'ఒడిస్సీ' పైరసీ హంగామా… Xలో మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్!
హైక్వాలిటీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అయినప్పటికీ 'ది ఒడిస్సీ' థియేట్రికల్ రన్‌పై ఆ ప్రభావం ఏమాత్రం పడలేదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
By: Madhu Reddy | 27 July 2026 2:53 PM ISTవిజువల్ వండర్స్ సృష్టించడంలో హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ శైలే వేరు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా విజువల్ మైండ్‌బ్లోయింగ్ మూవీ 'ది ఒడిస్సీ' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే, బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్న ఈ సినిమాకు సోషల్ మీడియా వేదికగా షాక్ తగిలింది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' లో ఈ మూవీ హైక్వాలిటీ పైరేటెడ్ కాపీ లీక్ అవ్వడం కలకలం రేపింది.
Xలో వైరల్.. మిలియన్ల కొద్దీ వ్యూస్:
సినిమా థియేటర్లలో విడుదలైన కొద్దిరోజులకే ఫుల్ మూవీకి సంబంధించిన హెచ్‌డీ ప్రింట్ 'X' ప్లాట్‌ఫామ్‌లోకి ప్రత్యక్షమైంది. ఇక దీంతో నెటిజన్లు, సినీ ప్రియులు ఈ వీడియోను చూడటానికి ఎగబడటంతో కొద్ది గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చిపడ్డాయి. లీక్ వార్త ఇంటర్నెట్‌లో క్షణాల్లో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా నెలకొంది.
రంగంలోకి దిగిన యూనివర్సల్ పిక్చర్స్:
లీక్ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే నిర్మాణ సంస్థ 'యూనివర్సల్ పిక్చర్స్' తీవ్రంగా స్పందించింది. ఇక కాపీరైట్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు చేపడుతూ, పైరేటెడ్ వీడియోలను తొలగించే ప్రక్రియను వెంటనే ప్రారంభించింది. 'X' యాజమాన్యంతో మాట్లాడి ఆ వీడియోలను డిలీట్ చేయించడమే కాకుండా, సదరు పైరేటెడ్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసిన ఖాతాలను శాశ్వతంగా సస్పెండ్ చేయించింది. ఇష్టారీతిన పైరసీకి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
బాక్సాఫీస్ వద్ద తగ్గని నోలన్ మ్యాజిక్:
హైక్వాలిటీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అయినప్పటికీ 'ది ఒడిస్సీ' థియేట్రికల్ రన్‌పై ఆ ప్రభావం ఏమాత్రం పడలేదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. నోలన్ సినిమాలకు ఉండే విజువల్ గ్రాండియర్, ఐమాక్స్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ కోసమే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక పాజిటివ్ మౌత్ టాక్‌తో ఆడియన్స్ థియేటర్లను హౌస్‌ఫుల్ చేస్తుండటంతో, గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ మైలురాళ్లను దాటుతూ దూసుకుపోతోంది.
బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌కే తొలి ప్రాధాన్యం:
పైరసీ భూతం ఎంతగా వేధించినా, మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలోనే చూసేందుకు ఇష్టపడతారని 'ది ఒడిస్సీ' నిరూపిస్తోంది. ఇక ఆన్‌లైన్‌లో ఉచితంగా లభించినా సరే, క్రిస్టోఫర్ నోలన్ సృష్టించిన ఆ దృశ్యకావ్యాన్ని ఐమాక్స్ బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ప్రేక్షకులు చూపిస్తున్న ఆసక్తి నిజంగా విశేషం. ఇక ఏదేమైనా, పైరసీని అరికట్టేందుకు చిత్రసీమ మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
