'గర్ల్ ఫ్రెండ్' చున్నీ వివాదం.. SKN ఏమన్నారంటే?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 13 Nov 2025 11:14 AM ISTనేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. పాజిటివ్ రెస్పాన్స్ అందుకుని సందడి చేస్తోంది. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకుంటూ మంచి చర్చకు కూడా దారి తీస్తుందని చెప్పాలి.
అయితే తాజాగా సినిమా ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్ కు ప్రమోషన్స్ లో భాగంగా రాహుల్ రవీంద్రన్ వెళ్లారు. ఆ సమయంలో మూవీ అంతా అయ్యాక.. సినిమా తనకు బాగా నచ్చిందని, దర్శకుడు చూపించిన పెయింట్స్ గురించి మాట్లాడింది ఓ యువతి. ఇలాంటి సినిమా చూసినందుకు తనకు చాలా హ్యాపీగా ఉందని చెప్పింది.
అంతే కాదు.. ఇలాంటి సినిమాలు ఇంతకుముందు రాలేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆమె.. చివర్లో చున్నీ తీసేసి ధైర్యంగా ఉందని చెప్పింది. దీంతో ఆమె ధైర్యానికి మెచ్చుకున్న దర్శకుడు.. యువతి హాగ్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా కాగా.. అనేక మంది నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఉమెన్ ఎంపవర్ మెంట్ అంటే ఒంటి మీద ఉన్న చున్నీ ని తీసివేసి తాము ధైర్యంగా ఉన్నామని చెప్పడం కాదంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. చున్నీ తీసివేయడం అనేది ఉమెన్ ఎంపవర్ మెంట్ లో భాగం కాదని సూచించారు. అది కరెక్ట్ కాదని, మేకర్స్ కూడా వీడియో ఆ పోస్ట్ చేయడంతో ఇంకొందరు తప్పుపట్టారు.
దీంతో అది కాస్త చిన్నపాటి వివాదంగా మారగా.. ఇప్పుడు నిర్మాత ఎస్కేఎన్ రెస్పాండ్ అయ్యారు. ఆ విషయంపై నెట్టింట ట్రోల్స్ ఎక్కువ వస్తుండడంతో.. సక్సెస్ మీట్ లో మాట్లాడారు. గత వారం రిలీజ్ అయిన గర్ల్ ఫ్రెండ్ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుందని, అందుకే మూవీ టీమ్ థియేటర్లకు వెళ్తుందని ఎస్కేఎన్ తెలిపారు.
సినిమా ద్వారా తాము చెప్పాలనుకున్నది భయాన్ని పోగొట్టమని మాత్రమేనని అన్నారు. అంతే గానీ చున్నీలు తీసేయమని కాదని చెప్పారు. ఆ సీన్ ఉద్దేశం మహిళలు తమలోని భయాన్ని తొలగించుకోవడం గురించని తెలిపారు. అందుకే దయచేసి ఆ విషయంలో వేరే కోణంలో చూడడం సరైనది కాదంటూ ఎస్కేఎన్ వివరణ ఇస్తూ మాట్లాడారు. దీంతో ఆ చున్నీ వివాదంపై తాత్కాలికంగా ఎస్కేఎన్ క్లారిటీ ఇచ్చారనే చెప్పాలి.
