Begin typing your search above and press return to search.

ది ప్యారడైజ్‌.. హీరోయిన్ పాత్రలో ఇన్ని షేడ్సా!

ది ప్యారడైజ్‌లో కయాదు లోహర్ చేస్తున్న సుబ్బలక్ష్మి పాత్రపై ఇప్పటివరకు పెద్దగా వివరాలు బయటకు రాలేదు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాత్రం తన క్యారెక్టర్ గురించి ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.

By:  M Prashanth   |   22 Sept 2026 7:19 PM IST
ది ప్యారడైజ్‌.. హీరోయిన్ పాత్రలో ఇన్ని షేడ్సా!
X

ది ప్యారడైజ్‌లో కయాదు లోహర్ చేస్తున్న సుబ్బలక్ష్మి పాత్రపై ఇప్పటివరకు పెద్దగా వివరాలు బయటకు రాలేదు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాత్రం తన క్యారెక్టర్ గురించి ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. గతంలో చేసిన సినిమాలతో పోలిస్తే సుబ్బు పూర్తిగా భిన్నమైన పాత్ర అని, ఇందులో గ్రే షేడ్స్‌తో పాటు ఊహించని మలుపులు కూడా ఉంటాయని తెలిపారు. సాధారణ కమర్షియల్ సినిమాలో హీరోయిన్‌కు ఉండే స్పేస్ కంటే ఇక్కడ తన పాత్రకు ప్రత్యేకమైన జర్నీ ఉందని చెప్పారు.

ఈ పాత్రను చేయడానికి ఒప్పుకోవడానికి కూడా అదే కారణమని కయాదు తెలిపారు. సుబ్బు క్యారెక్టర్ చాలా రిస్కీగా, ఛాలెంజింగ్‌గా అనిపించిందని చెప్పారు. నాని పోషిస్తున్న జడల్ క్యారెక్టర్ జర్నీ ఒకవైపు నడుస్తుండగా, తన పాత్రకు కూడా సొంత ట్రాక్ ఉంటుందని పేర్కొన్నారు. కథలో కొన్ని కీలక సందర్భాల్లో సుబ్బు పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుందని ఆమె మాటల్లో కనిపిస్తోంది.

శ్రీకాంత్ ఓదెలతో పనిచేసిన అనుభవం గురించి కూడా కయాదు ఓపెన్‌గా మాట్లాడారు. ఆయన ఆలోచించే విధానం సాధారణంగా ఉండదని, సెట్లో నటీనటుల నుంచి కావాల్సిన అవుట్‌పుట్ కోసం చాలా ఛాలెంజెస్ ఇస్తారని చెప్పారు. కొంచెం ఎసెంట్రిక్‌గా కనిపించినా, ఆయన వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని తెలిపారు. మొత్తం ఇండియన్ సినిమాలోనే ఇలాంటి దర్శకులు చాలా అరుదని కూడా అభిప్రాయపడ్డారు.

ది ప్యారడైజ్ కోసం దాదాపు ఏడాది పాటు షూటింగ్‌లో పాల్గొన్నట్లు కయాదు తెలిపారు. ప్రతి నెలా ఏదో ఒక షెడ్యూల్‌లో పని జరిగేదని, సినిమా కోసం టీమ్ చాలా సమయం పెట్టిందని చెప్పారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి కూడా మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీపడలేదని పేర్కొన్నారు. అనిరుధ్ మ్యూజిక్, యాక్షన్, పెర్ఫార్మెన్సులు బిగ్ స్క్రీన్‌పై మరింత ఎఫెక్టివ్‌గా ఉంటాయని ఆమె చెప్పారు.

నాని పాత్ర చాలా నచ్చిందని కయాదు తెలిపారు. రెండు జడల లుక్‌ను ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా క్యారీ చేశారని, ఆ గెటప్‌లో నానిని మొదటిసారి చూసినప్పుడు తాను కూడా ఆశ్చర్యపోయానని చెప్పారు. మోహన్ బాబు, రాఘవ్ జుయల్ పాత్రలు కూడా స్క్రీన్‌పై బలమైన ఇంపాక్ట్ ఇస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురి క్యారెక్టర్లకు సంబంధించిన సీన్స్‌పై ఆమె చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు.

సుబ్బు పాత్రకు తన వాయిస్ ఉండాలని మొదట కయాదు ప్రయత్నించారట. దర్శకుడు కూడా డబ్బింగ్ చెప్పేందుకు ప్రోత్సహించారని, కానీ తెలంగాణ స్లాంగ్‌ను సహజంగా పలకడం కష్టంగా అనిపించడంతో ఆ ప్రయత్నం కుదరలేదని చెప్పారు. పాత్ర కోసం ఏడాది పాటు షూటింగ్‌లో పాల్గొన్న కయాదుకు ఈ సినిమాతో తెలుగులో మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 24న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఆమె చెప్పిన గ్రే షేడ్స్, సర్‌ప్రైజెస్‌లు ఆడియెన్స్ ను ఎంతవరకు ఎట్రాక్ట్ చేస్తాయో చూడాలి.