Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ వర్క్ గురించి థమన్ షాకింగ్ స్టేట్మెంట్..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల ఫలితాలు కొన్ని డిజప్పాయింట్ చేసినా మరికొన్ని మాత్రం అదరగొట్టేస్తాయి.

By:  Ramesh Boddu   |   29 Sept 2025 11:52 AM IST
త్రివిక్రమ్ వర్క్ గురించి థమన్ షాకింగ్ స్టేట్మెంట్..!
X

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల ఫలితాలు కొన్ని డిజప్పాయింట్ చేసినా మరికొన్ని మాత్రం అదరగొట్టేస్తాయి. ఐతే మామూలుగా ఒక ఫ్లాప్ పడిన వెంటనే ఏ డైరెక్టర్ అయిన తక్కువలో తక్కువ ఆరు నెలలు గ్యాప్ తీసుకుంటాడు. కానీ త్రివిక్రమ్ జస్ట్ నెల తర్వాత ఒక సినిమా కథ రాయడం ఆ నెక్స్ట్ మంత్ పట్టాలెక్కించడం ఆరు నెలల్లో రిలీజ్ చేయడం చేశారు. ఈ విషయాన్నే లేటెస్ట్ గా థమన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమా చేశారు త్రివిక్రమ్. ఆ సినిమా రిజల్ట్ డిజప్పాయింట్ చేసినా కూడా త్రివిక్రమ్ వెంటనే ఫిబ్రవరిలో మరో కథ రాసేశారు.

త్రివిక్రమ్ సూపర్ కంబ్యాక్..

ఏప్రిల్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. అక్టోబర్ లో సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టారని థమన్ చెప్పాడు. ఆ సినిమా అరవింద సమేత వీర రాఘవ. అజ్ఞాతవాసి తర్వాత ఆరు నెలల్లోత్రివిక్రమ్ సూపర్ కంబ్యాక్ ఇచ్చిన సినిమా అది.త్రివిక్రమ్ కూడా రాయలసీమ ఫ్యాక్షన్ కథ చేయగలడు అని ప్రూవ్ చేసిన సినిమా అది. ఆ సినిమా మ్యూజిక్ కూడా థమన్ అద్బుతంగా ఇచ్చాడు.

ఇదే ఇంటర్వ్యూలో మనల్ని మనం తగ్గించుకోవద్దు. నెలలో కథ రాసి వెంటనే షూటింగ్ మొదలు పెట్టి సినిమా హిట్ కొట్టారు త్రివిక్రమ్.త్రివిక్రమ్ తో పనిచేసిన తర్వాతే థమన్ కొత్త వెర్షన్ మొదలు పెట్టాడని చెప్పొచ్చు. అరవింద సమేత, అజ్ఞాతవాసి, గుంటూరు కారం ఇలా గురూజీ ప్రతి సినిమాకు మ్యూజిక్ విషయంలో థమన్ ది బెస్ట్ ఇస్తూనే వస్తున్నాడు.

ఓజీ పర్సనల్ గా థమన్..

రీసెంట్ గా థమన్ ఓజీ సినిమాకు నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఓజీ సినిమాను చాలా పర్సనల్ గా తీసుకుని థమన్ మ్యూజిక్ అందించాడు. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ రీల్ వరకు కూడా దుమ్ము దులిపేశాడు. నెక్స్ట్ అఖండ 2 తో కూడా అదరగొట్టేస్తా అంటున్నాడు థమన్. త్రివిక్రమ్ శ్రీనివాస్ థమన్ ఈ కాంబో మరికొన్నాళ్లు వర్క్ అవుట్ అయ్యేలా ఉంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్ తో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా మ్యూజిక్ విషయంలో కూడా త్రివిక్రమ్ తన మార్క్ చూపించాలని చూస్తున్నారు. ఇక థమన్ కూడా అఖండ 2, రాజా సాబ్ సినిమాల్లో సాంగ్స్ ప్లస్ బిజిఎం తో మరోసారి తన మ్యూజిక్ బ్లాస్ట్ ప్లాన్ చేస్తున్నాడు. వేరే డైరెక్టర్ తో థమన్ వర్క్ ఎలా ఉన్నా త్రివిక్రమ్ సినిమా ఐతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంటుంది. దానికి రీజన్ అంటూ ఏం లేదు త్రివిక్రమ్ థమన్ అలా పర్ఫెక్ట్ ట్యూన్ అయ్యారన్నమాట.