ప్రమోషన్స్ తో కాదు.. ప్యారడైజ్‌కు అసలైన బజ్ ఇదే!
ఒక సినిమా రిలీజ్‌కు దగ్గరపడుతున్న కొద్దీ సాధారణంగా ప్రమోషన్స్ మరింత వేగం పుంజుకుంటాయి.
By: Sravani Lakshmi Srungarapu | 16 Sept 2026 10:00 PM ISTఒక సినిమా రిలీజ్‌కు దగ్గరపడుతున్న కొద్దీ సాధారణంగా ప్రమోషన్స్ మరింత వేగం పుంజుకుంటాయి. పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్, సాంగ్స్, ఇంటర్వ్యూలతో ఆడియన్స్ లో ఆసక్తిని పెంచే ప్రయత్నం జరుగుతుంది. అయితే ది ప్యారడైజ్ విషయంలో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. సినిమా ప్రమోషనల్ కంటెంట్ కంటే దాని ఆఖరి దశ పనులే ఆసక్తిని పెంచుతున్నాయి.
సినిమా ఎంతవరకు పూర్తైంది? ఎడిటింగ్ ఎలా సాగుతోంది? మ్యూజిక్ ఎలా ఉండబోతోంది? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. అంటే ఈ సినిమాకు ప్రస్తుతం మరో సినిమాతో పోటీ కంటే.. కంటెంట్ ను చెప్పిన గడువులోపు రెడీ చేయడమే అసలు రేసుగా మారింది. పెద్ద సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ అనేది కేవలం ఫార్మాలిటీ కాదు. ముఖ్యంగా కథ, ఎమోషన్, యాక్షన్, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసి పనిచేయాల్సిన సినిమాల్లో ఆఖరి దశలో జరిగే మార్పులు ఫైనల్ అవుట్‌పుట్‌పై భారీ ప్రభావం చూపుతాయి.
ది ప్యారడైజ్ విషయంలో కూడా ఇదే ఆసక్తిని కలిగిస్తోంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సినిమాను ఫైనల్ షేప్‌లోకి తీసుకురావడానికి ఎడిటింగ్, మ్యూజిక్, డబ్బింగ్, డీఐ వంటి విభాగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకు కీలకమైన అంశంగా మారడంతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై కూడా అంచనాలు పెరిగాయి. శ్రీకాంత్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ది ప్యారడైజ్ మూవీ అనిరుధ్ కు బెస్ట్ వర్క్ అవుతుందని చేసిన కామెంట్స్ ఈ అంచనాలను మరింత పెంచాయి. దీంతో సినిమాలోని కంటెంట్ అసలెలా ఉండబోతోందన్న దాని కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇక్కడే మరో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. గతంలో సినిమా రిలీజ్‌కు ముందు ఎంత ప్రమోషన్ చేస్తున్నారు? అనేదే డిస్కషన్ గా ఉండేది. ఇప్పుడు కంటెంట్‌పై నమ్మకం ఉన్న సినిమాలకు సినిమా ఎలా తయారవుతోందనే విషయమే ఒక రకమైన బజ్ ను క్రియేట్ చేస్తోంది. పని జరుగుతున్న తీరు, దానికోసం మేకర్స్ పెడుతున్న శ్రమ, ఆఖరి దశలో తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్‌ను అందుకోవడం మాత్రమే కాకుండా, ఆ డేట్ కు తగ్గ కంటెంట్‌ను అందించడం కూడా ఇప్పుడు ప్యారడైజ్ ముందున్న అసలైన సవాలుగా మారింది.
