Begin typing your search above and press return to search.

ప్యారడైజ్ అడ్వాన్స్ బుకింగ్స్.. ఎక్కడివరకు వెళ్లిందంటే..

రిలీజ్‌కు ఇంకా సమయం ఉండటం, అన్ని మార్కెట్లలో పూర్తి షోలు ఓపెన్ కాకపోవడంతో ఫైనల్ ప్రీ సేల్స్ నంబర్‌పై ఇప్పుడు ఫోకస్ పెరిగింది.

By:  M Prashanth   |   22 Sept 2026 6:16 PM IST
ప్యారడైజ్ అడ్వాన్స్ బుకింగ్స్.. ఎక్కడివరకు వెళ్లిందంటే..
X

నాని ది ప్యారడైజ్ అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్టార్ట్ వచ్చింది. వరల్డ్‌వైడ్‌గా ఇంకా లిమిటెడ్ థియేటర్లలోనే బుకింగ్స్ ఓపెన్ అయినప్పటికీ ప్రీ సేల్స్ రూ.30 కోట్ల మార్క్ దాటినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రిలీజ్‌కు ఇంకా సమయం ఉండటం, అన్ని మార్కెట్లలో పూర్తి షోలు ఓపెన్ కాకపోవడంతో ఫైనల్ ప్రీ సేల్స్ నంబర్‌పై ఇప్పుడు ఫోకస్ పెరిగింది. కొన్ని సెంటర్లలో బుకింగ్స్ స్పీడ్ కూడా బాగుంది.

ఇండియాలో బుకింగ్స్ ఇంకా దశలవారీగానే తెరుచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో చాలా థియేటర్లు యాడ్ కావాల్సి ఉండగా, హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన సెంటర్లలో కూడా కొత్త షోలు వస్తున్నాయి. ఓవర్సీస్‌లో మాత్రం ముందుగానే బుకింగ్స్ మొదలయ్యాయి. అక్కడి సేల్స్ కూడా ఇప్పటి రూ.30 కోట్ల నంబర్‌కు మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చాయి. మిగిలిన థియేటర్లు ఓపెన్ అయితే ఇండియా వాటా ఇంకా పెరుగుతుంది.

ది ప్యారడైజ్‌కు మొదటి నుంచి నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ప్రధాన బలం. దసరా తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఇక అనిరుధ్ సంగీతం, ఇప్పటికే వచ్చిన పాటలు, పోస్టర్లు కూడా రిలీజ్ ముందు సినిమాకు కావలసినంత బూస్ట్ ఇచ్చాయి. ఇప్పుడు బుకింగ్స్‌లో వస్తున్న రెస్పాన్స్‌తో ఆ కాంబినేషన్‌పై ఉన్న క్రేజ్ టికెట్ సేల్స్‌లో కూడా కనిపిస్తోంది.

నానికి దసరా, హిట్ 3 సినిమాలు మంచి ఓపెనింగ్స్ ఇచ్చాయి. ది ప్యారడైజ్ ప్రస్తుతం ఆ రికార్డుల కంటే ముందుకు వెళ్లే ఛాన్స్‌లో ఉంది. ఇంకా చాలా షోలు ఓపెన్ కావాలి. చివరి రోజు బుకింగ్స్ కూడా మిగిలే ఉన్నాయి. ప్రీమియర్స్ కలిస్తే నాని కెరీర్‌లోనే అతిపెద్ద ఫస్ట్ డే నంబర్ వచ్చే అవకాశం ఉంది. అది నానికి కొత్త బెంచ్‌మార్క్ అవుతుంది.

అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నా, సినిమా ఎంత దూరం వెళ్తుందన్నది రిలీజ్ తర్వాత వచ్చే టాక్‌పైనే ఉంటుంది. వీకెండ్ వరకు కలెక్షన్లు అదే స్థాయిలో కొనసాగితేనే ఈ భారీ ఓపెనింగ్‌కు పూర్తి ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా రెండో రోజు నుంచి వచ్చే హోల్డ్ ఈ సినిమాకు చాలా కీలకం. ఇప్పుడు చూడాల్సింది చివరి 24 గంటల్లో బుకింగ్స్ ఎంత వేగంగా పెరుగుతాయన్నదే. కొత్త థియేటర్లు, అదనపు షోలు యాడ్ అయితే ఫస్ట్ డే నంబర్ ఇంకా పెరిగే చాన్స్ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.