకీ స్పెషల్ ఇంటర్వ్యూ!
X

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ చిత్రం 'ది ప్యారడైజ్'. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రంలో ఫైట్స్ కొరియోగ్రఫీ చేసిన ప్రముఖ స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్‌లతో తుపాకీ న్యూస్ నిర్వహించిన ఎక్స్క్లూజివ్ స్పెషల్ ఇంటర్వ్యూ విశేషాలు మరియు యాక్షన్ హైలైట్స్ విశేషాలు గురించి వారు పంచుకున్న విశేషాలు చూద్దాం..

పీక్ ఎమోషన్‌తో కూడిన యాక్షన్ ఎపిసోడ్స్ :

ప్యారడైజ్ సినిమాలో కేవలం ఫైట్లు మాత్రమే కాకుండా బలమైన ఎమోషన్ ఉంటుంది. తండ్రి, తల్లి మరియు కొడుకుల మధ్య ఉండే సెంటిమెంట్, విలన్లకు హీరోకి మధ్య నడిచే మైండ్ గేమ్స్ యాక్షన్ సీన్లను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తాయి. ప్రతీ ఫైట్ వెనుక ఒక కథ మరియు ఎమోషనల్ డ్రామా దాగి ఉంటుంది.

మొత్తం 6 నుంచి 7 భారీ ఫైట్స్:

ఈ సినిమాలో దాదాపు ఆరు నుంచి ఏడు భారీ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. వేర్వేరు స్టంట్ మాస్టర్లు ఈ ఫైట్లను డీల్ చేశారు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్‌ను రామ్-లక్ష్మణ్ మాస్టర్లు కొరియోగ్రఫీ చేయగా, ఇంట్రో ఫైట్‌ను రియల్ సతీష్, క్లైమాక్స్ సీన్‌ను నవకాంత్ డిజైన్ చేశారు. దేనికదే చాలా విభిన్నంగా ఉంటుంది అని వాళ్ళు తెలిపారు.

రియలిస్టిక్ ఫైట్స్ – గాయాలు సైతం లెక్కచేయకుండా :

ఇంకా మాస్టర్స్ మాట్లాడుతూ .."ఈ సినిమాలో నాని తన కెరీర్‌లోనే అత్యధికంగా యాక్షన్ సీన్లలో నటించారు. బాడీపై రోప్స్ కట్టి చేసిన ప్రయోగాలు చాలా రిస్కీగా సాగాయి. ఇక షాట్ ఓకే అయ్యేంతవరకు నాని ఏమాత్రం వెనకాడకుండా, చిన్న చిన్న గాయాలు అయినా లెక్కచేయకుండా 'వన్ మోర్' అంటూ శ్రమించి నటించారు" అని తెలిపారు

నాని క్యారెక్టర్ మేకోవర్ అండ్ రిస్క్:

నాని అనగానే మనకు లవర్ బాయ్ లేదా ఫ్యామిలీ ఇమేజ్ గుర్తుకొస్తుంది. కానీ ఈ సినిమాలో జడలు, ముక్కు పుడక, మీసాలు మరియు డిఫరెంట్ గెటప్‌తో పూర్తిగా కొత్తగా కనిపిస్తారు. ఇక బీర్ బాడీతో రోప్ షాట్స్ చేయడం, వెయిట్ ఉన్న జడలతో ఫైట్స్ చేయడం నానికి పెద్ద సవాల్ గా వున్నా ఆయన కష్టపడి చేసారు అని మాస్టర్స్ తెలిపారు..

నాని మరియు శ్రీకాంత్ కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' మూవీ ప్యాన్ ఇండియా లెవెల్లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రామ్-లక్ష్మణ్ డిజైన్ చేసిన రో రస్టిక్ యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. సెప్టెంబర్ 24న థియేటర్లలో ఈ యాక్షన్ ధమాకాను చూడాల్సిందే.. ఇక ఈ సినిమా ఫైట్ సీన్స్ గురించి మరింత తెలుసుకోవాలి అంటే తుపాకీ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా ప్రసారమవుతున్న రామ లక్ష్మణ్ స్పెషల్ ఇంటర్వ్యూ చూసేయండి.