Begin typing your search above and press return to search.

'గర్ల్ ఫ్రెండ్'.. అసలు సిసలు టెస్ట్ పాస్ అయినట్లేనా..

సాధారణంగా ఏ సినిమాకైనా అసలైన పరీక్ష మొదటి సోమవారం రోజే ఉంటుంది. ఓపెనింగ్ వీకెండ్ హడావిడి, హైప్ అంతా ముగిశాక, కంటెంట్ బాగుంటేనే సినిమా వర్కింగ్ డే రోజున థియేటర్లలో నిలబడుతుంది.

By:  M Prashanth   |   11 Nov 2025 11:40 AM IST
గర్ల్ ఫ్రెండ్.. అసలు సిసలు టెస్ట్ పాస్ అయినట్లేనా..
X

సాధారణంగా ఏ సినిమాకైనా అసలైన పరీక్ష మొదటి సోమవారం రోజే ఉంటుంది. ఓపెనింగ్ వీకెండ్ హడావిడి, హైప్ అంతా ముగిశాక, కంటెంట్ బాగుంటేనే సినిమా వర్కింగ్ డే రోజున థియేటర్లలో నిలబడుతుంది. ఈ మండే టెస్ట్ విషయంలో, రష్మిక మందన్న 'ది గర్ల్ ఫ్రెండ్' గట్టిగానే నిలబడినట్లు మేకర్స్ చెబుతున్నారు. సినిమా కేవలం నిలబడటమే కాదు, మరో రికార్డును సెట్ చేసింది.





మేకర్స్ లేటెస్ట్ విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, ఈ సినిమా మొదటి రోజు కంటే 4వ రోజు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టినట్లు క్లారిటీ ఇచ్చారు. అంటే, శుక్రవారం (నవంబర్ 7, ప్రీమియర్లతో కలిపి) వచ్చిన కలెక్షన్ల కంటే, వర్కింగ్ డే అయిన సోమవారం (నవంబర్ 10) నాడు కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయి. ఇది ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచే ట్రెండ్.





ఈ స్ట్రాంగ్ హోల్డ్‌కు కారణం క్లియర్‌గా కనిపిస్తోంది. అదే పాజిటివ్ "వర్డ్ ఆఫ్ మౌత్". సినిమా చూసిన ప్రేక్షకులు, ముఖ్యంగా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్.. సినిమాలోని ఎమోషన్స్‌కు, రష్మిక పెర్ఫార్మెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యారని అంటున్నారు. వీకెండ్‌లో చూసిన వారు రికమెండ్ చేయడంతో, సోమవారం నాడు కూడా కొత్త ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారు.

ఈ ట్రెండ్ ఆన్‌లైన్ బుకింగ్స్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌లో ది గర్ల్ ఫ్రెండ్ ఇంకా ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. వర్కింగ్ డేస్‌లోనూ సాలిడ్ ట్రెండ్ కొనసాగుతోంది అంటూ మేకర్స్ మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రకారం, గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 36.04 వేలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి.

ఒక వర్కింగ్ డే రోజున, రిలీజై నాలుగు రోజులు దాటిన సినిమాకు ఈ రేంజ్‌లో బుకింగ్స్ జరగడం అంటే, సినిమా ఆడియన్స్‌కు గట్టిగానే కనెక్ట్ అయిందని అర్థమవుతోంది. మొత్తం మీద, 'ది గర్ల్ ఫ్రెండ్'కు సోమవారం అంతగా ఎఫెక్ట్ చూపలేదని అర్ధమవుతుంది. పైగా మరింత స్ట్రాంగ్‌గా పికప్ అయింది. రాహుల్ రవీంద్రన్ టేకింగ్, రష్మిక నటనకు ఆడియన్స్ నుంచి వస్తున్న ఈ పాజిటివ్ రెస్పాన్స్ సినిమాను బాక్సాఫీస్ వద్ద సేఫ్ జోన్‌కు తీసుకెళ్లేలా కనిపిస్తోంది. ఇక ఈ వారం చివర్లో లెక్క ఎంతవరకు వెళుతుందో చూడాలి.