థమన్ టాప్ లీగ్.. ఇదేం విధ్వంసం సామి..!
OG సినిమాలో థమన్ బిజిఎం విన్న ఆడియన్స్ సూపర్ ఎంజాయ్ చేశారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఓజీ సినిమాకు థమన్ చేసిన డ్యూటీకి బ్లాక్ బస్టర్ అనేస్తున్నారు.
By: Ramesh Boddu | 5 Oct 2025 12:35 PM ISTOG సినిమాలో థమన్ బిజిఎం విన్న ఆడియన్స్ సూపర్ ఎంజాయ్ చేశారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఓజీ సినిమాకు థమన్ చేసిన డ్యూటీకి బ్లాక్ బస్టర్ అనేస్తున్నారు. సుజిత్, థమన్ ఇద్దరు కూడా ఓజీని ముందు నుంచి చాల ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా చేస్తూ వచ్చారు. ఐతే థమన్ నెక్స్ట్ రాబోతున్న సినిమాలతో కూడా తన మ్యూజిక్ తో అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ మంత్ మిడిల్ లో థమన్ తెలుసు కదా సినిమాతో వస్తున్నాడు.
డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న అఖండ 2..
ఈ సినిమాకు కూడా థమన్ క్లాసీ మ్యూజిక్ ఇచ్చినట్టు ఉన్నాడు. ఇక డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న అఖండ 2 సినిమా విషయంలో మరోసారి థమన్ తన ఫైర్ చూపిస్తాడని తెలుస్తుంది. థమన్ అఖండ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ తో స్పీకర్లు బ్లాస్ట్ అయ్యాయి. ఇప్పుడు అఖండ 2 తాండవం సినిమాకు మరింత ఇంపాక్ట్ చూపించబోతున్నాడు. తెర మీద బాలయ్య బాబు, తెర వెనక థమన్ ఇద్దరు కూడా అదరగొట్టబోతున్నారు.
ఇక నెక్స్ట్ సంక్రాంతికి థమన్ మ్యూజిక్ విధ్వంసం కూడా ఉండబోతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమాకు థమన్ మ్యూజిక్ సంథింగ్ స్పెషల్ కాబోతుంది. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి సత్తా చాటబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ లో థమన్ బిజిఎం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సో రాబోతున్న అఖండ 2, రాజా సాబ్ రెండిటితో థమన్ మరోసారి మాస్ మూజిక్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు.
ఓజీ తో థమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్..
థమన్ ఈమధ్య ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేశాడంటే దానికి అతని మ్యూజిక్ పెద్ద హైలెట్ అవుతుంది. ఓజీ తో థమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇక నెక్స్ట్ అఖండ 2, రాజా సాబ్ ఈ రెండిటితో మరోసారి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారబోతున్నాడు. రాజా సాబ్ సినిమాకు డిఫరెంట్ మ్యూజిక్ తో థమన్ సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. మరి ఈ సినిమాల్లో ఏది థమన్ కు ఎక్కువ పేరు తెచ్చిపెడుతుంది అన్నది చూడాలి.
ప్రస్తుతం టాలీవుడ్ లో మరో మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ రేంజ్ ఫాంలో లేడు. థమన్ టాలీవుడ్ లో టాప్ లీగ్ లో దూసుకెళ్తున్నాడు. ఓజీ సందడి నడుస్తుంది. నెక్స్ట్ అఖండ 2, రాజా సాబ్ టైంలో మరోసారి థమన్ గురించి అందరు మాట్లాడుకునేలా పరిస్థితి ఉంటుందని తెలుస్తుంది.
