Begin typing your search above and press return to search.

అందుకే ప్రీ వెడ్డింగ్ షో ఒప్పుకున్నా..

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలైనా పర్వాలేదు కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి.

By:  Madhu Reddy   |   6 Nov 2025 5:43 PM IST
అందుకే ప్రీ వెడ్డింగ్ షో ఒప్పుకున్నా..
X

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలైనా పర్వాలేదు కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. అలా మొదట్లో ఇవి చిన్న సినిమాలే.. ఇవేం ఆడతాయి అని లైట్ గా తీసుకుంటారు. కట్ చేస్తే అవే బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి.అలా రీసెంట్గా వచ్చిన లిటిల్ హార్ట్స్ మూవీ ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే లిటిల్ హార్ట్స్ మూవీ లానే మరో మూవీ కూడా మన ముందుకు రాబోతుంది. అదే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. ఈ సినిమా నవంబర్ 7న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రీమియర్స్ వేశారు. అయితే ఈ ప్రీమియర్స్ కి వచ్చిన స్పందన చూసి చిత్ర యూనిట్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతోంది.

అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ అనంతరం మీడియా మిత్రుల సమక్షంలో నిర్వహించగా.. హీరో సినిమా ఒప్పుకోవడానికి గల కారణాన్ని చెప్పారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో భాగంగా.. ఎందుకు మీరు ఈ సినిమాని ఒప్పుకున్నారనే ప్రశ్న ఎదురవగా.. "ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం కామెడీ.. నిన్న ప్రెస్ వాళ్లకి ప్రీమియర్స్ వేసినప్పుడు అందరూ మీడియా వాళ్ళు కదా.. కూర్చొని సీరియస్ గా సినిమా చూస్తారు అనుకున్నాను. ప్రెస్ వాళ్ళ వెనకాలే నేను వారి స్పందన ఎలా ఉంటుందని కూర్చున్నాను. కానీ థియేటర్లో మామూలు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారో ప్రెస్ వాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేశారు. ప్రెస్ వాళ్ళు అలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. ఒక్కొక్కరు తమ సీట్ల నుండి లేచి మరీ పగలబడి నవ్వుకున్నారు.ఆ రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఇక ప్రెస్ వాళ్ళు ఎలా అయితే నవ్వుతూ ఎంజాయ్ చేశారో నేను కూడా స్క్రిప్ట్ వినేటప్పుడు అలాగే నవ్వాను. డైరెక్టర్ స్క్రిప్ట్ చెబుతున్న కొద్దీ ఆ తర్వాత ఏముంటుంది.. ఏంటో చెప్పండి అని చాలా ఆసక్తికరంగా అడుగుతూ ఎంజాయ్ చేశాను. అందుకే నేను ఈ సినిమా ఒప్పుకున్నాను"అని అంటూ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు.

అలాగే చాలామంది నిర్మాతలు సినిమా మీద ఉన్న ఫ్యాషన్ తో వస్తారు. కొంతమంది సినిమాల మీద డబ్బులు సంపాదించడం కోసం వస్తారు. ఇప్పటికే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమాలోనే కొనసాగుతారా.. ఏవైనా కొత్త స్క్రిప్టులు వచ్చాయా అంటూ ప్రొడ్యూసర్ ని ఓ విలేకరి ప్రశ్నించగా.. నేను సినిమాకి లెక్కలు బొక్కలు అంటూ ఏమీ వేసుకోలేదు.నేను ఏదో అనుకోకుండా నిర్మాత అయిపోయాను. డైరెక్టర్ గారి వల్లే సినిమాల్లోకి వచ్చాను. ఇక స్క్రిప్ట్ గురించి చూసుకుంటే.. ఇంస్టాగ్రామ్ లో ఏవేవో మెసేజ్లు పెడుతున్నారు. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం సినిమా హిట్ అవ్వడం. ఈ సినిమా మంచి హిట్ అయి కలెక్షన్స్ వస్తే నెక్స్ట్ ఇయర్ నుండి రెండు సినిమాలతో మీ ముందుకు వస్తాను" అంటూ నిర్మాత ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు.

ఈ మూవీ విషయానికి వస్తే.. తిరువీర్ హీరోగా టీనా శ్రావ్య హీరోయిన్ గా వస్తున్న ఈ మూవీకి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. 7 పీఎం బ్యానర్ పై సందీప్ అగరం, అస్మితారెడ్డిలు నిర్మాతలుగా చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో #90's వెబ్ సిరీస్ ద్వారా ఫేమస్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన చాలామంది సినిమా బాగుందని పాజిటివ్ గా స్పందించారు. మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

ఇక ఈ మూవీలో నటించిన తిరువీర్ ఎవరో కాదు జార్జిరెడ్డి సినిమాలో నటించిన హీరోనే.. జార్జిరెడ్డి తర్వాత మసూద సినిమాతో కూడా మెప్పించారు. అలా పరేషాన్, పలాస 1978 వంటి సినిమాలు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో తిరువీర్ నా జీవితాన్ని మలుపు తిప్పిన నవంబర్ నెల గురించి చెప్పారు.అదేంటంటే నవంబర్లో వచ్చిన జార్జిరెడ్డి.. నవంబర్లో వచ్చిన మసూద రెండు హిట్స్ అయ్యాయి. మళ్లీ నవంబర్లో రాబోతున్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అని చెప్పాడు. మరి నవంబర్లో వస్తున్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మరోసారి తిరువీర్ కి హిట్ ఇస్తుందా అనేది చూడాలి.