Begin typing your search above and press return to search.

“ది ఇండియా స్టోరీ”… దేశం మొత్తం వినాల్సిన అసలు కథ ఇదే!

తాజా ప్రమోషనల్ వీడియోలో శ్రేయాస్ తల్పడే మాట్లాడుతూ.. "మీరు రోజు రాత్రి హ్యాపీగా భోజనం చేసి పడుకున్నారు గా.. కానీ మాకు మాత్రం నిద్ర పట్టలేదు.

By:  Madhu Reddy   |   6 July 2026 2:47 PM IST
“ది ఇండియా స్టోరీ”… దేశం మొత్తం వినాల్సిన అసలు కథ ఇదే!
X

మనం ప్రతిరోజూ ఎంతో ఇష్టంగా తినే ఆహారంలోనే విషం వుందా ? పంటలు పండించేందుకు వాడుతున్న రసాయనాలు మన పిల్లల భవిష్యత్తును బుగ్గి పాలు చేస్తున్నాయా? ఈ నగ్న సత్యాన్ని కళ్లకు కడుతూ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’. తాజాగా విడుదలైన ఈ సినిమా హార్డ్ హిట్టింగ్ ప్రమోషనల్ వీడియో ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. జూలై 24 న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం..

నిద్ర లేకుండా చేసే చేదు నిజం:

తాజా ప్రమోషనల్ వీడియోలో శ్రేయాస్ తల్పడే మాట్లాడుతూ.. "మీరు రోజు రాత్రి హ్యాపీగా భోజనం చేసి పడుకున్నారు గా.. కానీ మాకు మాత్రం నిద్ర పట్టలేదు. ఈ మూవీ చూస్తే మీకు కూడా అస్సలు నిద్ర పట్టదు" అంటూ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో హింట్ ఇచ్చారు. మన రోజువారీ ఆహారంలో జరుగుతున్న కల్తీ, వ్యవసాయంలో వాడుతున్న పురుగుమందుల వెనుక ఉన్న భయంకరమైన నిజాలను ఈ సినిమా చూపించబోతోంది. నటి కాజల్ అగర్వాల్ సైతం మాట్లాడుతూ.. "నాకు చాలా భయం వేసింది. మనం తినే ఆహారం సేఫ్ అనుకుంటాం కానీ కాదు. ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలని ఈ మూవీ తీశాకే తెలిసింది" అని షాకింగ్ విషయాలు పంచుకున్నారు.

గుండెల్ని పిండేసే ఎమోషనల్ కథ:

ఈ సినిమా కథ ఇటీవల వదిలిన టీజర్ లోనే చెప్పేసారు. ఇక పురుగుమందుల విషపూరిత ప్రభావం వల్ల తన ఏడేళ్ల చిన్నారి కూతురిని క్యాన్సర్‌తో కోల్పోయిన ఒక సాధారణ మధ్యతరగతి తండ్రి చుట్టూ తిరుగుతుంది. కూతురిని కోల్పోయిన ఆ తండ్రి ఆవేదన, ఆ తర్వాత ఒక నిజాయితీ గల లాయర్ కాజల్ అగర్వాల్ సాయంతో ఆహారంలో రసాయనాలు కలిపే ఆ కార్పొరేట్ కంపెనీలపై చట్టపరమైన పోరాటం చేయడం ఈ కథలోని ప్రధానాంశం. ఇక ఈ సోషల్ థ్రిల్లర్ మూవీని చేతన్ డి.కె డైరెక్ట్ చేయగా.. సాగర్ బి. షిండే కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ నిర్మించారు. జీ స్టూడియోస్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది.

ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా:

హిందుస్తాన్‌లోని ప్రతి ఇంటి కథగా తెరకెక్కిన ‘ది ఇండియా స్టోరీ’ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇక కేవలం కమర్షియల్ హంగుల కోసమే కాకుండా.. సమాజంలో తరచూ మన దృష్టికి రాని ఒక కీలక సమస్యను, మన పిల్లల ప్రాణాలతో ముడిపడి ఉన్న భయంకర సత్యాన్ని చూపించబోతున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.