ఓం శాంతి: తరుణ్ భాస్కర్ కు సరైన అటెన్షన్ రాలేదా?
ఈ నగరానికి ఏమైంది వంటి పలు సినిమాలతో కొత్త తరహా స్టోరీలను స్టార్ట్ చేసిన ఆయన, యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
By: M Prashanth | 2 Feb 2026 11:00 PM ISTయూత్ ను టార్గెట్ చేస్తూ, సహజమైన కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆయన పేరు వినగానే ప్రేక్షకుల్లో ఓ నమ్మకం, ఓ అంచనా ఉంటుంది. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి పలు సినిమాలతో కొత్త తరహా స్టోరీలను స్టార్ట్ చేసిన ఆయన, యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తాజాగా లీడ్ రోల్ లో నటించిన ఓం శాంతి శాంతి శాంతి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఆ చిత్రం మాత్రం ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. సినిమా విడుదలైన మొదటి రోజు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. తరుణ్ భాస్కర్ యాక్ట్ చేసినా.. దర్శకత్వం వహించినా.. కూడా సినిమాలో మినిమమ్ గ్యారంటీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందనే భావనతో థియేటర్లకు వచ్చే యూత్ ఆడియన్స్ ఈసారి పెద్దగా కనిపించలేదు.
కంటెంట్ పరంగా సినిమా పూర్తిగా నిరాశపరచకపోయినా, యావరేజ్ గా ఉందనే అభిప్రాయం సినీ ప్రియుల నుంచి ఎక్కువగా ఇప్పుడు వ్యక్తమవుతోంది. దీంతో మౌత్ పబ్లిసిటీ కూడా ఆశించిన స్థాయిలో కలిసిరాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక టైమింగ్ కూడా సినిమాకు పెద్దగా సహకరించలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల వరుస సెలవులు ముగిసి, ప్రజలు మళ్లీ తమ పనుల్లో నిమగ్నమయ్యారని చెప్పాలి.
ఆఫీసులు, కాలేజీలు తిరిగి ప్రారంభం కావడం వంటి కారణాలు బాక్సాఫీస్ పై ప్రభావం చూపినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ సినిమాలకు ప్రధాన బలం అయిన యువత ఈ సమయంలో పరీక్షలతో బిజీగా ఉండటంతో థియేటర్లకు వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. అలా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, ఆ క్రేజ్ టికెట్ సేల్స్ గా మారలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
థియేట్రికల్ రిలీజ్ కు ముందు మూవీ ప్రమోషన్స్ కూడా పెద్ద స్థాయిలో జరగకపోవడం మరో మైనస్ గా మారింది. పెద్ద హీరోల సినిమాల మాదిరిగా హైప్ లేకపోవడంతో సాధారణ ప్రేక్షకుల దృష్టిని సినిమా పూర్తిగా ఆకర్షించలేకపోయింది. మొత్తంగా చూస్తే, ఓం శాంతి శాంతి శాంతి హి సినిమా కంటే తరుణ్ భాస్కర్ బ్రాండ్ పై ఉన్న అంచనాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి.
అయితే సరైన రిలీజ్ టైమింగ్, స్ట్రాంగ్ ప్రమోషన్స్ ఉంటే సినిమా ఫలితం వేరుగా ఉండేదనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కానీ కంటెంట్ బాగుంటే ఆలస్యమైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం మాత్రం ఇంకా ఉంది. ఇప్పటికైనా వీకెండ్ కలెక్షన్లు పెరిగి సినిమా పుంజుకుంటుందేమో చూడాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తరుణ్ భాస్కర్ కు రావాల్సిన అటెన్షన్ మాత్రం ఓం శాంతి శాంతి శాంతి మూవీకి దక్కలేదనేది స్పష్టంగా కనిపిస్తోంది.
