Begin typing your search above and press return to search.

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ సోషల్ మీడియా ట్రోల్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెగిటివ్ కామెంట్లు, రివ్యూలు చేసేవారు ప్రేక్షకుల్లో కేవలం 1 శాతం మాత్రమేనని, మిగిలిన 99 శాతం మంది వాటిని పట్టించుకోకుండా సినిమాలు చూస్తారని అన్నారు. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని, ట్రోల్స్ గురించి ఆలోచించకుండా మంచి సినిమాలు తీయాలని మేకర్స్‌కు సూచించారు. ప్రస్తుతం ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

By:  Ramesh Palla   |   10 Nov 2026 7:00 PM IST
వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!
X

గత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'క్రేజీ కళ్యాణం' సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించిన తరుణ్‌ భాస్కర్‌ ఆకట్టుకున్నాడు. మరోసారి తరుణ్‌ భాస్కర్‌ దర్శకుడిగా కంటే నటుడిగా బెస్ట్‌ అని నిరూపించుకున్నాడంటూ రివ్యూలు వచ్చాయి. మరికొందరు దర్శకత్వం చేసుకోక ఈ వేశాలు ఏంటో అంటూ తరుణ్‌ భాస్కర్‌ ను విమర్శించారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా తరుణ్‌ భాస్కర్‌ పై ఏదో ఒక నెగిటివిటీ ప్రచారం జరుగుతూనే ఉంటుంది. సోషల్‌ మీడియాలో తనపై వచ్చే నెగిటివ్‌ కామెంట్స్ కు పెద్దగా స్పందించని తరుణ్‌ భాస్కర్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సోషల్‌ మీడియా ట్రోల్స్ గురించి స్పందించాడు. అసలు సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోల్స్‌, సినిమాల గురించి వచ్చే రివ్యూలు, ఇతర కామెంట్స్ ను పట్టించు కోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేశాడు.

సోషల్‌ మీడియాలో నెగిటివ్‌ రివ్యూలు...

సోషల్‌ మీడియాలో సినిమాలకు ఇచ్చే రివ్యూలు, కొందరు చేసే కామెంట్స్‌, సినిమాల గురించి కొందరు చేసే మీమ్స్ గురించి తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సదరు ఇంటర్వ్యూలో తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ... నిజమైన ప్రేక్షకులు థియేటర్లలో ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ నెగిటివిటీని వ్యాప్తి చేసే వారు ప్రతి చిన్న విషయాన్ని ట్రోల్‌ చేసే వారు, రివ్యూలు ఇచ్చే వారు కేవలం 1% మాత్రమే. వారి వల్ల సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మిగిలిన 99% మంది సోషల్‌ మీడియాలో ఉంటారు కానీ వారు ఎలాంటి కామెంట్స్ చేయరు, ఏం రివ్యూలు చెప్పరు. ఒక వేళ కామెంట్స్ రివ్యూలు చూసినా వారు పట్టించుకోకుండా సినిమాను చూస్తారు. సినిమాను చూసే ఆ 99% మంది ఉన్నప్పుడు ఆ 1% శాతం కామెంట్స్ చేస్తూ నెగిటివిటీని ప్రచారం చేసే వారితో ఇబ్బంది ఏముందని తరుణ్‌ భాస్కర్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

తరుణ్‌ భాస్కర్‌ సినిమాలతో...

సినిమా నిర్మాణం, మేకింగ్‌ అనేది ఒక క్రియేటివ్‌ వర్క్‌. సినిమా పూర్తి అయ్యాక మేకర్స్ కి వచ్చే సంతృప్తి ముఖ్యం. దాన్ని సోషల్‌ మీడియాలో జరిగే చర్చల వల్ల నాశనం చేసుకోవద్దని కూడా తరుణ్‌ భాస్కర్‌ అన్నాడు. జనాలు థియేటర్లకు వెళ్లి సినిమాను చూస్తారు, ఆ చూసిన వారు నచ్చితే మరికొందరికి చెప్తారు. అప్పుడు ప్రేక్షకులు ఎక్కువ మంది థియేటర్‌ కి వెళ్తాడు. అంతే తప్ప సోషల్‌ మీడియాలో వచ్చిన టాక్‌ ను బట్టి, సోషల్‌ మీడియాలో వచ్చిన నెగిటివిటీని బట్టి సినిమాను చూడటం, చూడకుండా ఉండటం జరగదు అని దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ పేర్కొన్నాడు. సోషల్‌ మీడియాలో వచ్చే రివ్యూల వల్ల సినిమాలు నాశనం అవుతున్నాయని అదే ఇండస్ట్రీకి చెందిన కొందరు ఫిల్మ్‌ స్టార్స్‌, ఫిల్మ్‌ మేకర్స్ అంటూ ఉంటారు. అది ఏమాత్రం నిజం కాదని తరుణ్‌ భాస్కర్‌ చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ నగరానికి ఏమైంది కి సీక్వెల్‌ రిలీజ్‌...

ఆన్‌లైన్‌లో హడావిడి చేసే వారి గురించి పట్టించు కోవాల్సిన అవసరం లేదు. అసలు అలాంటి వారితో సినిమాకు ఎలాంటి నష్టం లేదు. సినిమా బాగుంటే వారు ఏం చేసినా ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లకుండా ఆగరు, సినిమా బాగా లేకుంటే ఎంత పాజిటివ్‌ రివ్యూలు ఇచ్చినా థియేటర్లకు జనాలు వెళ్లరు. ఈ విషయం చాలా సార్లు నిరూపితం అయ్యింది. కనుక రివ్యూవర్స్ గురించి, సోషల్‌ మీడియాలో ఆ 1% జనాల గురించి ఆలోచించకుండా మంచి సినిమాలను తీయాలంటూ ఫిల్మ్‌ మేకర్స్ కి తరుణ్‌ భాస్కర్‌ సూచించాడు. నటుడిగా వరుస సినిమాలు చేస్తూ దర్శకుడిగా ఈ నగరానికి ఏమైంది కి సీక్వెల్‌ రూపొందించాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమా ప్రమోషన్‌ లోనూ తరుణ్‌ బిజీ బిజీగా ఉన్నాడు. నటుడిగా ప్రస్తుతం తరుణ్‌ భాస్కర్‌ చేతిలో డజను సినిమాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. మరో వైపు ఈయన వ్యక్తిగత జీవితంలో కీలకమైన పెళ్లి మెట్టు ఎక్కేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.