ట్రైలర్ డిజాస్టర్.. లైక్స్ 53K, డిస్‌లైక్స్ 300K
యూట్యూబ్‌లో ట్రైలర్‌కు ఇప్పటి వరకు 4.3 మిలియన్‌ల వ్యూస్ వచ్చాయి. సాధారణంగా హాలీవుడ్ సినిమాల ట్రైలర్స్‌కి భారీ ఎత్తున లైక్స్ రావడం సహజం.
By: Ramesh Palla | 4 July 2026 12:19 PM ISTప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గత కొంత కాలంగా క్రిస్టోఫర్ అభిమానులంతా 'ది ఒడిస్సీ' సినిమా కోసం వెయిట్ చేస్తున్న విషయం తెల్సిందే. క్రిస్టోఫర్ మూవీ అంటే మినిమం ఉంటుందని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ రిలీజ్‌కి రెడీ అవుతోంది. జులై 17న ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్‌లకు రెడీ అవుతున్న 'ది ఒడిస్సీ' సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేయడం జరిగింది. సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు వచ్చిన ట్రైలర్ కి డిజాస్టర్ టాక్ వచ్చింది. యూట్యూబ్‌లో, సోషల్ మీడియా మొత్తం ది ఒడిస్సీ ట్రైలర్ గురించి చర్చ జరుగుతోంది. క్రిస్టోఫర్ రేంజ్ మూవీ కాదని, ఆయన స్థాయిలో ట్రైలర్ లేదు అంటూ చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తూ, తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
యూట్యూబ్‌లో ది ఒడిస్సీ ట్రైలర్‌కి...
యూట్యూబ్‌లో ట్రైలర్‌కు ఇప్పటి వరకు 4.3 మిలియన్‌ల వ్యూస్ వచ్చాయి. సాధారణంగా హాలీవుడ్ సినిమాల ట్రైలర్స్‌కి భారీ ఎత్తున లైక్స్ రావడం సహజం. కానీ భారీ వ్యూస్ వచ్చిన ఈ ట్రైలర్‌కు కేవలం 53 వేల లైక్స్ మాత్రమే నమోదు అయ్యాయి. ఇక డిస్‌లైక్స్ విషయానికి వస్తే ఏకంగా మూడు లక్షలకు పైగా నమోదు అయినట్లు తెలుస్తోంది. కేవలం యూట్యూబ్‌లోనే కాకుండా ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పైనా ది ఒడిస్సీ సినిమా ట్రైలర్ పై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా క్రిస్టోఫర్ మార్క్ మూవీ కాదని, ఆయన స్థాయి సినిమాలా లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఒక సాదాసీదా సినిమా తరహాలో ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తూ ఉంటే అనిపిస్తుందని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా నటీనటుల ఎంపిక విషయంలోనూ విమర్శలు వస్తున్నాయి.
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో...
సోషల్ మీడియాలో ది ఒడిస్సీ సినిమాకు నెగిటివిటీ ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం నటీనటుల ఎంపిక అని తెలుస్తోంది. అంతే కాకుండా సినిమాలోని డైలాగ్స్, చరిత్రను వక్రీకరించి చూపించే ప్రయత్నం చేయడం, సీన్స్‌లో నేచురాలిటీ కనిపించక పోవడం వల్ల ట్రైలర్‌కు డిస్‌లైక్స్ ఎక్కువగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. క్రిస్టోఫర్ నోలన్ ఇన్నాళ్ల సినీ కెరీర్‌లో ఇంత నెగిటివిటీని చూడటం ఇదే మొదటిసారి అయి ఉంటుందని కొందరు అంటున్నారు. గ్రీక్ పురాణాలను వక్రీకరించడంను చాలా మంది తప్పుబడుతున్నారు. సినిమా విడుదలైన తర్వాత ఈ విషయమై మరింత రచ్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రైలర్‌లో నువ్వు ఎప్పుడూ చూడని నీ డాడీ కోసం ఏడుస్తున్నావు అనే డైలాగ్ విషయంలో విమర్శలు వస్తున్నాయి. వార్ సీన్స్‌లోనూ అరుపుల విషయంలో ట్రోల్స్ వస్తున్నాయి. ఛారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాలో ఉండాల్సిన డైలాగ్స్ కాదు అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు.
బెన్నీ సఫ్డీ పాత్ర కాస్ట్యూమ్స్..
సినిమాను గ్రీక్ నేపథ్యంలో రూపొందించిందిగా చెబుతున్నప్పటికీ, సినిమాల్లో ఒక్క గ్రీక్ నటుడు లేక పోవడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక ట్రైలర్‌లో కనిపించిన బెన్నీ సఫ్డీ ధరించిన అగామెమ్నోన్ కవచం గ్రీక్ సైనికుడిలా కాకుండా మరో రకంగా అనిపిస్తుంది అనేది కొందరి అభిప్రాయం. ఆయన్ను చూస్తూ ఉంటే గ్రీక్ సైనికుడిగా కాకుండా బ్యాట్ మ్యాన్ సినిమాలో హీరో పాత్రను పోలినట్లుగా అనిపిస్తుందని అంటున్నారు. నోలన్ తన సినిమాల్లో హిస్టరీ ని సరిగ్గా చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగడం లేదు అనేది కొందరి ఆరోపణ. జులై 6న ప్రీమియర్‌లు ప్రారంభం అయ్యి సినిమా ఇదే నెల 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ ట్రైలర్ నిరాశ పరచడంతో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అనే ఆసక్తి నెలకొంది.
