సామ్ 'ఫ్యామిలీ మ్యాన్' మూడో పార్ట్.. ఈసారి మరింతగా...
ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న సీజన్ 3.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
By: M Prashanth | 1 Aug 2025 3:58 PM IST'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు రెండు సీజన్స్ రాగా.. ఆడియన్స్ ను విపరీతంగా అలరించాయి. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సిరీస్ రెండు పార్టులు.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఓ రేంజ్ లో సందడి చేశాయి. అనేక రికార్డులు కూడా క్రియేట్ చేశాయి.
ఇప్పుడు ముచ్చటగా మూడో పార్ట్ రానుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3.. త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనే అందుబాటులోకి రానుంది. రీసెంట్ గా మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందరినీ ఆకట్టుకుని.. మంచి అంచనాలు క్రియేట్ చేసింది టీజర్.
టీజర్ లో మనోజ్ బాజ్‌పాయ్ తాను రిలేషన్ షిప్ మేనేజర్ అంటూ పరిచయం చేసుకోగా.. పాతాళ్ లోక్ యాక్టర్ జైదీప్ అహ్లవత్ మూడో పార్ట్ లో విలన్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. నార్త్ ఈస్ట్ బ్యాక్ డ్రాప్ లో సీజన్ 3 ఉండనున్నట్లు అర్థమవుతుంది. షరీబ్ హష్మి, ఆశ్లేష ఠాకూర్, శరద్ ఖేల్కర్, సందీప్ కిషన్ తదితరులు కనిపించనున్నారు.
ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న సీజన్ 3.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే వెబ్ సిరీస్ లవర్స్.. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. రీసెంట్ గా మూడో సీజన్.. ముందు వాటి కన్నా డార్కర్.. మరింత ఇంటెన్స్ తో ఉంటుందని దర్శన్ కుమార్ తెలిపారు. కథాంశానికి మూడో సీజన్ ప్రధాన ముందడుగు గా అభివర్ణించారు.
కాగా, 2019 సెప్టెంబర్ 20న ది ఫ్యామిలీ మ్యాన్ తొలి సీజన్ రిలీజై ఓ రేంజ్ లో అలరించింది. దానికి సీక్వెల్ గా 2021 జూన్ 4న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 స్ట్రీమింగ్ లోకి వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. రెండూ మంచి విజయాన్ని సాధించాయి. సెకండ్ సీజన్‌లో సమంత నటించడంతో సౌత్ లో కూడా మంచి ఆదరణ దక్కింది.
భారత గూఢచార విభాగంలో వర్క్ చేసే ఓ వ్యక్తి, అతని కుటుంబం.. విధి నిర్వహణలో ఎదురయ్యే పరిస్థితులను ఇప్పటి వరకు రెండు సీజన్స్ లో చూపించారు మేకర్స్. తొలి సీజన్ ను భారత్ పై ఉగ్రవాదులు చేసే కుట్రలు, దాడులను ఎదుర్కోవడం వంటి పరిణామాలతో తీశారు. రెండో సీజన్ లో తమిళ టైగర్స్ పై స్పెషల్ ఆపరేషన్ వగైరా వాటితో ఆడియన్స్ ను మెప్పించారు. ఇప్పుడు థర్డ్ పార్ట్ తో ఎలా మెప్పిస్తారో చూడాలి.
