కాపీ మ్యూజిక్ పై తమన్ రియాక్షన్.. నాపై కక్ష కట్టారు అంటూ!
తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "గుంటూరు కారం సినిమా సమయంలో కాపీ ట్రోల్స్ ని ఎదుర్కొని సోషల్ మీడియాలో చాలా ఇబ్బంది పడ్డాను.
By: Madhu Reddy | 28 Sept 2025 12:29 PM ISTప్రస్తుతం టాలీవుడ్ లో దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్.తమన్ కూడా ఒకరు. ప్రస్తుతం స్టార్ హీరోలు సినిమా అనౌన్స్ చేస్తున్నారంటే చాలు ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ని ఎంచుకుంటున్నారు చాలామంది దర్శక నిర్మాతలు. అలా తమన్ ప్రతి సినిమాకి డిఫరెంట్ మ్యూజిక్ అందిస్తున్నప్పటికీ ఎక్కడో ఓ దగ్గర కాపీ చేస్తున్నారు అనే ట్రోల్స్ మాత్రం ఆయన్ని వీడడం లేదు. ముఖ్యంగా ఆయన చేసే ప్రతి ఒక్క సినిమాకి ఏదో ఒక కాపీ సాంగ్ అందిస్తూ ఉంటారు. అందుకే సోషల్ మీడియాలో చాలామంది ఈయనను కాపీ తమన్ అంటూ పిలవడం స్టార్ట్ చేశారు.
ఆయన మ్యూజిక్ అందించిన సినిమా నుండి ఏదైనా చిన్న పాట విడుదలయితే చాలు అది ఏ సినిమాలోది అని వెతికే పనిలో పడతారు నెటిజన్స్.అలా మహేష్ బాబు సినిమా విషయంలో కాపీ ఆరోపణలు ఎదుర్కొని ఆయన అభిమానుల వల్ల తీవ్ర మనోవేదనకు గురయ్యారట తమన్. మరి ఇంతకీ మహేష్ బాబు అభిమానులు చేసిన పనేంటి..? ఎందుకు తమన్ అంతలా బాధపడ్డారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "గుంటూరు కారం సినిమా సమయంలో కాపీ ట్రోల్స్ ని ఎదుర్కొని సోషల్ మీడియాలో చాలా ఇబ్బంది పడ్డాను. త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 28 మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ చేస్తున్నారు అని అఫీషియల్ గా చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడంతో చాలామంది సోషల్ మీడియాలో నాపై విమర్శలు చేశారు.ఎస్ ఎస్ ఎం బి 28 నుండి తమన్ ని వెంటనే తొలగించండి అనే హ్యాష్ ట్యాగ్స్ ఎక్స్ వేదికగా దాదాపు 67.1k పోస్టులు వైరల్ చేశారు.
ఈ పోస్టులు చూసి నేను చాలా బాధపడ్డాను. ఆ సంఘటన వల్ల ఇప్పటికి బాధపడుతున్నాను. మహేష్ బాబు అభిమానులు నాపట్ల చాలా వ్యతిరేకత కలిగి ఉన్నారు.కానీ నేను ఎప్పుడూ మహేష్ బాబుకి చెడు ఆల్బమ్ ఇవ్వలేదు.. ఇక ఈ ట్రోల్స్ ఎదురైన సమయంలో త్రివిక్రమ్ నాకు చాలా అండగా నిలిచారు.సోషల్ మీడియాని పట్టించుకోకు. సోషల్ మీడియా నుండి నీ దృష్టి మరల్చి పనిమీద పెట్టుకో సోషల్ మీడియాని చూస్తూ కూర్చుంటే పని జరగదు అని నాకు అండగా నిలిచారు. ఆ సమయంలో నాపై వచ్చిన వ్యతిరేకతకి చాలా బాధపడ్డాను. ఓ సందర్భంలో ఏడ్చాను కూడా.." అంటూ మహేష్ బాబు అభిమానుల వల్ల బాధపడ్డ క్షణాలను తమన్ అందులో పంచుకున్నారు. ఇక మహేష్ బాబు గుంటూరు కారం మూవీ విడుదలైనప్పుడు 'కుర్చీ మడతపెట్టి' అనే పాట పూర్తిగా తమన్ కాపీ చేశారు అనే విమర్శలు ఎదుర్కొన్నారు.
అలాగే ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ గురించి తమన్ మాట్లాడుతూ.." ప్రభాస్ ది రాజాసాబ్ మూవీకి మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చాను. ఈ సినిమాకి ప్రభాస్ నేను కుమ్మి పడేసాం.. మారుతీ డైరెక్షన్ సినిమా ఎలా ఉంటుందో ది రాజా సాబ్ సాబ్ మూవీ తో ప్రూవ్ చేసుకుంటాడు" అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలాగే ది రాజా సాబ్ మూవీ విడుదలయ్యాక మీరు ఉప్పలపాటి తమన్ అవుతారు కావచ్చు అని యాంకర్ అనడంతో తమన్ నవ్వుకున్నారు.. ఇక తమన్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాల విషయానికి వస్తే..ఆయన ది రాజా సాబ్ మూవీ తో పాటు బాలకృష్ణ నటిస్తున్న అఖండ-2 మూవీకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే NBK111, చిరంజీవి, బాబి డైరెక్షన్లో రాబోతున్న సినిమాకి కూడా తమన్ ని మ్యూజిక్ డైరెకర్ గా ఎంచుకున్నారు.
