బిగ్ బాస్ 9.. కెప్టెన్ తనూజ హౌస్ మేట్స్ మనసు గెలిచే ప్లాన్..!
బిగ్ బాస్ సీజన్ 9లో ఫైనల్ గా 10వ వారం తనూజ కెప్టెన్ అయ్యింది. ఈ సీజన్ లో కెప్టెన్ అయ్యేందుకు ఆమె దాదాపు ఐదు వారాల నుంచి ప్రయత్నిస్తుంది.
By: Ramesh Boddu | 15 Nov 2025 9:53 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో ఫైనల్ గా 10వ వారం తనూజ కెప్టెన్ అయ్యింది. ఈ సీజన్ లో కెప్టెన్ అయ్యేందుకు ఆమె దాదాపు ఐదు వారాల నుంచి ప్రయత్నిస్తుంది. ప్రతిసారి చివరి దాకా వచ్చి ఓడిపోతుంది. ఐతే 10వ వారం ఆమె కెప్టెన్ అవ్వాలని ప్రయత్నించి ఈసారి ఓడిపోకుండా సక్సెస్ అయ్యింది. బీబీ రాజ్యంలో రాజుగా నిఖిల్ రాణులుగా తనూజ, రీతు ఉండగా వారి ముగ్గురికి వారి కటౌట్ మీద ఉన్న క్రౌన్ పడిపోకుండా కత్తులతో పట్టుకోవాలి. అలా ముందు రీతు నెక్స్ట్ సంజన ఒక బాల్ కత్తికి ట్యాగ్ చేయడంతో నెక్స్ట్ నిఖిల్ కూడా క్రోన్ పడేశాడు. ఫైనల్ గా తనూజ కెప్టెన్ గా గెలిచింది.
కెప్టెన్ గా మిమ్మల్ని ఆనందంగా ఉంచుతానని..
తనూజ కెప్టెన్ అవ్వగానే భరణి ఎత్తుకుని మరీ ఆమెను అభినందించాడు. ఇక మిగతా హౌస్ మేట్స్ అంతా కూడా తను కెప్టెన్ అయినందుకు సంతోషించారు. ఐతే ప్రతిసారి కెప్టెన్సీ టాస్క్ అనంతరం తనూజ ఏడుస్తుంది కానీ ఈసారి తనే కెప్టెన్ అయింది కాబట్టి ఏడుపు లేదని అన్నాడు ఇమ్మాన్యుయెల్. ఐతే కెప్టెన్ గా మిమ్మల్ని ఆనందంగా ఉంచుతానని ఎలాంటి ఇబ్బంది పెట్టనని అన్నది తనూజ. ముఖ్యంగా తను రేషన్ మేనేజర్ గా ఉన్న టైం లో చేసిన మిస్టేక్స్ మళ్లీ గుర్తు చేసుకుని తను అలా చేయనని చెప్పింది.
తనూజ కెప్టెన్ అయ్యాక తను ఎంత ఆనందపడిందో ఆమె సపోర్టర్ భరణి కూడా అంతే ఆనందపడ్డాడు. ఆమెతో అదే విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఇక తనూజ భరణితో తన ఇంట్లో వాళ్లు బిగ్ బాస్ హౌస్ లో రెండు, మూడు వారాల కంటే ఎక్కువ ఉండలేనని అన్నారు. 10వ వారం నెక్స్ట్ ఫ్యామిలీ వీక్ వస్తుంది. ఈ టైంలో కెప్టెన్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని తనూజ ఎమోషనల్ అయ్యింది.
ఐదో వారం నుంచి కెప్టెన్సీ రేసులో చివరి దాకా..
తనూజ కెప్టెన్సీ ఈ సీజన్ లో ఒక పెద్ద సీన్ గా మారింది. ఆమె దాదాపు ఐదో వారం నుంచి కెప్టెన్సీ రేసులో చివరి దాకా వచ్చి ఓడిపోయింది. అందుకే ఆమె కెప్టెన్ అవ్వడం అటు హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ ని ఖుషి చేసింది. తనూజ కెప్టెన్సీ వల్ల హౌస్ లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా తను ఇచ్చిన మాట మీద నిలబెడితే సరిపోతుంది. ఇక ఈ సీజన్ విన్నర్ రేసులో తనూజ దూసుకెళ్తుంది.
ఆమె ఇప్పటికే టాప్ ప్లేస్ లో ఉంది. ఈ విజయంతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. హౌస్ లో ఉన్న నిఖిల్, గౌరవ్ లే తనూజ మెంటల్, ఫిజికల్ అన్నిటిలో స్ట్రాంగ్ అని ఒప్పుకున్నారు. తనూజతో పాటు ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్ కూడా టైటిల్ రేసులో ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ లో లాస్ట్ వీక్ కెప్టెన్ ఇమ్మాన్యుయెల్ తప్ప అందరు హౌస్ మేట్స్ ఉన్నారు. వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి.
