తమన్.. ఇలాంటి కామెంట్స్ అవసరమా?
టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తమన్ మరోసారి తన కామెంట్స్ తో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 25 Feb 2026 12:10 PM ISTటాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తమన్ మరోసారి తన కామెంట్స్ తో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తన మ్యూజిక్ పాటు స్టేజ్ పై సరదా పంచ్ లతో అలరించడం తమన్ కు కొత్తేం కాదు. అయితే తాజాగా ఆయన ఓ ఈవెంట్ లో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
యంగ్ క్యాస్టింగ్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న బ్యాండ్ మేళం సినిమా టీజర్ లాంచ్ వేడుక రీసెంట్ గా గ్రాండ్ గా జరిగింది. ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా తమన్ హాజరయ్యారు. మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడిన ఆయన, హీరో హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. స్టేజ్ పై మాట్లాడుతూ, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండంటూ నవ్వుతూ చెప్పారు.
అయితే సాధారణంగా హీరో హీరోయిన్ల మధ్య ఉండేది కెమిస్ట్రీ అని అనడం కామన్ అయినా, ఫిజిక్స్ ను యూడ్ చేసి తమన్ వ్యాఖ్యలు చేయడం ఆడియన్స్ కు కొత్తగా అనిపించింది. వెంటనే తాను 5వ తరగతి ఫెయిల్, నాకు జువాలజీ రాదంటూ తనపై తానే జోక్ వేసుకోవడంతో అక్కడి వచ్చిన వారంతా ఫుల్ గా నవ్వేశారు. అందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా, తమన్ కామెంట్లు పూర్తిగా ఫన్ కోసమే అన్నట్టు కనిపించినా, సోషల్ మీడియాలో మాత్రం రకరకాల చర్చలు మొదలయ్యాయి. కొందరు ఇది కేవలం కామెడీ గా తీసుకుంటుంటే, మరికొందరు మాత్రం ఇలాంటి కామెంట్స్ అనవసర ఊహాగానాలకు దారితీస్తాయని అభిప్రాయపడుతున్నారు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీపై ఇలా మాట్లాడటం కొత్త వివాదానికి కారణమవుతుందోమోనని మరికొందరు అనుమానపడుతున్నారు.
ఇంకొందరు అసలు అలాంటి కామెంట్స్ అవసరమే లేదని చెబుతున్నారు. ఇక హర్ష్ రోషన్, శ్రీదేవి ఇప్పటికే కోర్ట్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ మూవీ తర్వాత మరోసారి జంటగా బ్యాండ్ మేళం సినిమాలో నటిస్తున్నారు. ఆ చిత్రంలో కూడా వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ స్పెషల్ అట్రాక్షన్ ఎలిమెంట్ గా ఉండబోతుందని ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా క్లారిటీ వచ్చింది.
సినిమాలో బావమరదలుగా కనిపించనున్న ఆ జంటపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి పెరిగింది. ఏదేమైనా తమన్ చేసిన కామెంట్లు టీజర్ లాంచ్ కార్యక్రమానికి మంచి బజ్ తీసుకొచ్చాయని చెప్పాలి. సినిమా ప్రమోషన్లకు ఇది ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. కానీ అవి ఫ్యూచర్ లో ఎలాంటి అర్థాలకు దారి తీస్తాయో చూడాలి. ప్రస్తుతం మాత్రం తమన్ కామెంట్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
