Begin typing your search above and press return to search.

టాలీవుడ్ అంతా వారి చేతుల్లో? తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే?

టాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ గురించి అందరికీ తెలిసిందే. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

By:  M Prashanth   |   7 Feb 2026 7:00 AM IST
టాలీవుడ్ అంతా వారి చేతుల్లో? తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే?
X

టాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ గురించి అందరికీ తెలిసిందే. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. స్పెషల్ స్టోరీలు, వినూత్న ప్రయత్నాలతో న్యూ ఏజ్ స్టోరీ మేకర్ గా క్రేజ్ సొంతం చేసుకున్నారు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో యువతకు బాగా దగ్గరయ్యారు. అంతే కాదు.. కొత్త తరహా కథలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.

అదే సమయంలో అనేక సినిమాల్లో నటించారు తరుణ్ భాస్కర్. మహానటి మూవీతో యాక్టర్ గా కూడా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో యాక్ట్ చేసి మెప్పించారు. అయితే అలా దర్శకుడిగా, నటుడిగా ఇప్పటికే పలు హిట్స్ అందుకున్న తరుణ్ భాస్కర్.. టాలీవుడ్ లో తన జర్నీ, సవాళ్లు, అపోహలు సహా పలు విషయాలపై రీసెంట్ గా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ఆయన లీడ్ రోల్ లో నటించిన ఓం శాంతి శాంతి శాంతిః మూవీ రిలీజ్ అవ్వగా, అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ సమయంలో తన సినీ జర్నీ అంత ఈజీగా సాగలేదని, మధ్యలో కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నానని ఆయన తెలిపారు. కానీ జర్నీ మీద తనకు ఎలాంటి రిగ్రెట్ లేదని తెలిపారు. యాక్టర్ గా మంచి పేరొచ్చినా పర్సనల్ సాటిస్ఫికేషన్ మాత్రం డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోనే ఉందని చెప్పారు.

ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది రిపీట్ షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌ను ఎంజాయ్ చేస్తున్నానని, తొలి సినిమాతో పోల్చుకుంటే మూవీ స్కేల్ పెద్దగా ఉంటుందని చెప్పారు. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయని, ఒకే జానర్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎప్పుడూ ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవకుండా డిఫరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జానర్ సినిమాలు చేయాలనుందని మనసులోని మాట బయటపెట్టారు. అంతే కాదు.. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ జరిగే అవుట్‌ సైడర్స్ చర్చపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అదంతా మనం క్రియేట్ చేసుకున్నదేనని వ్యాఖ్యానించారు. కొన్ని కుటుంబాల చేతుల్లో సినీ ఇండస్ట్రీ ఉందన్న భావనను మనం సృష్టించుకున్న అపోహ అని స్పష్టం చేశారు. సినిమా అనేది ఒక టెక్నికల్ ప్రొడక్ట్ మాత్రమేనని తెలిపారు. మంచి క్వాలిటీ వీడియో, సౌండ్‌ తో కూడిన ఫైల్‌ ను తయారు చేసి సర్వర్‌ లో అప్లోడ్ చేస్తామని చెప్పారు. అంతే దానికంటే పెద్ద విషయం ఏమీ లేదని అన్నారు.

కానీ ఎవరో ఒక కుటుంబం ఇండస్ట్రీని నడుపుతోందని, మనం అవుట్‌ సైడర్ అనుకుంటూ ఉంటే అదే మనసులో మిగిలిపోతుందని ఆయన తెలిపారు. మనసులో ఉన్న భయం అవకాశాలను దూరం చేస్తుందని, టాలెంట్ ఉంటే ఎవరికైనా ఛాన్స్ లు దక్కుతాయని తరుణ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ కు కొందరు నెటిజన్లు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.