మరో 800 కోట్లు కొల్లగొట్టాలనా? పెద్ద ప్లానింగే!
అయితే బాలీవుడ్ టైటిల్స్ విషయంలో న్యూమరాలజీలను బేస్ చేసుకుం టుందని తాజాగా ఓ సినిమా విషయంలో ప్రచారం జరుగుతోంది.
By: Srikanth Kontham | 25 Sept 2025 6:00 PM ISTతెలుగు సినిమా టైటిల్స్ మారడం అన్నది చాలా అరుదు. ఒకసారి ఫిక్సైన తర్వాత టైటిల్ మార్చాల్సి వస్తే? అది వివాదాస్పదమైతే తప్ప మార్చే ప్రశక్తే ఉండదు. కేవలం కథ ఆధారంగానే టైటిల్స్ నిర్ణయిస్తుంటారు. క్యాచీగా ఉండే టైటిల్స్ విషయంలో ఎంత మాత్రం దర్శక, నిర్మాతలు రాజీ పడరు. వివాదం తలెత్తినా? టైటిల్ ఛేంజ్ విషయంలో వీలైనంత వరకూ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ న్యూమరాలజీల ఆధారంగా టైటిల్స్ పెట్టరు. ఆరకంగా మార్చే పరిస్థితి కనిపించదు. అయితే బాలీవుడ్ టైటిల్స్ విషయంలో న్యూమరాలజీలను బేస్ చేసుకుం టుందని తాజాగా ఓ సినిమా విషయంలో ప్రచారం జరుగుతోంది.
ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా, నవాజుద్దీన్ సిద్దీఖీ, పరేష్ రావల్ ప్రధాన పాత్రలో `తామా` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆదిత్య సర్పోదర్ తెరకెక్కిస్తుండగా మడూక్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తి చేసుకుని దీపావళి కానుకగా చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ మారింది. `తామ`కు బధులుగా `తామ్మా` గా మార్చారు. ఇంగ్లీష్ లో ఇదే టైటిల్ అదనంగా మరో `ఎమ్` చేరుతుంది. టైటిల్ ఇలా మార్చడంతో న్యూమరాలజీ ప్రకారం మార్చినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
శ్రద్దా కపూర్ పేరుతో ఈ చిత్రం ముడి పడి ఉందని... ఆ నమ్మకంతోనే సెంటిమెంట్ గా మార్చారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ట్యాగ్ లైన్ `ఓ స్త్రీ... కల్ నహీ, పర్సో ఆ రహీ హై` కు స్త్రీ2కి సంబంధం ఉన్నట్లు మేకర్స్ భావించి టైటిల్ లో అదనంగా `ఎమ్` చేర్చినట్లు వార్తలొస్తున్నాయ. ఇదీ హారర్ కామెడీ జానర్ కావడంతో? స్త్రీ2 తరహాలో బ్లాక్ బస్టర్ అవుతుందని ఈ ఛేంజెస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. శ్రద్దా కపూర్ నటించిన `స్త్రీ 2`ఊ హించని విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఓ మోస్తారు అంచనాలతో రిలీజ్ అయిన `స్త్రీ 2` ఏకంగా 800 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. మడూక్ బ్యానర్ లోనే లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో ఓ సంచలనంగా మారింది. అదే సక్సెస్ ని మళ్లీ `తామ్మా` రిపీట్ చేయాలి? అన్న ఆలోచనతో ఇలా న్యూమరాలజీ బాట పట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మరి దీని వెనుక అసలు కథ ఏంటి? అన్నది తెలియాలి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో `తామ్మా` పై అంచనాలు భారీగా ఏర్పడుతోన్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి రష్మికా మందన్నా సినిమాలో భాగమవ్వడంతో? అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
