Begin typing your search above and press return to search.

'ప్రీ వెడ్డింగ్ షో'.. ఓవర్సీస్‌లోనూ ఆగట్లేదుగా

లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' నార్త్ అమెరికాలో సాలిడ్ రన్ కంటిన్యూ చేస్తోంది.

By:  M Prashanth   |   12 Nov 2025 11:02 AM IST
ప్రీ వెడ్డింగ్ షో.. ఓవర్సీస్‌లోనూ ఆగట్లేదుగా
X

చాలా రోజుల తర్వాత సాలిడ్ మౌత్ టాక్‌తో దూసుకుపోతున్న చిన్న సినిమా 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. తిరువీర్ హీరోగా, రాహుల్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ఇప్పుడు ఇండియాలోనే కాదు, ఓవర్సీస్‌లోనూ తన సత్తా చాటుతోంది. ఎలాంటి భారీ కాస్టింగ్, హైప్ లేకుండా కేవలం కంటెంట్‌ను నమ్ముకుని రిలీజైన ఈ సినిమా, ఇప్పుడు నార్త్ అమెరికా ఆడియన్స్‌కు కూడా గట్టిగా కనెక్ట్ అయిపోయింది.





లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' నార్త్ అమెరికాలో సాలిడ్ రన్ కంటిన్యూ చేస్తోంది. సినిమా ఇప్పటికే 83,777 డాలర్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసి, ఇంకా స్ట్రాంగ్‌గా కౌంట్ అవుతోంది. పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు కూడా ఒక్కోసారి నిలబడటానికి కష్టపడే యూఎస్ మార్కెట్‌లో, ఒక చిన్న సినిమా ఈ రేంజ్‌లో హోల్డ్ చూపిస్తుండటం విశేషం.

ఈ సినిమాకు అక్కడి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ అదిరిపోతోంది. ఇది ఒక హిలేరియస్ ఎంటర్‌టైనర్ అని, చాలా రోజుల తర్వాత వచ్చిన ఒక క్లీన్, నాచురల్ కామెడీ అని ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నాయి. 'పెళ్లిచూపులు' టైప్ వైబ్, శ్రీకాకుళం యాసలో పండిన సహజమైన కామెడీ, బూతులు లేని కథనం.. ఇవన్నీ ఓవర్సీస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.

ఆడియన్స్ నుంచి వస్తున్న ఈ సాలిడ్ రెస్పాన్స్, స్టడీ కలెక్షన్ల దెబ్బకు.. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు 'అథర్వణ భద్రకాళి పిక్చర్స్' ఇప్పుడు షోలను, లొకేషన్లను మరింత పెంచారు. ఈ వారం నుంచి 'ప్రీ వెడ్డింగ్ షో' మరిన్ని కొత్త ఏరియాలలో సందడి చేయనుంది. ఇది కచ్చితంగా సినిమా ఫైనల్ రన్‌కు, ముఖ్యంగా 100K డాలర్స్ మార్క్ రీచ్ అవ్వడానికి పెద్ద బూస్ట్ ఇస్తుంది.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను దాటేసి, పాజిటివ్ టాక్‌తో థియేటర్లను పెంచుకుంటూ పోతోంది. ఇప్పుడు ఓవర్సీస్‌లో కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేయడం చూస్తుంటే, 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' ఈ ఇయర్ సర్ప్రైజ్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

మొత్తం మీద, తిరువీర్ నటన, డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ టేకింగ్.. ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటి నవ్వులను పంచాయి. 'మసూద' లాంటి ఇంటెన్స్ రోల్ తర్వాత, తిరువీర్ ఇలాంటి కామెడీ టైమింగ్‌తో మెప్పించడం ఫ్యాన్స్‌కు బాగా నచ్చింది. 'కంటెంట్ ఈజ్ కింగ్' అని మరోసారి ప్రూవ్ చేస్తూ, ఈ చిన్న సినిమా ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద సౌండ్ చేస్తోంది.