నేను గెలిచిన సింహాన్ని.. గాయపడిన సింహాన్ని కాదు!
రీసెంట్ గా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్, ఇప్పుడు గాయపడ్డ సింహం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 9 Feb 2026 2:53 PM ISTడైరెక్టర్ గా తనదైన ముద్ర వేసుకున్న తరుణ్ భాస్కర్, ఓ వైపు డైరెక్టర్ గా విభిన్న కథలతో సినిమాలను తెరకెక్కిస్తూనే, మరోవైపు నటుడిగా కూడా ఆడియన్స్ ను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్, ఇప్పుడు గాయపడ్డ సింహం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.
ఆకట్టుకుంటున్న గాయపడ్డ సింహం టీజర్
గాయపడ్డ సింహం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండగా, ఈ ప్రెస్‌మీట్ లో తరుణ్ భాస్కర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తరుణ్ సక్సెస్ కోసం పోరాటం చేస్తున్నాడా?
టీజర్ ను బట్టి చూస్తుంటే సినిమాలో హీరోకి చిన్నప్పటి నుంచే అమెరికా వెళ్లాలనే కోరిక ఉంటుంది. ఆ కోరికను నెరవేర్చుకోవాలనే టైమ్ కు సరిగ్గా ట్రంప్ వీసాలు ఆపేయడంతో సినిమా మొత్తం వీసా కోసం చేసే పోరాటంలాగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రెస్‌మీట్ లో తరుణ్ కు ఓ జర్నలిస్ట్ నుంచి చూస్తుంటే మీరు వీసా కోసం కాదు, సక్సెస్ కోసం గాయపడ్డ సింహంలాగా పోరాడుతున్నారనిపిస్తుందని అడిగారు.
బాక్సాఫీస్ కాదు, ఆడియన్స్ మనసు ముఖ్యం
దానికి తరుణ్ ఇచ్చి సమాధానం అందరినీ ఆకర్షిస్తోంది. సక్సెస్ అనేది రిలేటబుల్ థింగ్ అని, సక్సెస్ అంటే మీరు బాక్సాఫీస్ చూస్తారు, కానీ నేను మాత్రం ఆడియన్స్ మనసు చూస్తున్నానని, అలా చూసుకుంటే నేను ఇప్పటికే గెలిచానని, ఆల్రెడీ సక్సెస్ అని కాకపోతే ఆ విషయం మీకు తెలియడం లేదని చెప్తూ దానికి ఓ ఉదాహరణను కూడా జోడించారు తరుణ్.
తాను మారేడుపల్లిలో టీ తాగేవాడినని, అలాంటి తాను ఇవాళ స్టేజ్ పై జర్నలిస్టులతో ప్రశ్నలు అడిగించుకునే స్థాయికి వచ్చానంటే అది చాలా పెద్ద సక్సెస్ అని, తాను గాయపడ్డ సింహం కాదని, తాను గెలిచిన సింహమని చెప్పడంతో అక్కడివారంతా తరుణ్ ఆన్సర్ కు ఆశ్చర్యపోగా, సదరు జర్నలిస్ట్ మాత్రం తరుణ్ స్పోర్టివ్ స్పిరిట్ ను అభినందించారు.
తరుణ్ చెప్పిన మాటలు ప్రస్తుతం యంగ్ డైరెక్టర్లు, మూవీ లవర్స్ లో స్పూర్తిగా నింపగా, సక్సెస్ ను కేవలం కలెక్షన్లతో కాకుండా, వ్యక్తిగత ఎదుగుదల, ఆడియన్స్ ప్రేమతో కొలవాలనే తరుణ్ దృక్పథాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఇక సినిమా విషయానికొస్తే టీజర్ తోనే ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా తరుణ్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
