Begin typing your search above and press return to search.

ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ టీజర్ టాక్..!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ హీరోగా అవుతాడని అనుకుంటే అతను డైరెక్టర్ అవతారమెత్తాడు.

By:  Ramesh Boddu   |   21 Aug 2025 1:33 PM IST
ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ టీజర్ టాక్..!
X

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ హీరోగా అవుతాడని అనుకుంటే అతను డైరెక్టర్ అవతారమెత్తాడు. అతని డైరెక్షన్ లో తొలి సినిమాగా వస్తుంది ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్. ఈ సినిమాలో లక్ష్య, బాబీ డియోల్, రాఘవ్, షహెర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబందించిన టీజర్ రిలీజ్ చేశారు. షారుఖ్ ఖాన్ హోస్ట్ గా గెస్ట్ గా వచ్చి ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో ఓపెనింగ్ వాయిస్ కూడా షారుఖ్ ఇచ్చాడు.

బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్..

ఇక అస్మాన్ సింగ్ అంటూ లక్ష్యని హీరోగా పరిచయం చేస్తూ సినిమా టీజర్ ఓపెన్ అవుతుంది. బోర్న్ హీరోస్ కన్నా హీరోలు డిఫరెంట్ గా ఉంటారంటూ చెబుతాడు షారుఖ్. ఇక బాలీవుడ్ హీరోగా అస్మాన్ సింగ్ ఎంట్రీ మిగతా వ్యవహారాలు చూపిస్తాడు. సినిమాలో బాబీ డియోల్ కూడా నటించారు. ఆయన సూపర్ స్టార్ అజయ్ గా నటిస్తున్నాడు.

సినిమాలో బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్ తో పాటు డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా అలా తళుక్కున మెరిసారు. మొత్తానికి బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ టీజర్ ఇంప్రెస్ చేసింది. ఐతే ఈ సినిమా బాలీవుడ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. తప్పకుండా సినిమాతో ఆర్యన్ ఖాన్ ఒక మంచి రిజల్ట్ అందుకునేలా ఉన్నాడు.

ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్..

బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 18న రిలీజ్ అవుతుంది. ఈ టీజర్ చూస్తుంటే ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరేలా ఉన్నాడు. టీజర్ ఇంప్రెస్ చేసేలా ఉండగా సినిమా కూడా ఓటీటీ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేలా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో అయిన షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఈ టీజర్ కూడా సంథింగ్ స్పెషల్ అనిపించింది. ఐతే టీజర్ లో బాలీవుడ్ మీద తన మార్క్ సెటైర్ లానే అనిపిస్తుంది. మరి రిలీజ్ తర్వాత సినిమా గురించి ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారన్నది చూడాలి.

మరి విజువల్స్ మాత్రమేనా సినిమా కంటెంట్ పరంగా కూడా ఆర్యన్ తన మార్క్ చూపించాడా లేదా అన్నది మరో నెల రోజుల్లో తెలుస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ రిలీజ్ చేయడం కూడా మంచి ప్లానే అంటున్నారు.