Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. భయపడ్డా కూడా టాస్క్ విన్ అయిన తనూజా..!

ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో ఆరెంజ్ టీం అయిన తనూజ ఆ టీం లో ఉంటూ తనకు వచ్చిన ఒక టాస్క్ ని సక్సెస్ ఫుల్ గా చేసింది.

By:  Ramesh Boddu   |   6 Nov 2025 10:32 AM IST
బిగ్ బాస్ 9.. భయపడ్డా కూడా టాస్క్ విన్ అయిన తనూజా..!
X

బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ సూపర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హవా కొనసాగిస్తుంది. సీరియల్ హీరోయిన్ గానే కాదు హౌస్ లో ఆమె తనలా ఉంటూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. అఫ్కోర్స్ లాస్ట్ వీక్ రేషన్ మేనేజర్ గా ఆమె చేసిన అతికి హౌస్ మెట్స్ మాత్రమే కాదు నాగార్జున నుంచి కూడా అక్షింతలు పడ్డాయి. ఐతే టాస్క్ ల విషయంలో గెలుపు ఓటములు లేకుండా తనూజ ది బెస్ట్ ఇస్తుంది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో ఆరెంజ్ టీం అయిన తనూజ ఆ టీం లో ఉంటూ తనకు వచ్చిన ఒక టాస్క్ ని సక్సెస్ ఫుల్ గా చేసింది.

రెండో టాస్క్ కోసం తనూజ..

ఓ పక్క రెబల్స్ ఎవరు కనిపెట్టే ప్రాసెస్ చేస్తూనే.. మరోపక్క ప్రతి టీం రెబల్స్ తమని కంటెండర్ రేసు నుంచి తీసేయకుండా ఉండేలా టాస్క్ లు పెడుతున్నాడు బిగ్ బాస్. లాస్ట్ టాస్క్ లో ఆరెంజ్ టీం గెలిచింది. టీం అంతా మాట్లాడి ఇమ్మాన్యుయెల్ కి గ్రీన్ కార్డ్ ఇచ్చారు. సో ఇమ్మాన్యుయెల్ కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచాడు. ఇక ఆరెంజ్ టీం లో రెండో టాస్క్ కోసం తనూజ పాల్గొన్నది. యాక్టివిటీ ఏరియాలో చీకటిగా చేసి కొన్ని ఐటేంస్ పెడతారు. దాన్ని స్మెల్ చేసి వాటిని కనిపెట్టాల్సి ఉంటుంది.

ఐతే సీజన్ 4లో చీకటి గదిలో ఎలా అయితే డెవిల్స్ ని ఉంచారో అలానే ఈ టాస్క్ లో యాక్టివిటీ ఏరియాలో నలుగురు దెయ్యాల వేషాలతో ఉన్నారు. అందులోకి వెళ్లగానే తనూజ చాలా భయపడింది. రోప్ సహాయంతో ఐదు ఐటెంస్ లో నాలుగు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పింది. ఇక నెక్స్ట్ బ్లూ టీం నుంచి రీతు చౌదరి మూడు ఐటేంస్ కనిపెట్టి చెప్పింది. పింక్ టీం నుంచి దివ్య వెళ్లి మూడు కరెక్ట్ చెప్పింది. ఫైనల్ గా నాలుగు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పి తనూజ ఆరెంజ్ టీం ని ఈ టాస్క్ గెలిపించింది.

తనూజ కాస్త కంగారు పడినట్టు..

ఐతే యాక్టివిటీ ఏరియాలో తనూజ చాలా భయపడింది.. అంతేకాదు బయటకు వచ్చి సంజనాని హగ్ చేసుకుని బాగా ఏడ్చింది. ఈ ఎక్స్ పీరియన్స్ వల్ల తనూజ కాస్త కంగారు పడినట్టు అనిపించింది. అయినా కూడా టాస్క్ గెలిచింది. ఐతే ఈ టాస్క్ గెలిపించినందుకు ఆరెంజ్ టీం తనూజకే ఆ గ్రీన్ కార్డ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో తనూజ కూడా మరోసారి ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ అవుతుంది. మిగతా టీం లు ఎవరు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు.. ఇమ్మాన్యుయెల్, తనూజతో ఎవరు కంటెండర్ రేసులో ఉంటారు అన్నది చూడాలి.