Begin typing your search above and press return to search.

భయం భయంగా ఈ నగరానికి ఏమైంది 2.. ఎందుకలా తరుణ్ భాస్కర్ ..?

అందుకే ఈ నగరానికి ఏమైంది సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సినిమాకి ఉన్న క్రేజ్ తోనే ఈ నగరానికి ఏమైంది రీ రిలీజ్ కూడా చేశారు.

By:  Ramesh Boddu   |   12 Nov 2025 12:17 PM IST
భయం భయంగా ఈ నగరానికి ఏమైంది 2.. ఎందుకలా తరుణ్ భాస్కర్ ..?
X

తీసిన 3 సినిమాలతోనే డైరెక్టర్ గా ఒక మార్క్ వేసుకున్నాడు తరుణ్ భాస్కర్. 2016లో పెళ్లి చూపులు సినిమా వచ్చి ట్రెమండస్ హిట్ అందుకోగా ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2018లో ఈ నగరానికి ఏమైంది వచ్చింది. ఆ సినిమాను తెలుగు యూత్ ఆడియన్స్ అంతా ఓన్ చేసుకున్నారు. పెళ్లి చూపులు అయినా అక్కడక్కడ సినిమాలా అనిపిస్తుంది కానీ ఈ నగరానికి ఏమైంది అలా ఉండదు. కంప్లీట్ గా లైవ్లీగా ఆడియన్ తనకు తానుగా అందులో ఉండే పాత్రలతో ఎంగేజ్ అయ్యేలా చేశాడు తరుణ్ భాస్కర్.

ఆ సినిమాకి ఉన్న క్రేజ్..

అందుకే ఈ నగరానికి ఏమైంది సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సినిమాకి ఉన్న క్రేజ్ తోనే ఈ నగరానికి ఏమైంది రీ రిలీజ్ కూడా చేశారు. ఇక నెక్స్ట్ తరుణ్ భాస్కర్ కీడా కోలా అనే సినిమా చేశారు. అందులో ఆయన కూడా నటించారు. కీడా కోలా కూడా ప్రేక్షకులను నవ్విస్తుంది కానీ తరుణ్ భాస్కర్ ఇదివరకు సినిమాల మాదిరి మెప్పించలేదు.

ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ చేయమని తరుణ్ భాస్కర్ ని యూత్ ఆడియన్స్ అంతా కోరారు. దాని కోసమే అతను ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ చేస్తున్నాడు. ఈ.ఎన్.ఈ 2 సినిమా ఈమధ్యనే సెట్స్ మీదకు తీసుకెళ్లాడు తరుణ్ భాస్కర్. ఐతే ఈ సీక్వెల్ గురించి తాను కాస్త భయపడుతున్నట్టు చెప్పారు తరుణ్ భాస్కర్. ఎందుకంటే ఈ నగరానికి ఎమైంది సినిమా ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. సినిమాలో ప్రతి డైలాగ్ వాళ్లు ప్రాంప్ట్ ఇస్తున్నారు.

సినిమాను ఆడియన్స్ అంతగా ఓన్ చేసుకుని..

రీసెంట్ గా చిక్కడపల్లిలో ఈ నగరానికి ఏమైంది రీ రిలీజ్ అయితే అక్కడ సినిమా ఆగిపోతే ఒక వ్యక్తి లాప్ టాప్ లో సినిమా చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్లంతా డైలాగ్స్ చెబుతున్నారు. ఈ సినిమాను ఆడియన్స్ అంతగా ఓన్ చేసుకున్నారు. ఐతే ఈ నగరానికి ఏమైంది కి ఉన్న క్రేజ్ కి సీక్వెల్ చేయమని అడ్వాన్స్ లు వస్తాయి.. కానీ అలా చేస్తే వర్క్ అవుట్ కాదు. అందుకే ఒక పాయింట్ వచ్చింది.. దాన్ని సీక్వెల్ గా చేస్తున్నా అన్నారు తరుణ్ భాస్కర్.

ఐతే సినిమా సెట్స్ మీద ఉంది అయినా కూడా ఇప్పటికీ కాస్త భయంగానే ఉందని అన్నారు తరుణ్ భాస్కర్. ఇక సినిమాలో యాక్టర్స్ కూడా సినిమాల్లోనే చూసి సర్ ప్రైజ్ అవుతారని అన్నాడు తరుణ్ భాస్కర్. మొత్తానికి ఈ.ఎన్.ఈ 2 తరుణ్ భాస్కర్ ని టెన్షన్ లో పడేసింది.

E.N.E 2 మరో సెన్సేషనల్ మూవీగా..

ఈ సీక్వెల్ పై ఉన్న క్రేజ్ కి ఏమాత్రం అంచనాలకు తగినట్టుగా సినిమా ఉన్నా కచ్చితంగా ఈ.ఎన్.ఈ 2 మరో సెన్సేషనల్ మూవీగా మారుతుంది. ఐతే ఆడియన్స్ అంచనాలకు తగ్గకుండానే తన అసిస్టెంట్ డైరెక్టర్స్ తో ప్రతి విషయాన్ని డిస్కస్ చేసి మరీ సినిమా చేస్తున్నా అని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తరుణ్ భాస్కర్.

ఈమధ్య యాక్టర్ గా మారిన తరుణ్ డైరెక్షన్ తన మొదటి ఆప్షన్ అని అంటున్నారు. ఐతే యాక్టర్ గా ప్రస్తుతం ఓం శాంతి శాంతి శాంతిహి సినిమా చేస్తున్నారు.