ఓజీ 'త్రిగణన దూత'.. తమన్ రిప్లై చూశారా?
దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన విడుదలైన ఓజీ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ వర్క్ చేసిన సంగతి విదితమే.
By: M Prashanth | 8 Oct 2025 5:52 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ (They Call Him OG) మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ లో పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఆ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి గ్రాండ్ గా నిర్మించారు.
దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన విడుదలైన ఓజీ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ వర్క్ చేసిన సంగతి విదితమే. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మూవీలోని అనేక సన్నివేశాలను ఆయన వర్క్ నిలబెట్టిందని చెప్పాలి. సాంగ్స్ కూడా అందరినీ ఆకట్టుకుని సందడి చేశాయి.
తద్వారా తమన్.. సినిమాకు మెయిన్ పిల్లర్స్ లో ఒకరు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. పవర్ స్టార్ కు ఆయన ఇచ్చిన ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని అనేక మంది సినీ ప్రియులు కొనియాడారు. సుజీత్ టేకింగ్ కు తమన్ ప్రాణం పోశారని తెలిపారు. అయితే పవర్ స్టార్ కనిపించిన ప్రతీసారి బ్యాక్ గ్రౌండ్ లో "నెత్తురు మరిగిన హంగ్రి చీత" అనే థీమ్ సాంగ్ వచ్చింది.
అది థియేటర్లు దద్దరిల్లి పోయేలా చేసింది. అయితే ఆ సాంగ్ లో పదం మాత్రం సోషల్ మీడియాను కొద్ది రోజులుగా ఊపేస్తోంది. అదే త్రిగణన దూత. అసలు ఆ పదం తెలుగులో ఉందా.. దాని అర్థమేంటని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఇంకొందరు అయితే ఆ పదాన్ని పట్టుకుని తమన్ ను కొద్ది రోజులుగా ట్రోల్ చేస్తున్నారు.
ఇప్పుడు తమన్.. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో స్పందించారు. త్రిగణన దూత అదేనా.. నన్ను ఇలా మార్చేశారు గా అంటూ చెబుతున్న వీడియోను పోస్ట్ చేశారు. తనపై కొద్ది రోజులుగా వస్తున్న ట్రోల్స్ కు ఆయన అలా రెస్పాండ్ అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం తమన్ త్రిగణన దూత అంటూ చెబుతూ పోస్ట్ చేసిన వీడియో.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
