ఓదెల టార్గెట్ మరింత పెద్దదా? ఇంత నమ్మకం ఎందుకు?
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందుతున్న ది ప్యారడైజ్ విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో హాట్ టాపిక్ గా మారింది.
By: M Prashanth | 19 July 2026 6:00 AM ISTనేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందుతున్న ది ప్యారడైజ్ విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా నుంచి ఇప్పటివరకు పూర్తి స్థాయి టీజర్ లేదా ట్రైలర్ కూడా రాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఆ ప్రాజెక్ట్ గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. దీంతో అసలు ప్యారడైజ్ పై ఇంత నమ్మకం ఎందుకు ఏర్పడిందనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది.
శ్రీకాంత్ ఓదెల తన తొలి చిత్రం దసరాతోనే దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు, నానిని పూర్తిగా కొత్త యాంగిల్ లో చూపించింది. ముఖ్యంగా కథను చెప్పిన విధానం, రోల్స్ క్యారెక్టరైజేషన్, విజువల్ ప్రెజెంటేషన్ దర్శకుడి టాలెంట్ కు ఎగ్జంపుల్ గా నిలిచాయి. అయితే ప్యారడైజ్ విషయంలో మాత్రం శ్రీకాంత్ ఆలోచన మరింత పెద్దదిగా కనిపిస్తోంది.
విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఇది కేవలం ఒక కమర్షియల్ యాక్షన్ సినిమా మాత్రమే కాదనే అభిప్రాయం కలుగుతోంది. కథను వరల్డ్ రేంజ్ లో ప్రెజెంట్ చేయాలనే ప్రయత్నం కనిపిస్తోందని సినీ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఇక నాని కూడా ఆ ప్రాజెక్ట్ కోసం తన ఇమేజ్ ను మరోసారి మార్చుకున్నట్లు తెలుస్తోంది. దసరాలో కనిపించిన రగ్గడ్ లుక్ కంటే మరింత ఇంటెన్సిటీతో కూడిన పాత్రలో కనిపించబోతున్నారనే సిగ్నల్స్ ఇప్పటికే వచ్చాయి. దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
మరోవైపు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కూడా సినిమాపై అంచనాలు పెరగడానికి ప్రధాన కారణంగా నిలిచారు. ఇటీవల విడుదలైన అయ్యా షేర్ పాట సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ అందుకుంది. సినిమా కథ గురించి పెద్దగా సమాచారం లేకపోయినా, ఒక్క పాటతోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడం మూవీ టీమ్ కు కలిసి వచ్చింది. ప్రస్తుతం ఆ పాట సినిమాకు స్ట్రాంగ్ ప్రమోషనల్ ఎలిమెంట్ గా మారింది.
సినిమా గురించి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం కూడా చెప్పుకోవాలి. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు ఇలాంటి బజ్ కనిపించినా, విడుదలకు చాలా ముందుగానే ఈ రేంజ్ లో చర్చ జరగడం అరుదు. దీనికి ప్రధాన కారణం దసరాతో ఏర్పడిన నమ్మకం అని చెప్పవచ్చు. నాని- శ్రీకాంత్ కాంబినేషన్ ఇప్పటికే ఒక విజయాన్ని అందుకుంది. అందుకే ఈసారి వారు మరింత భారీ స్థాయిలో ఏదో చూపిస్తారనే అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి.
అదే సమయంలో సినిమా ప్రమోషన్స్ లో యూజ్ చేస్తున్న విజువల్స్ కూడా సాధారణ టాలీవుడ్ సినిమాలకు భిన్నంగా ఉండటం ఆసక్తిని పెంచుతోంది. ది ప్యారడైజ్ పై ఏర్పడిన నమ్మకం కేవలం స్టార్ పవర్ వల్ల మాత్రమే కాదు. దర్శకుడిపై ఉన్న నమ్మకం, నాని చేస్తున్న కొత్త ప్రయత్నం, అనిరుధ్ సంగీతం, ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కలిపి సినిమాపై భారీ అంచనాలను తీసుకొచ్చాయి. ఇప్పుడు ఆ అంచనాలను శ్రీకాంత్ ఎంతవరకు అందుకుంటారన్నదే ఆసక్తికరంగా మారింది.
