ది గర్ల్ ఫ్రెండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ అతడే - అరవింద్
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. "మొదట రాహుల్ ఈ కథ చెప్పి ఆహా కి వెబ్ సిరీస్ గా చేద్దాం అన్నాడు. కానీ ఇంత మంచి కథను సినిమాగా చేస్తేనే బాగుంటుందని చెప్పాను.
By: Madhu Reddy | 25 Oct 2025 6:18 PM ISTరష్మిక మందన్న.. వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న ఈమె.. రీసెంట్ గా థామా సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీక్షిత్ శెట్టి కీ రోల్ పోషిస్తూ.. అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడు నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 25) ఘనంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు? అనే విషయాన్ని ఈ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. "నేను హాస్టల్లో ఉన్నప్పుడు అంటే గత 13 సంవత్సరాల క్రితమే ఈ కథకు బీజం పడింది. ఐదేళ్ల క్రితం స్క్రిప్ట్ రాసుకున్నాను. ఇప్పుడు ట్రైలర్లో ఏం చూశారో అదే సినిమా ఇంటెన్స్.. ఎమోషన్ తో కూడుకున్నది. రిలేషన్ షిప్ ట్రై చేయాలనుకునే వారికి ఈ సినిమా చక్కగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా చూసిన యువత కచ్చితంగా ఎమోషన్ తో బయటకొస్తారు. రియల్ గా.. ఇంటెన్స్ గా.. ఎమోషన్ గా ఉంటుంది. నా టీం అందరూ ఫ్యాషనేట్ గా పనిచేశారు. రష్మిక , దీక్షిత్ నా కథకు లైఫ్ ఇచ్చారు. సినిమాలో నేను కూడా ఒక రోల్ చేశాను. జెన్యూన్ గా ఒక కథ చెప్పాలి అని మేమంతా ప్రయత్నించాము. ఈ సినిమాకు మీ సపోర్ట్ కావాలి" అని అన్నారు.
ప్రొడ్యూసర్ విద్య కొప్పినీడు మాట్లాడుతూ.. "రాహుల్ - గీత ఆర్ట్స్ కాంబోలో మూవీ అనగానే మీరంతా ఒక క్యూట్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ ట్రైలర్ చూశాక మీకు అర్థమై ఉంటుంది ఇది ఒక పూర్తిగా విభిన్నమైన లవ్ స్టోరీ అని.. ముఖ్యంగా ఇలాంటి మంచి కథ తీసుకొచ్చిన రాహుల్ కి ధన్యవాదాలు. ఈ పాత్రలో రష్మిక తప్ప మరో హీరోయిన్ చేయలేరేమో.. వీరిద్దరి పెర్ఫార్మన్స్ తో కథకు ప్రాణం పోశారు" అంటూ తెలిపారు.
నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. "బాక్స్ ఆఫీస్ లెక్కలు నాకు తెలియవు. కథను నమ్మి ఫ్యాషనేట్ గా ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచనతోనే ఈ సినిమాతో మీ ముందుకు వచ్చాము.. కెరియర్ లో పది సినిమాలు చేసినా.. అవి అందరికీ గుర్తుండి పోవాలి అనుకుంటాను. వాటిలో ది గర్ల్ ఫ్రెండ్ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ ప్రయాణంలో రాహుల్ నాకు సోదరుడిలా మారిపోయారు. రష్మిక ఈ సినిమాకు ఒప్పుకోవడమే మా మొదటి విజయం. రెమ్యూనరేషన్ గురించి మాట్లాడాలని వెళితే.. సినిమా రిలీజ్ అయ్యాక తీసుకుంటానని చెప్పింది. రష్మిక లేకుంటే ది గర్ల్ ఫ్రెండ్ లేదు.. దీక్షిత్ మాకు దొరికిన గొప్ప నటుడు.. అల్లు అరవింద్ లేకుంటే నేను లేను.. ఆయన నాకు గాడ్ ఫాదర్" అంటూ తెలిపారు.
నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. "సినిమా చివరి 30 నిమిషాలు మర్చిపోలేకపోతున్నాను. రష్మిక మా గీత ఆర్ట్స్ గీత. ఈ సినిమా చూశాక థియేటర్స్ లో కూర్చున్న అమ్మాయిలు 60% ఈ కథకు కనెక్ట్ అవుతారు. మీ గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకు వెళ్తే ఖచ్చితంగా అబ్బాయిలు క్లైమాక్స్ లో జాగ్రత్తగా ఉండండి" అంటూ తెలిపారు.
నిర్మాత ఎస్ కే ఎన్ మాట్లాడుతూ.. "ప్రొడ్యూసర్ విద్యాకి హ్యాట్రిక్ హిట్టు రావాలని కోరుకుంటున్నాను. నాలాగే నా మిత్రుడు ధీరజ్ అంబాజీపేట సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో ఆయనకు మరో హిట్ దక్కుతుందని భావిస్తున్నాను. యానిమల్ , పుష్ప 2, థామా రష్మిక కెరియర్ కు లేదు కామా. రష్మిక పబ్లిసిటీ కంటే సింప్లిసిటీ కోరుకుంటుంది. ఆమెలా డేడికేషన్, కమిట్మెంట్ ఉన్న హీరోయిన్ మరొకరిని నేను చూడలేదు. రష్మిక గీత గోవిందంలో అను ఇమ్మానియేల్ నటించారు. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ లో కూడా అను ఇమ్మానుయేల్ నటించారు. ఈ చిత్రం కూడా మంచి హిట్టు కావాలని కోరుకుంటున్నాను" అంటూ తెలిపారు.
హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ.. "దసరా తర్వాత మళ్లీ మిమ్మల్ని మీట్ అవ్వడం హ్యాపీగా ఉంది. ట్రైలర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.. ఈ కథ విన్నప్పుడు ఈ కథ నుంచి బయటకు రాలేకపోయాను. అంత మంచి స్టోరీ రాహుల్ నా దగ్గరకు తీసుకొచ్చారు. విక్రమ్ అనే క్యారెక్టర్ చేసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. గర్ల్ ఫ్రెండ్ ను ఎలా మేనేజ్ చేయాలో ఈ సినిమా చూశాక నేర్చుకుంటారు. ఈ రోజు అబ్బాయిలు ఎలా ఉన్నారో నా క్యారెక్టర్ ద్వారా చూసుకోవచ్చు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తున్నప్పుడు మేము చాలా అయితే ఎంజాయ్ చేసామో. చూస్తున్నప్పుడు మీరు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు" అంటూ తెలిపారు.
హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ.." కొన్ని విషయాలను కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ తోనే పంచుకుంటాము. ఇక ఇలాంటి లవ్ స్టోరీని ఇప్పటివరకు నేను చూడలేదు. వినలేదు. అందుకే రాహుల్ చెప్పగానే ఓకే చెప్పేసాను. నేను చాలా మూవీస్ చేస్తున్నా.. కానీ ది గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమా చేయడం ముఖ్యమని భావించాను. నాకు బాక్స్ ఆఫీస్ వద్ద నంబర్స్, సక్సెస్ కంటే మంచి మూవీ చేయాలి.. మంచి కథను ఆడియన్స్ కి చెప్పాలని అనిపిస్తుంది"అంటూ తెలిపారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. "మొదట రాహుల్ ఈ కథ చెప్పి ఆహా కి వెబ్ సిరీస్ గా చేద్దాం అన్నాడు. కానీ ఇంత మంచి కథను సినిమాగా చేస్తేనే బాగుంటుందని చెప్పాను. ఈ కథలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. ఈమెకు బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వస్తుంది. ఈ సినిమా చూశాకే దీక్షిత్ కూడా మంచి పెర్ఫార్మర్ అనిపించింది. రష్మిక లాంటి కూతురు ఉంటే బాగుండేది అనిపించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండను గెస్ట్ గా తీసుకొద్దాం" అంటూ నిర్మాత క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి అయితే ఈ చిత్రానికి హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ గా రాబోతున్నట్లు స్పష్టం చేశారు అల్లు అరవింద్.
నటీనటులు - రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, తదితరులు
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ - కృష్ణన్ వసంత్
సంగీతం - హేషమ్ అబ్దుల్ వాహబ్
కాస్ట్యూమ్స్ - శ్రావ్య వర్మ
ప్రొడక్షన్ డిజైన్ - ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి
పీఆర్ఓ - జి.ఎస్.కే మీడియా,వంశీ కాక
మార్కెటింగ్ - ఫస్ట్ షో
సమర్పణ - అల్లు అరవింద్
బ్యానర్స్ - గీతా ఆర్ట్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి
రచన -దర్శకత్వం - రాహుల్ రవీంద్రన్
