ప్రీ వెడ్డింగ్ షో.. ఓవర్సీస్‌లోనూ స్ట్రాంగ్ హోల్డ్!
మసూద ఫేమ్ తిరువీర్ హీరోగా వచ్చిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'.. ఈ నవంబర్ సీజన్‌లో సైలెంట్ కిల్లర్‌లా దూసుకుపోతోంది.
By: M Prashanth | 11 Nov 2025 11:47 AM ISTమసూద ఫేమ్ తిరువీర్ హీరోగా వచ్చిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'.. ఈ నవంబర్ సీజన్‌లో సైలెంట్ కిల్లర్‌లా దూసుకుపోతోంది. ఎలాంటి భారీ ప్రమోషన్లు, స్టార్ కాస్టింగ్ లేకపోయినా.. కేవలం పెయిడ్ ప్రీమియర్ల నుంచి వచ్చిన సాలిడ్ మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రం, ఇప్పుడు ఆడియన్స్ నుంచి బ్లాక్‌బస్టర్ టాక్‌ను అందుకుంటోంది.
ఏ సినిమాకైనా అసలు సిసలు పరీక్ష సోమవారం రోజే ఉంటుంది. ఫస్ట్ వీకెండ్ హడావిడి, హైప్ అంతా అయిపోయాక.. కంటెంట్, మౌత్ టాక్ నిజంగా స్ట్రాంగ్‌గా ఉంటేనే ఆడియన్స్ వర్కింగ్ డే రోజు థియేటర్‌కు వస్తారు. ఈ మండే టెస్ట్ లో 'ప్రీ వెడ్డింగ్ షో' పాస్ అయినట్టే కనిపిస్తోంది. సినిమా జోరు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు, ఓవర్సీస్ మార్కెట్‌లోనూ దీని హవా నడుస్తోంది.
లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, నార్త్ అమెరికాలో ఈ సినిమా చాలా స్టడీగా హోల్డ్ చేస్తోంది. సోమవారం రాత్రి 8:15 సమయానికి, ఈ చిత్రం 6,393 డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఒక పెద్ద స్టార్ సినిమాకు ఇది చిన్న నంబర్ కావచ్చు, కానీ 'ప్రీ వెడ్డింగ్ షో' లాంటి ఒక చిన్న, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాకు ఇది సాలిడ్ హోల్డ్ అనే చెప్పాలి.
సాధారణంగా ఇలాంటి చిన్న సినిమాలకు వీకెండ్ తర్వాత ఓవర్సీస్‌లో డ్రాప్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ, సోమవారం రోజు కూడా 6 వేల డాలర్లకు పైగా కలెక్ట్ చేసిందంటే.. ఇది ప్యూర్ పాజిటివ్ మౌత్ టాక్‌తో మాత్రమే సాధ్యం. ఈ సినిమా ఒక మంచి ఫీల్ ఇస్తుంది అని చూసిన ప్రేక్షకులు, మిగతా వారికి గట్టిగా రికమెండ్ చేస్తున్నారనడానికి ఈ కలెక్షన్లే బెస్ట్ ఎగ్జాంపుల్.
ఈ సినిమాను ఇప్పటికే చాలా మంది 'పెళ్లిచూపులు' లాంటి క్లీన్, నాచురల్ ఎంటర్‌టైనర్‌తో పోలుస్తున్నారు. ఓవర్సీస్ ఆడియన్స్ ఎప్పుడూ ఇలాంటి సహజమైన కామెడీ, ఎమోషన్స్ ఉన్న కథలను బాగా ఆదరిస్తారు. 'ప్రీ వెడ్డింగ్ షో' విషయంలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది. శ్రీకాకుళం యాస, తిరువీర్ టైమింగ్ అక్కడి ప్రేక్షకులకు గట్టిగా కనెక్ట్ అయ్యాయి.
ఇండియాలో ఇప్పటికే మూడు రోజుల్లో 2 కోట్లకు పైగా వసూలు చేసి, పాజిటివ్ టాక్‌తో థియేటర్లను పెంచుకుంటూ పోతున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓవర్సీస్‌లో కూడా మండే టెస్ట్ పాస్ అవ్వడంతో, 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' ఈ ఇయర్ సర్ప్రైజ్ హిట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది మరోసారి కంటెంట్ ఈజ్ కింగ్ అని ప్రూవ్ చేసింది.
