Begin typing your search above and press return to search.

రష్మికకు పోటీగా నోరా ఫతేహి.. బీట్ చేయగలదా?

తాజాగా నోరా ఫతేహి థామా మూవీలో 'దిల్బార్ కి ఆంఖోన్ కా" అనే స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు ప్రకటించింది.అంతేకాదు ఈరోజు మధ్యాహ్నం థామ మూవీ నుండి నోరా ఫతేహి చేస్తున్న పాట కూడా రిలీజ్ అయింది.

By:  Madhu Reddy   |   7 Oct 2025 4:02 PM IST
రష్మికకు పోటీగా నోరా ఫతేహి.. బీట్ చేయగలదా?
X

ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్నా కాంబోలో వస్తున్న బాలీవుడ్ తాజా మూవీ థామా..ఈ సినిమా అక్టోబర్ 21న విడుదలకు సిద్ధంగా ఉండడంతో రీసెంట్ గా మడాక్ ఫిలిమ్స్ ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసింది. అయితే ఈ ట్రైలర్లో రష్మిక కంటే ఎక్కువ హైలైట్ అయింది మరో నటి. ఆమె ఎవరో కాదు నోరా ఫతేహి.. థామా ట్రైలర్ లో నోరా ఫతేహి గెస్ట్ రోల్ చేస్తున్నట్టు ట్రైలర్ చూసిన చాలామంది నెటిజన్స్ భావించారు. కానీ సడన్గా ఈ సినిమాలో గెస్ట్ రోల్ కాదు ఏకంగా ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా బయటపడింది.

తాజాగా నోరా ఫతేహి థామా మూవీలో 'దిల్బార్ కి ఆంఖోన్ కా" అనే స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు ప్రకటించింది.అంతేకాదు ఈరోజు మధ్యాహ్నం థామ మూవీ నుండి నోరా ఫతేహి చేస్తున్న పాట కూడా రిలీజ్ అయింది. అయితే నోరా ఫతేహి చేసిన దిల్బార్ కి ఆంఖోన్ కా పాటని తాజాగా తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్స్ నోరా ఫతేహి అందాలకు నోరెళ్ళ బెడుతున్నారు. అంతేకాదు థామా సినిమాలో రష్మిక మందన్నా కంటే నోరా ఫతేహి తన అందంతో మెస్మరైజ్ చేస్తుందని, ఖచ్చితంగా రష్మికని పక్కకు నెట్టి నోరా ఫతేహి క్రేజ్ సంపాదిస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆమె అందానికి మంత్ర ముగ్ధులైనటువంటి నెటిజన్స్. మరి చూడాలి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్లో చేసిన నోరా ఫతేహి మెయిన్ హీరోయిన్ గా చేసిన రష్మిక కంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటుందా అనేది..

నోరా ఫతేహి థామా మూవీలో దిల్బార్ కి ఆంఖోన్ కా పాట గురించి మాట్లాడుతూ.. "బాలీవుడ్ లో గత కొద్ది రోజులుగా నా నుండి స్పెషల్ సాంగ్స్ రావడం లేదు.నేను చేసిన స్త్రీ -1మూవీలో కమారియా పాట నా జీవితాన్ని మార్చేసింది. అలాగే కమారియా, దిల్బర్ రెండు పాటలు కూడా ఒకేసారి షూటింగ్ జరుపుకున్నాయి. ఈ రెండు ఒకే నెలలో విడుదలయ్యాయి. అలా ఈ రెండు పాటల ద్వారా నేను బీటౌన్ లో ఫేమస్ అయ్యాను. తాజాగా నేను చేసిన థామా సినిమాలోని దిల్బార్ కి ఆంఖోన్ కా అనే పాట కూడా నాకు మరింత గుర్తింపుని తెస్తుంది.చాలా రోజుల నుండి నా అభిమానులు ఇలాంటి స్పెషల్ సాంగ్స్ లో నన్ను మిస్ అయ్యారు. కానీ థామా లోని స్పెషల్ సాంగ్ తో మళ్లీ ఆ వైబ్ ని తీసుకురాబోతున్నాను. ఇందులో మంచి హుక్ స్టెప్ ఉంది.మీరందరూ ఇష్టపడే నోరా ఫతేహి మళ్ళీ తిరిగి రాబోతుంది" అంటూ థామా సినిమాలోని స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడింది.అలా తాజాగా విడుదలైన ఈ సాంగ్ తో నిజంగానే మునపటి నోరా ఫతేహిని చూస్తున్నామని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

థామా సినిమా విషయానికి వస్తే..ఆదిత్య సర్పోత్దార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హార్రర్ మూవీ థామా.. మాడాక్ హార్రర్ కామెడీ యూనివర్స్ లో ఐదో భాగంగా ఈ సినిమా రాబోతోంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా ,రష్మిక మందన్నాలు ప్రధాన పాత్రలో నటించగా.. నవాజుద్దీన్ సిద్ధికీ, రామ్ బజాజ్ గోయల్, పరేష్ రావల్,పైసల్ మాలిక్, సంజయ్ దత్, గీత అగర్వాల్ కీ రోల్స్ పోషించారు.