రిలీజ్ ఆపొద్దని ముఖ్యమంత్రికి డైరెక్టర్ విన్నపం
బెంగాల్ విభజన, ముస్లిమ్ లీగ్ ఉద్యమం, హిందూ మారణ హోమం వంటి వివాదాస్పద అంశాలను టచ్ చేస్తూ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన `ది బెంగాళ్ ఫైల్స్` విడుదలకు రాజకీయాంగా అడ్డంకులు ఏర్పడిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 3 Sept 2025 8:33 AM ISTబెంగాల్ విభజన, ముస్లిమ్ లీగ్ ఉద్యమం, హిందూ మారణ హోమం వంటి వివాదాస్పద అంశాలను టచ్ చేస్తూ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన `ది బెంగాళ్ ఫైల్స్` విడుదలకు రాజకీయాంగా అడ్డంకులు ఏర్పడిన సంగతి తెలిసిందే. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అగ్నిహోత్రిపై రకరకాల ఎఫ్ ఐఆర్‌లు నమోదు చేసారు. ఈ సినిమాని పశ్చిమ బెంగాళ్ లో విడుదల కానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
సెన్సార్ ఆమోదించిన సినిమాకు అడ్డు కట్ట వేయకండి.. థియేటర్ యజమానులపై రాజకీయంగా ఒత్తిళ్లు ఉన్నాయి. అందువల్ల వారు ఈ సినిమాని రిలీజ్ చేయలేమని అంటున్నారు. కానీ నా సినిమా సవ్యంగా రిలీజ్ అవ్వడానికి సహకరించండి! అంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అగ్నిహోత్రి అభ్యర్థించారు. 5 సెప్టెంబర్ 2025న తన సినిమా విడుదలను నిషేధించవద్దని సీఎంకి విజ్ఞప్తి చేసారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సినిమా విడుదలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన తర్వాత రాజకీయంగా ఎదురుదెబ్బలు తినడంపై ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు.
అగ్నిహోత్రి అభ్యర్థన ఇలా ఉంది. ``అత్యవసరం: గౌరవనీయులైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బహిరంగ విజ్ఞప్తి. దయచేసి చివరి వరకు వినండి .. హిందూ మారణహోమంపై సినిమాను నిషేధించినందుకు మీ నిరసనగా విస్తృతంగా షేర్ అయింది. #ది బెంగాళ్ ఫైల్స్ సినిమా థియేటర్లలో 05 సెప్టెంబర్ 2025న వస్తోంది. రాష్ట్రంలో థియేటర్లలో విడుదల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని యజమానులు అంటున్నారు. థియేటర్ యజమానులు దీనిని నిషేధించకపోయినా, వారిపై చాలా రాజకీయ ఒత్తిడి ఉంది. షోలో వేయడానికి వారు అధిక ధర చెల్లించాల్సి ఉంటుందని నాకు చెబుతున్నారు. అందుకే షోలు వేయడానికి భయపడుతున్నారు. మీ పార్టీ కార్యకర్తలు కూడా ఈ చిత్రాన్ని నిషేధించాలని అడుగుతున్నారు. అందుకే ఈ చిత్రాన్ని పశ్చిమ బెంగాల్‌లో శాంతియుతంగా విడుదల చేయాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను... అని అన్నారు.
మీరు భారత రాజ్యాంగం ప్రకారం.. ప్రతి పౌరుడి హక్కులను, భారత ప్రజల స్వేచ్ఛా వాక్ స్వాతంత్య్రాన్ని కాపాడతామని ప్రమాణం చేశారు. సీబీఎఫ్‌సి ఈ చిత్రాన్ని ఆమోదించింది. ఇది రాజ్యాంగ సంస్థ. అందుకే ఈ చిత్రాన్ని శాంతియుతంగా విడుదల చేయడం మీ రాజ్యాంగ విధి అని అగ్నిహోత్రి అన్నారు.
ఈ రాష్ట్రంలో ఈ చిత్రాన్ని ఎందుకు విడుదల చేయాలి అంటే? భారతదేశం ఒక దేశంగా చాలా కాలంగా అణచివేతకు గురైంది.. బానిసత్వంలో ఉంది! అని అన్నారు. 1200 సంవత్సరాలకు పైగా విలువైన సంస్కృతి, మతం, గుర్తింపు, సాహిత్యం, కళ, వాస్తుశిల్పం అన్నిటినీ నాశనం చేసారు. దానిలో అత్యంత భయంకరమైన, బాధాకరమైన అధ్యాయం ఉంది. ఇందులో డైరెక్ట్ యాక్షన్ డే .. హిందూ మారణహోమం జరిగాయి. ఇవి జరగకపోతే, బహుశా భారతదేశం విభజితమై ఉండేది కాదు. కానీ ఇదంతా మర్చిపోయి ఉండవచ్చు. లేదా బహుశా దాచి ఉంచారు! అని అన్నారు. వివేక్ అగ్నిహోత్రి ది బెంగాళ్ ఫైల్స్ లో ఎలాంటి కంటెంట్ ని చూపిస్తున్నారో అతడి మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
