రష్మిక సినిమా లేడీ ఓరియేంటెడ్ కాదా?
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా పాన్ ఇండియాలో ఓ బ్రాండ్ అని చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు ఏ భాషలో నటిం చినా? రష్మిక పేరుతో మార్కెట్ లోకి వెళ్లిపోతుంది.
By: Srikanth Kontham | 2 Nov 2025 9:43 PM ISTనేషనల్ క్రష్ రష్మికా మందన్నా పాన్ ఇండియాలో ఓ బ్రాండ్ అని చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు ఏ భాషలో నటిం చినా? రష్మిక పేరుతో మార్కెట్ లోకి వెళ్లిపోతుంది. టాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకూ అంతా రష్మిక జపమే. ఇలా ఫేమస్ అయితే ఆ ప్రభావం సినిమా కంటెంట్ పై కూడా పడుతుందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ `ది గర్ల్ ప్రెండ్` అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈసినిమాని తొలి నుంచి లేడీ ఓరియేంటెడ్ చిత్రంగానే హైలైట్ అయింది. టైటిల్ కూడా అలాగే ఉండటంతో ప్రేక్షకులు అదే నిజమని నమ్మారు.
కానీ అసలు సంగతేంటి అంటే ఇది లేడీ ఓరియేంటెడ్ చిత్రం కాదని నిర్మాత ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఓ లవ్ స్టోరీగా చెప్పుకొచ్చారు. ప్రేక్షకులపై గాఢమైన ప్రభావం చూపించే ప్రేమ కథల్ని ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాం అన్నారు. `ది గర్ల్ ప్రెండ్` కూడా అలాంటి కథే అంటూ నిర్మాత ధీరజ్ మొగిలినేని ప్రకటించారు. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రిన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో ఈసినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో సినిమా స్టోరీ కూడా బయటకు వచ్చింది.
ఇది కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీ. కేవలం నాయిక కోణంలోనే కథ సాగుతుందిట. ఇందులో హీరోగా దీక్షిత్ నటిస్తున్నట్లు తెలిపారు. రష్మికకు ఈ కథ నచ్చడంతో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా పనిచేసిందన్నారు. అయితే రిలీజ్ అనంతరం రెట్టించిన పారితోషికం చెల్లిస్తామన్నారు. ఇంత వరకూ రష్మిక నటిస్తోన్న మరో లేడీ ఓరియేంటెడ్ చిత్రంగా జనాల్లోకి వెళ్లింది. రష్మిక కూడా ఇంత వరకూ లేడీ ఓరియేంటెడ్ సినిమా చేయలేదు. `ది గర్ల్ ప్రెండ్` ప్రచార చిత్రాలకు మంచి బజ్ రావడంతో? సినిమాపై అంచనాలు పెరిగాయి.
లేడీ నాయికగానూ సత్తా చాటుతుందని అంచనాలు ఏర్పడ్డాయి. జనాల్లోకి కూడా అలాగే వెళ్లింది. తాజాగా నిర్మాత ప్రకటనతో సన్నివేశం మారుతుందా? అన్నది చూడాలి. సినిమా రిలీజ్ కు ఇంకా ఐదు రోజులు సమయం ఉంది. అయితే నిర్మాత చివరి వరకూ అసలు విషయాన్ని చెప్పకపోవడం వెనుక పబ్లిసిటీ కారణం కూడా ఉండొచ్చు అన్న సందేహం వ్యక్తమవుతుంది. లేడీ ఓరియేంటెడ్ చిత్రం కాదని చెప్పకపోతే సినిమా జనాల్లోకి వెళ్లదా? అన్న సందేహంతోనే ఇలాంటి స్ట్రాటజీ అనుసరించారా? అంటూ చర్చ మొదలైంది.
