Begin typing your search above and press return to search.

బిఫోర్ ఓజీ.. ఆఫ్టర్ ఓజీ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇన్వాల్వ్ మెంట్ ఏంటన్నది సినిమా చూసిన వాళ్లకు బాగా తెలుస్తుంది

By:  Ramesh Boddu   |   2 Oct 2025 10:37 AM IST
బిఫోర్ ఓజీ.. ఆఫ్టర్ ఓజీ..!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇన్వాల్వ్ మెంట్ ఏంటన్నది సినిమా చూసిన వాళ్లకు బాగా తెలుస్తుంది. ఓజీ మొదలైనప్పటి నుంచి థమన్ డ్యూటీ ఎక్కేశాడు. సినిమా రిలీజ్ అయ్యేంతవరకు అతను ది బెస్ట్ ఇస్తూ వచ్చాడు. ఓజీ గ్లింప్స్ తోనే సినిమాకు హై రేంజ్ ఇచ్చిన థమన్ నెక్స్ట్ సినిమాలో బిజిఎం తో అదరగొట్టాడు. ఐతే ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో ఓజీ పై పవన్ కళ్యాణ్ పై ప్రేమను మరోసారి చూపించాడు థమన్.

ఈ సినిమా కల్ట్స్ కోసమే..

బిఫోర్ ఇండిపెండన్స్ ఆఫ్టర్ ఇండిపెండన్స్ అంటారు కదా అలానే బిఫోర్ ఓజీ.. ఆఫ్టర్ ఓజీ అనాలి. ఈ సినిమా కల్ట్స్ కోసమే.. అవును వాళ్లని కల్ట్స్ అనాల్సిందే. సినిమా గురించి సోషల్ మీడియాలో వాళ్ల ఇన్ పుట్స్ ఇస్తూ ఇలా చేయండి అలా చేయండి అని సినిమాకు ఒక హై ఇచ్చారు. ఇది మీ విజయం.. మీరు విజయాన్ని మీరు మాకు ఇచ్చారు మేం మీకిస్తున్నా గివ్ అండ్ టేక్ పాలసీ అన్నారు థమన్.

ఈ సినిమా వైబ్ ఎలా ఉంది అంటే ప్రపంచంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా కోసం ఎదురుచూశారు. సినిమాకు వాళ్లంతా ఒక హై ఇచ్చారు. యూఎస్ లో సినిమా రిలీజ్ ముందు ఫ్యాన్స్ అంతా కలిసి సినిమాను ప్రమోట్ చేశారు. ఎక్కడో ప్రింట్ వెళ్లలేదు అని సోషల్ మీడియాలో పెడితే 20 మంది మేము పంపిస్తామని ముందుకొచ్చారు.

ఇంట్లో కన్నా సోషల్ మీడియాలో ఎక్కువ..

తాను ఇంట్లో కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటా. ఫ్యాన్స్ అందరి ఆలోచనలు తీసుకుని సుజిత్ తో కలిసి ఇది చేశామని అన్నారు థమన్. సినిమాకు పనిచేసిన టీం కూడా ఒక్కరు కూడా కనీసం నిద్రలేదని ఆవులింతలు కూడా కనిపించని విధంగా పనిచేశారు. ఓజీ సినిమా తన కెరీర్ లో స్పెషల్ మూవీ అని అన్నారు థమన్.

థమన్ చెప్పడం కాదు ఫ్యాన్స్ కూడా ఓజీ చూసి థమన్ విధ్వంసం అని ఫిక్స్ అయ్యారు. ఓజీలో వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ గా పవన్ కళ్యాణ్ నిలబడ్డ తీరు ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చింది. గ్లింప్స్ నుంచే ఈ సినిమా అన్ని సినిమాల మాదిరి కాదనే హింట్ ఇచ్చేలా మ్యూజిక్ ఇచ్చిన థమన్. సినిమాలో ప్రతి పవర్ స్టార్ ఫ్యాన్ పండగ చేసుకునేలా మ్యూజిక్ ఇచ్చాడు. ఓజీ తర్వాత నుంచి ఇక మనం అంతా కూడా కొత్త థమన్ ని చూసే అవకాశం ఉందనిపిస్తుంది.