Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ మ్యాన్ 3.. టార్గెట్ చేసింది ఎవరు..?

రాజ్ అండ్ డీజే అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం చేసిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ సూపర్ హిట్ అవ్వడంతో అప్పటి నుంచి వెబ్ సీరీస్ లకు మంచి డిమాండ్ పెరిగింది.

By:  Ramesh Boddu   |   3 Nov 2025 4:39 PM IST
ఫ్యామిలీ మ్యాన్ 3.. టార్గెట్ చేసింది ఎవరు..?
X

రాజ్ అండ్ డీజే అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం చేసిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ సూపర్ హిట్ అవ్వడంతో అప్పటి నుంచి వెబ్ సీరీస్ లకు మంచి డిమాండ్ పెరిగింది. వెబ్ సీరీస్ లకు ఒక క్రేజ్ తెచ్చిన సీరీస్ గా ఫ్యామిలీ మ్యాన్ రికార్డ్ సృష్టించింది. మనోజ్ బాజ్పేయి లీడ్ రోల్ లో తెరకెక్కిన ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ రెండు సక్సెస్ ఫుల్ సీజన్స్ గా వచ్చింది. ఇక త్వరలో ది ఫ్యామిలీ మ్యాన్ 3వ సీజన్ రాబోతుంది. ఈ సీజన్ కూడా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ లతో వస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ఇంప్రెస్ చేశాయి.

ఫ్యామిలీ మ్యాన్ 3 ఇంట్రెస్టింగ్ పోస్టర్..

ఓ పక్క ఫ్యామిలీ మ్యా గా మరోపక్క పార్ట్ టైం స్పై గా శ్రీకాంత్ తివారి రోల్ లో మనోజ్ అదరగొట్టేస్తున్నారు. ఐతే ఫ్యామిలీ మ్యాన్ 3 నుంచి లేటెస్ట్ గా ఒక పోస్టర్ రిలీజైంది. ఈ పోస్టర్ చూసిన ఆడియన్స్ అంతా షాక్ అవుతున్నారు. తివారిని అతని టీం మేట్ ని టార్గెట్ చేస్తూ కొందరు ఎటాక్ చేస్తారు. ఇంతకీ వాళ్లు ఎవరు అతన్ని ఎందుకు టార్గెట్ చేశారన్నది ఆసక్తికరంగా మారింది.

ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ ని తప్పనిసరిగా ఒకసారి చూసేయాలి అనిపించేలా ఆ సీరీస్ ఫ్యాన్స్ ఉన్నారు. ఓ పక్క ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తూ మరోపక్క థ్రిల్ చేస్తూ స్పై సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తూ ఈ సీరీస్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో మనోజ్ తో పాటుగా ప్రియమణి, షరీబ్ హష్మి, అష్లేషా ఠాకూర్, వేదాంత్ సిన్హా, శ్రేయా ధన్వంతరి తో పాటుగా సినిమాలో కొత్తగా జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్ కూడా జాయిన్ అవుతున్నారు.

ది ఫ్యామిలీ మ్యాన్ 3 సీరీస్ నవంబర్ 12న రిలీజ్..

ది ఫ్యామిలీ మ్యాన్ 3 సీరీస్ నవంబర్ 12న రిలీజ్ ఫిక్స్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఎన్నో సీరీస్ లు వచ్చినా వస్తున్నా కూడా ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ లకు ఉండే స్పెషాలిటీ వేరుగా ఉంటుంది. ది ఫ్యామిలీ మ్యాన్ 3 కూడా పాజిటివ్ బజ్ తో రాబోతుంది. ఈ సీజన్ ని రాజ్ & డీకే ఇంకాస్త ఫోకస్ గా తెరకెక్కించారని తెలుస్తుంది.

రాజ్ అండ్ డీకే సినిమాలకు ఈక్వెల్ గా వెబ్ సీరీస్ లు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయని ప్రూవ్ చేశారు. అందుకే వారు చేస్తున్న ప్రతి వెబ్ సీరీస్ కు విపరీతమైన క్రేజ్ వస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ తో పాటు ఈ ఇద్దరు సిటాడెల్ సీరీస్ ని కూడా చేసిన విషయం తెలిసిందే.