Begin typing your search above and press return to search.

'ది గర్ల్‌ఫ్రెండ్'లో ఆ రోల్ అంత స్పెషలా? ఆ ఇద్దరు'నో' చెప్పారట!

సందీప్ వంగా 'నో' చెప్పడంతో, రాహుల్ రవీంద్రన్ మరో యాక్టర్‌ను ట్రై చేశాడని అంటున్నారు. ఈసారి ఆయన టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్‌ను అప్రోచ్ అయ్యాడట.

By:  M Prashanth   |   27 Oct 2025 11:33 PM IST
ది గర్ల్‌ఫ్రెండ్లో ఆ రోల్ అంత స్పెషలా? ఆ ఇద్దరునో చెప్పారట!
X

రష్మిక మందన్న నటిస్తున్న 'ది గర్ల్‌ఫ్రెండ్' ట్రైలర్ రీసెంట్‌గా రిలీజై మంచి బజ్ క్రియేట్ చేసింది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా, ఒక ఇంటెన్స్, రియలిస్టిక్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. ట్రైలర్ కట్, ఎమోషన్స్ అన్నీ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేశాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఇది సినిమాలోని ఒక కీలక పాత్ర గురించి.

ఈ సినిమాలో రష్మిక, హీరో దీక్షిత్ శెట్టితో పాటు అను ఇమ్మాన్యుయేల్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. అయితే, కథలో వీళ్లతో పాటు మరో కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్ర నిడివి తక్కువే అయినా, ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని సమాచారం. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మొదట ఈ రోల్ కోసం చాలా పెద్ద పేర్లనే ట్రై చేశాడని టాక్.

రాహుల్ రవీంద్రన్ ఫస్ట్ ఛాయిస్ ఎవరో కాదు.. 'యానిమల్', 'అర్జున్ రెడ్డి' లాంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అని తెలుస్తోంది. ఒక డైరెక్టర్‌ను యాక్టింగ్ కోసం అప్రోచ్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయమే. అయితే, సందీప్ రెడ్డి వంగా ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. కారణం ఏంటంటే, ఆ రోల్ కేవలం 'కామియో' (గెస్ట్ రోల్) కాదని, అంతకు మించి ఉందని, అందుకే తనకు సెట్ అవ్వదని సందీప్ ఫీల్ అయ్యాడట. గతంలో సందీప్ మహానటిలో నటించిన విషయం తెలిసిందే.

సందీప్ వంగా 'నో' చెప్పడంతో, రాహుల్ రవీంద్రన్ మరో యాక్టర్‌ను ట్రై చేశాడని అంటున్నారు. ఈసారి ఆయన టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్‌ను అప్రోచ్ అయ్యాడట. కానీ, వెన్నెల కిషోర్ కూడా ఈ రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదని సమాచారం. ఒక స్టార్ డైరెక్టర్, ఒక టాప్ కమెడియన్ ఇద్దరూ వద్దనుకున్న ఆ పాత్రలో అంత స్పెషాలిటీ ఏముంది? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో క్యూరియాసిటీని పెంచుతోంది.

ఫైనల్‌గా, ఆ రోల్ చేసేందుకు మరెవరూ దొరక్కపోవడంతో.. డైరెక్టర్ రాహుల్ రవీంద్రనే స్వయంగా ఆ పాత్రను చేశాడని అంటున్నారు. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌లో రాహుల్ రవీంద్రన్ కనిపించడంతో నిజమే అయ్యిండొచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి, అంతమంది రిజెక్ట్ చేసిన ఆ పాత్ర గుట్టు ఏంటో తెలియాలంటే నవంబర్ 7 వరకు ఆగాల్సిందే. గీతా ఆర్ట్స్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాను విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మించారు