Begin typing your search above and press return to search.

గ‌ర్ల్‌ఫ్రెండ్ కు క‌లెక్ష‌న్లే కాదు, ప్ర‌శంస‌లు కూడా!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా, టాలెంటెడ్ యాక్ట‌ర్ దీక్షిత్ శెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ది గ‌ర్ల్‌ఫ్రెండ్ సినిమాకు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   19 Nov 2025 7:17 PM IST
గ‌ర్ల్‌ఫ్రెండ్ కు క‌లెక్ష‌న్లే కాదు, ప్ర‌శంస‌లు కూడా!
X

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా, టాలెంటెడ్ యాక్ట‌ర్ దీక్షిత్ శెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ది గ‌ర్ల్‌ఫ్రెండ్ సినిమాకు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా అన్ని వ‌ర్గాల ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకోవ‌డంతో పాటూ బాక్సాఫీస్ వ‌ద్ద కూడా ది గ‌ర్ల్‌ఫ్రెండ్ మంచి క‌లెక్ష‌న్ల‌తో స‌క్సెస్ ను అందుకుంది.

రూ.30 కోట్లు క‌లెక్ట్ చేసిన ది గ‌ర్ల్‌ఫ్రెండ్

న‌వంబ‌ర్ 7న రిలీజైన ఈ సినిమా ఇప్ప‌టికీ మంచి క‌లెక్ష‌న్ల‌తో ప‌లు కేంద్రాల్లో స‌క్సెస్‌ఫుల్ గా ర‌న్ అవుతూ, బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ది గ‌ర్ల్‌ఫ్రెండ్ కు ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కర్ణాట‌క మార్కెట్స్ లో రూ.23 కోట్ల గ్రాస్ తో పాటూ ఓవ‌ర్సీస్ లో రూ.7 కోట్లు క‌లెక్ట్ చేసి వ‌ర‌ల్డ్ వైడ్ గా మొత్తం రూ.30 కోట్లు వ‌సూలు చేసి బాక్సాఫీస్ వ‌ద్ద ర‌ష్మిక స‌త్తా చాటింది గ‌ర్ల్‌ఫ్రెండ్.

విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా..

ది గ‌ర్ల్‌ఫ్రెండ్ కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్ ను అందుకోవ‌డమే కాకుండా విమ‌ర్శ‌కుల నుంచి, స్ట్రాంగ్ ఆడియ‌న్స్ నుంచి కూడా మంచి ప్ర‌శంస‌లను అందుకుని ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. సినిమాలో ర‌ష్మిక‌, దీక్షిత్ శెట్టి యాక్టింగ్ తో పాటూ రాహుల్ ర‌వీంద్ర‌న్ డైరెక్ష‌న్ కు, ఈ క‌థ‌ను ఆయ‌న తీర్చిదిద్దిన విధానానికి ఎన్నో ప్ర‌శంస‌లొస్తున్నాయి.

అను ఇమ్మాన్యుయేల్, రావు ర‌మేష్, రాహుల్ ర‌వీంద్ర‌న్, రోహిణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా నిర్మాత‌ల‌కు కేవ‌లం స‌క్సెస్ ను మాత్ర‌మే కాకుండా మ‌రిన్ని లాభాల‌ను కూడా మిగిల్చింది. ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్, ధీర‌జ్ మొగిలినేని ఎంట‌ర్టైన్మెంట్ బ్యాన‌ర్ల‌లో విద్యా కొప్పినీడి, ధీర‌జ్ మొగిలినేని ది గ‌ర్ల్‌ఫ్రెండ్ ను సంయుక్తంగా నిర్మించారు.